సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

18, సెప్టెంబర్ 2012, మంగళవారం

గురజాడ ‘దేశభక్తి’ గేయం... అసలు రూపం ఇదీ!

సెప్టెంబరు 21న  మహాకవి గురజాడ అప్పారావు 150 వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని  పాఠశాలల్లో  ‘దేశభక్తి’ గేయం ఆలపించబోతున్నారు. 

ఇంతకీ...  గురజాడ రాసిన ప్రసిద్ధ ‘దేశభక్తి గేయం’ సరైన వర్షన్ ఏమిటి? 

ఇన్నేళ్ళ తర్వాత ...

ఈ ప్రశ్న ఎందుకొచ్చిందంటే...

ఈ గేయం ప్రచురించిన 99 సంవత్సరాల్లో ప్రతిచోటా ఎన్నో మార్పులకు గురైంది. 

క్రియాంతాలు మారాయి. 

పద స్వరూపాలు వేరేవి  వచ్చాయి. 

విరామ చిహ్నాల్లో కూడా తేడాలే!

వి రాసింది రాసినట్టు  పాఠకులకు అందాలి.

అక్షరం కూడా మార్చకూడదు కదా?  

యథాతథంగానే మనం ఆ గేయాన్ని చదువుకోవాలి కదా?  

పాడుకోవాలి కదా?   

అందుకే...  గురజాడ  జీవితకాలంలోనే- తొలిసారిగా- ‘కృష్ణాపత్రిక’లో  ప్రచురితమైన ఈ గేయం ఎలా ఉందో చూడాలి.

తర్వాత ఈ గేయానికి ఆయన చేసిన మార్పులనూ గమనించాలి.

ఈ రెండూ ఇక్కడ చూడండి....

99 సంవత్సరాల క్రితం..

కృష్ణా పత్రికలో  వచ్చిన... 

 దేశభక్తి  గేయం  ఇక్కడ ఇస్తున్నా, చూడండి!


(ఈ ప్రతి కోసం చాలామంది ప్రయత్నించారు కానీ  లభించలేదు.

నాకు ‘శ్యామ్ నారాయణ’ గారి ద్వారా దొరికింది).




స్వదస్తూరితో గురజాడ మొదటి మూడు చరణాలకు  చేసిన మార్పులు...



ఆయన చేతిరాతతో  ఈ గేయంలోని  ప్రసిద్ధ పాదాలు...


యితే గురజాడ రాసిన దేశభక్తి గేయం ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో మార్పులతో  ప్రచురితమవుతూ వచ్చింది. పాఠశాల విద్యార్థులు చదువుకునే  ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో కూడా ఇదే తీరు.   ప్రచురణకర్తల నిర్లక్ష్యమో,  అశ్రద్ధో,  ఉదాసీనతో... ఏదైతేనేం?  ఇన్నేళ్ళుగా  ఇలాగే  జరుగుతూ వచ్చింది.  దీన్ని ఎత్తిచూపుతూ నేను రాసిన వ్యాసమిది... 


ఈ వ్యాసం  ‘ఈనాడు’ ఎడిట్ పేజీలో నిన్న  ప్రచురితమైంది!

9 కామెంట్‌లు:

వేణు చెప్పారు...

కొద్దిరోజుల క్రితమే Gurazada's song of songs' అనే చిన్న పుస్తకం విడుదలైంది. శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకం (వెల: రూ. 25) సంకలనకర్త పోరంకి దక్షిణామూర్తి.

ఈ పుస్తకం నిన్ననే కొన్నాను.

దీనిలో తెలుగుతో పాటు ఏడు భాషల్లో ‘దేశభక్తి’ గేయాన్ని అందించారు. నేనెప్పటినుంచో చూడాలనుకుంటున్న శ్రీశ్రీ అనువాదం కూడా దీనిలో ఉన్నందుకు సంతోషించాను.

