సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

30, జనవరి 2016, శనివారం

అనూహ్య దృశ్యకళతో ‘నిశాచర్’ మ్యాజిక్!


మధ్యనే అనుకోకుండా ఓ వెబ్ సైట్లో  చూశాను,  ఆయన బొమ్మలను!

చూడగానే ఇట్టే ఆకట్టుకున్నాయి.

సంభ్రమపరిచే  ఊహలూ, అనూహ్యమైన కోణాలూ....
మురిపించే  రేఖలూ, మెరుపుల రంగులూ...

ఈమధ్యకాలంలో నన్ను బాగా ఆకట్టుకున్నఆ చిత్రకారుడు ముకేష్ సింగ్. భారతీయ చిత్రకారుడే!


కొద్దికాలంగా ‘నిశాచర్’ పేరుతో బొమ్మలు వేస్తున్నారు.

ఆయన కామిక్ బుక్ ఆర్టిస్టు, ఇలస్ట్రేటర్. మోషన్ గ్రాఫిక్స్, సీజీ మోడలింగ్ చేస్తారు.

నిశాచర్ చిత్రాలు కొన్ని చూడండి- 


ముఖ్యంగా ఎపిక్ విజువల్ ఆర్ట్ లో ఆయన ప్రతిభ శిఖరస్థాయిలో కనపడుతుంది. 

పురాణేతిహాసాల ఘట్టాలను ఎవరూ ఊహించని కోణంలో, గాఢతతో, కళ్ళముందుంచే నేర్పు ఆయనది.  విశాలమైన కేన్వాస్ లో తన  విశేషమైన ఊహలకు రెక్కలు కట్టి కాదు;  రాకెట్లు కట్టి  ఎగరేస్తారు.

రక్తబీజుడూ, అఘోరీల బొమ్మలను  ఒళ్ళు జలదరించే రీతిలో చిత్రించారు. మరీ చిన్నపిల్లలు వాటిని చూడలేకపోవచ్చు.  

అందుకే  ఆ బొమ్మలను ఇక్కడ ఇవ్వటం లేదు.

మహాభారత ఘట్టాలకు ఆయన వేసిన బొమ్మలు పూర్తిగా భిన్నమైనవి. పాత్రలన్నీ మనకు తెలిసిన ఆహార్యంతో, రూపురేఖలతో కాకుండా సరికొత్తగా  కనపడతాయి.

ఆ  ‘కాన్సెప్ట్ డ్రాయింగులు’ చాలా బాగుంటాయి.


‘వెయ్యి  ఏనుగుల బలం’ఉన్నట్టు కవి వర్ణించిన  భీముడిని అంతే స్థాయిలో చిత్రించారు.
కృష్ణుడు కొత్త రూపంతో కనపడతాడు. నిద్రపోతున్న కృష్ణుడి దగ్గరకు దుర్యోధనుడూ, అర్జునుడూ  యుద్ధంలో సాయం కోరడానికి వస్తారు కదా?  ఆ ముగ్గుర్నీఎంతో ఎత్తునుంచి చూపిస్తూ వేసిన బొమ్మ చూడండి- 

భగవద్గీత చిత్రణ...  (మాట్లాడుతున్న దేవుడు)యుద్ధ దేవతను ఆవాహన చేస్తున్నఅర్జునుడు (లాంగ్ షాట్లో అర్జునుణ్ణి పెట్టి  ఆకాశంలోని యుద్ధ దేవత  భీకర స్వరూపాన్ని   క్లోజప్ లో చిత్రించగలిగాడు)


కర్ణ, ఘటోత్కచుల సమరం


బ్రహ్మఅగ్నిదేవుడుభారతయుద్ధం ముగిశాక  ఓ మృత కళేబరం వద్ద  ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం..విస్తృతమైన కేన్వాస్ లో ..  కురుక్షేత్ర రణస్థలి 
నిశాచర్ బొమ్మల్లో  సూక్ష్మాంశాల సవివరణ చిత్రణ, చలనశీలత  ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

ఆకర్షణీయంగా  అగ్నినీ,  మెరుపులనూ, అనూహ్య పరిసరాలనూ సృష్టించటంలో ప్రత్యేక అభినివేశం ఉన్న చిత్రకారుడీయన!

3 వ్యాఖ్యలు:

GKK చెప్పారు...

వేణుగారు! he is a great artist. అతను గీసిన బొమ్మలు మాయాప్రపంచంలోకి తీసుకు వెళుతున్నాయి. his style suits comic book illustrations. he is able to bring 3D effect in his pictures.

sambasiva చెప్పారు...

వేణు గారూ! బాగుందండీ. మీ కళాభిరుచికి అభినందనలు! నిశాచర్ పైన పాశ్చాత్య చిత్రకారుల ప్రభావం ఉన్నట్లు కనపడుతోంది. గాఢమైన వర్ణసమ్మిలితాలూ, భిన్నమైన ధృక్కోణం నుండి చిత్రణ ఇదంతా బాగున్నట్లు అనిపిస్తోంది గాని, మన నేటివిటీ కి దూరమయినట్లుగా కూడా ఉంది. చిత్రకారుడు ప్రతిభావంతుడే., సందేహం లేదు.!

చైతన్య కృష్ణ పాటూరు చెప్పారు...

వేణుగారు,
మంచి పరిచయం. ఇలా పాశ్చాత్య శైలిలో మన పౌరాణిక పాత్రలని చిత్రిస్తున్న కామిక్స్‌ని, ఆ చిత్రకారుల్ని నేను ఒక ఏడాదిగా ఫాలో అవుతున్నా. ముఖేష్ సింగ్ ఆర్ట్‌లో నాకు బాగా నచ్చిన చిత్రం ఆర్జునుడి బాణాలకి కూలుతున్న భీష్ముడి చిత్రం. కొడుకుని బాధగా గంగ ఒళ్ళోకి తీస్కుంటున్నట్టున్న ఈ చిత్రం నాకు బాగ నచ్చింది.

https://www.facebook.com/skycapricorn/posts/10207050474552713

అలాగే campfire ప్రచురుణలో వచ్చిన కొన్ని గ్రాఫిక్ బుక్స్ వచ్చాయి. వారి Krishna అనే గ్రాఫిక్ బుక్‍ చూసి ఆసక్తిగ ఫాలో అవుతున్నా. ఆర్టిస్ట్ రాజేశ్ నాగులకొండ అని అని తెలుగు వ్యక్తే. చిత్రణలో పాశ్చాత్య ప్రభావం తక్కువే కానీ కొత్తగ అనిపించింది.