‘గాయత్రి’ అనే ఒక పాత (డబ్బింగ్? ) సినిమా ఉంది. దానిలో హీరోయిన్ అటు వైపు మొహం పెట్టి నిలబడి వుంటుంది. ఆమె దగ్గరకు వెళ్తాడో వ్యక్తి. పిలుస్తాడు.
ఆమె హఠాత్తుగా వెనక్కి తిరుగుతుంది. అప్పుడామె మొహం అనూహ్యంగా - వికృతంగా కనపడి ప్రేక్షకులకు ఒక్కసారిగా జలదరింపు కలుగుతుంది.
హారర్ సినిమాల్లో ఈ టెక్నిక్ ను చాలాసార్లు వాడుతుంటారు.
* * *
హైదరాబాద్ లో సాలార్ జంగ్ మ్యూజియం చూసినవారికి అక్కడి ‘డబుల్ స్టాచ్యూ ’ ప్రత్యేకత తెలిసేవుంటుంది.
ఇదే ఆ శిల్పం! దీన్ని ఫొటో రూపంలో నేను మొదటిసారి చూసినపుడు చాలా థ్రిల్ ఫీలయ్యాను.
ఏ కోశానా పోలిక లేని వేర్వేరు ముఖాలతో- భంగిమలతో ఉన్నది ఒకే శిల్పం అంటే చప్పున నమ్మ శక్యం కాలేదు.
పరిశీలించి చూస్తే గానీ ఆ భంగిమలోని మర్మం అర్థం కాలేదు.
19వ శతాబ్దంలోని ఈ దారు (చెక్క) శిల్పాన్ని గుర్తు తెలియని ఫ్రెంచి కళాకారుడు చెక్కాడట. జర్మన్ నాటక కర్త గెథె ( క్రీ.శ. 1808) రాసిన ‘డాక్టర్ ఫాస్టస్’ నాటకంలోని రెండు పాత్రలు మెఫిస్టోఫిలిస్- మార్గరెట్టా. చెడుకూ, మంచికీ ప్రతీకలు.
మెఫిస్టోఫిలిస్ తల పైకెత్తి ఒక చేతిని మడిచి వీపు వెనక్కి వంచి రొమ్ము విరుచుకోవడంలో మొహంలోని తీక్ష్ణతతో కలిపి ఆ పాత్ర స్వభావం వ్యక్తమవుతుంది.
మరి అతడి వీపు భాగాన చెక్కిన మార్గరెట్టా ?
మెఫిస్టోఫిలిస్ భంగిమ... వీపు వెనకవైపున్న ఆమె రూపానికీ, స్వభావానికీ తగినట్టు పూర్తిగా భిన్న ప్రయోజనం కలిగించింది.
తల కిందికి దించి, చేతిని ముందుకు పెట్టి నమ్రతగా ముందుకు వంగినట్టు తయారైంది. ఆమె భంగిమా, మొహంలోని ప్రశాంతతా చూస్తే .. పూర్తి వేరే శిల్పంలా భ్రమ కలిగిస్తుంది.
అతడి తలపాగా ఆమె మేలి ముసుగుగా మారిందని గమనించారా?
సందర్శకుల వైపు మెఫిస్టోఫెలిస్ ను ఉంచి, అద్దంలో వీపు వైపున్న మార్గరెట్టాను కనపడేలా చేయటం కూడా బాగుంది.
ఒకవేళ దీనికి వ్యతిరేకంగా చేసివుంటే (మార్గరెట్టాను మనవైపు ఉంచి, అద్దంలో మెఫిస్టోఫిలిస్ ను చూపించివుంటే) ప్రేక్షకులకు ఈ స్థాయి అనుభూతి కలగకపోయేది!
అయినా మార్గరెట్టాను ఇటువైపు నుంచే చూడాలనివుందా?

ఈ బొమ్మ చూడండి, ఇది మ్యూజియంలోది కాదు; మరెక్కడిదో !
ఇలాంటి శిల్పం మరెక్కడైనా ఉందా?
హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట కు వెళ్ళే దారిలో ‘సురేంద్రపురి’ అనేచోట ‘కుందా సత్యనారాయణ కళాధామం’ ఉంది. దీనిలో చాలా దేవాలయాలున్నాయి.
ప్రవేశం దగ్గర నిలువెత్తు పంచముఖ ఆంజనేయ విగ్రహం... ఇలా కనపడుతుంది.
ఇదే విగ్రహం వెనక చూస్తే..
ఇదిగో... ఐదు ముఖాలున్న శివుడి రూపం!
ఆంజనేయుడు గదనూ, శివుడు త్రిశూలాన్నీ ఒకే భంగిమలో పట్టుకునివుంటారు.
తల చుట్టూ శరీరంలో సగభాగం వరకూ చెక్కిన ఫ్రేమ్- చెరో వైపునా వేర్వేరు రూపాలను సులువుగా చెక్కటానికి వీలు కల్పించింది.
ఈ భారీ శిల్పానికి స్ఫూర్తి ... మ్యూజియంలోని దారు శిల్పమే అయివుంటుందా? ఏమో!
శిల్పంలోనైనా, చిత్రంలోనైనా, మరే కళలోనైనా ఇలాంటి వైచిత్రి, వైవిధ్యం ఆహ్లాదాన్నీ, గుర్తుంచుకోదగ్గ అనుభూతినీ కలిగిస్తాయి కదూ!
తాజా చేర్పు (4.5.2015)
తూర్పు గోదావరి జిల్లా ర్యా లిలో కూడా దాదాపు ఇలాంటిదే.. విభిన్నమైన విగ్రహం ఉంది.
విగ్రహం ముందు వైపు విష్ణువు (కేశవస్వామి) రూపం ఉంటే .. వెనుకవైపున జగన్మోహిని - వెనుదిరిగి ఉన్న రూపం చెక్కారు.
‘జగన్మోహిని’ రూపం అంటే అత్యంత సౌందర్యంతో ఉండాలి కదా? దాన్ని ఆ స్థాయిలో చిత్రించడం, ఒప్పించడం కష్టతరం కాబట్టి- అలా వెనక్కి తిరిగివున్నట్టు చెక్కాడా శిల్పకారుడు!?

![]() |
మరో కోణంలో.... |