తెలుగు గేయం ఎలా ఉందోనని ఆసక్తిగా చూశాను. క్రియాపదాలన్నీ సరిగానే ఉన్నందుకు ఆశ్చర్యం వేసింది. చివర్లో ‘కవిత కోయిల’ అనే ఉంది (కోవిల, కోకిల అనకుండా) !

నేను ఇంతవరకూ చూసినవాటిలో చక్కగా ప్రచురించిన దేశభక్తి గేయం ఇదే అనిపించింది!

జాగ్రత్తగా పరిశీలించాను. తేడాలు లేకేం? దీంతో నా అభిప్రాయం మారిపోకతప్పలేదు. చూడండి, దోష ప్రకరణం! (ఇదంతా ‘తప్పులెన్నే’ ఉబలాటం కాదు. ఒక చారిత్రక గేయాన్ని దోషాలేమీ లేకుండా ప్రచురించలేకపోతున్నారే అనే ఆవేదన.)

1) రెండో చరణంలో- తిండి కలిగితె బదులు చివర్లో ‘తే’అంటూ దీర్ఘం వచ్చింది.
2) అదే చరణంలో- కండ కలవాడే తర్వాత ‘ను’ ఎగిరిపోయింది.
3) మూడో చరణంలో- దేశి సరుకులు తర్వాత ‘నించవోయి’ బదులు ‘నింపవోయి’అని ప్రచురించారు.
4) నాలుగో చరణంలో- ‘డబ్బు’బదులు ‘ఉబ్బు’ అట!
5) ఐదో చరణంలో- ‘వెనక’బదులు ‘వెనుక’అని ఇచ్చారు.
6) ఆరో చరణంలో-‘వాణిజ్యమందే’బదులు ‘వాణిజప్యమందే’అట!
7) ఏడో చరణంలో- ‘వొట్టి’అని ఉండాల్సింది ‘వట్టి’అని ఇచ్చారు.
8) అదే చరణంలో- ‘చెప్పుకోకోయి’ బదులు ‘చెప్పకోకోయి’
9) ఎనిమిదో చరణంలో- ‘పిశాచి’ని ‘పైశాచి’గా మార్చేశారు!
10) అదే చరణంలో- ‘మేలుకు’ బదులు ‘మేలుకి’
11) పదో చరణంలో- ‘స్వంత’బదులు ‘సొంత’అనే సొంతమాట!
12) అదే చరణంలో- ‘తోడపడువోయి’కి బదులు ‘తోడ్పడవోయి’
13) పన్నెండో చరణంలో- ‘మతం వేరైతేను’ తర్వాత ‘యే’ అని అసంపూర్తి పదం. అక్కడ ‘యేమోయి?’ అని రావాలి.
14) అదే చరణంలో- ‘పెరిగి’ బదులు ‘పెరిగీ’
15) పదమూడో చరణంలో- ‘తడసి’ బదులు ‘తడిసి’


* 8, 9 చరణాల వరసను 9, 8 చరణాలుగా ఇచ్చారు. (చరణాలకు గురజాడ 1,2, 3 అంటూ అంకెలు ఇచ్చారు. దాన్ని పాటించివుంటే చెకింగ్ లో ఈ తేడా వెంటనే కనపడి, వచ్చుండేది కాదు.)
* విరామచిహ్నాలు ఉపయోగించటంలో కూడా తేడాలున్నాయి కానీ వాటిని నేను లెక్కించలేదు.
* ఈ పుస్తకంలో ఉపయోగించిన లోగోలో ‘దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా’ అని ఉంది. ‘మంచి అన్నది’ అని లేనందుకు ఆ లోగోను ఉపయోగించివుండకూడదు. కానీ 15 దోషాలున్న గేయం ప్రచురించి ఈ లోగో వాడటం వల్ల కొత్తగా వచ్చిపడే నష్గమేమీ లేదు కదా!

మరో విషయం- ఈ దేశభక్తి గేయం తొలిసారిగా కృష్ణాపత్రికలో 1913లో ప్రచురితమైందనే అనుకుంటున్నాం. విశాలాంధ్ర , ఇతర పుస్తకాల్లో ఇదే సమాచారం ఉంది. కానీ ఈ Gurajada's song of songs లో ఈ గేయం 1910లోనే ‘ఆంధ్రభారతి’లో ప్రచురించారని రాశారు; ఏ నెలలో వచ్చిందో పేర్కొనలేదు.

ఇంతకీ ఈ సమాచారం వాస్తవమేనా?

GKK చెప్పారు...

వేణుగారు! ఈ గేయానికి బాణీ కట్టడానికి అనువుగా కొన్ని ’creative liberties' తీసుకున్నారేమో అనిపిస్తుంది. వోయి కాస్తా వోయ్ అవటం వల్ల తాళం కుదురుతుంది. కానీ appeal చేసినట్టుగా కాకుండా గద్దించినట్టు అర్థం మారిపోయింది.
నిజమే! పాఠాంతరాలు కవి హృదయాన్నే మార్చివేయగలవు. గురజాడ స్వదస్తూరి ప్రతి మీరు ప్రచురించటం బాగుంది.

వేణు చెప్పారు...

తెలుగు అభిమాని గారూ! మీ వ్యాఖ్య అర్థవంతం. పాటలో బాణీ కోసమని తీసుకునే లిబర్టీ అర్థం చేసుకోదగిందే. కానీ దేశభక్తి లాంటి చారిత్రక గేయాల విషయంలో బాణీ కోసం కూడా మార్పులు చేయకపోవటమే మంచిది! సాహిత్యాన్ని (పరి)మార్చని బాణీనే ఎంచుకోవాల్సివుంటుంది.

ఏల్చూరి మురళీధరరావు చెప్పారు...

మీ వ్యాసాన్ని ఇప్పుడే చదివాను, వేణు గారు! చాలా చాలా బాగున్నది.

వేణు చెప్పారు...

మురళీధరరావు గారూ, మీ స్పందన ఆనందం కలిగిస్తోంది. థాంక్యూ!

M b d syamala చెప్పారు...

వేణు !ఆధునిక సాహిత్యానికియుగకర్త అనదగినవాడు గురజాడ!అటువంటి మహాకవి వ్రాసిన అతి ప్రసిద్ధ గేయం యీ దేశభక్తి గేయం!కారణాలేవైనా దీనిలో మార్పులు చేర్పులు చేయడం సరికాదు!నువ్వుచేసిన కృషి ప్రశంసనీయం!ముఖ్యంగా గురజాడ చేతిరాతను సంపాదించి మాకు కానుకగా యిచ్చిన నీ పరిశోధనకు ధన్యవాదాలు!

Zilebi చెప్పారు...


వందేళ్లలో ఇన్నేసి దోషాలా !

మీరీ టపాలో సరియైన పద్ధతి లో టైప్ చేసి టపాగా పెడితే బాగుంటుంది కూడాను


జిలేబి

వేణు చెప్పారు...

@ Syamala: గురజాడ చేతిరాత విశాలాంధ్ర ప్రచురణల్లోనే ఉంది. దాన్ని ఇక్కడ ఇవ్వటమే నేను చేసింది. థాంక్యూ.

@ Zilebi : టైప్ చేసి పెట్టివుండవచ్చు. కానీ ఈ యథాతథంగా ఇస్తేనే విశ్వసనీయత ఉంటుందని నాటి కృష్ణాపత్రిక ప్రచురణ భాగాన్ని Image రూపంలో పెట్టాను. Thank you..

Unknown చెప్పారు...

మహాశయా! గురజాడవారి దేశభక్తి గీతాన్ని
వారి స్వదస్తూరీప్రతిని ప్రకటించిన మీకు ధన్యవాదాలు.