సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

15, డిసెంబర్ 2009, మంగళవారం

తెలంగాణాపై రంగనాయకమ్మ గారి భావాలు!


సున్నితమైన ప్రాంతీయ భావోద్వేగాలు తెలుగు నేలను ఊపేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో విచక్షణ, సంయమనం, చర్చ ఎంతో అవసరం.


రచయిత్రి రంగనాయకమ్మ గారు  ‘తెలంగాణది ప్రత్యేక పరిస్థితి!’ అంటూ ఓ వ్యాసం రాశారు. ఇవాళ (మంగళవారం) ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిందిది.

ఈ పత్రిక చూడని, చదివే అవకాశం లేని పాఠకుల కోసం దీన్ని ఈ బ్లాగులో ఇస్తున్నాను.


‘నిరాహార దీక్ష ఒక తెలంగాణా వీరుడు చేస్తే, ఒక ఆంధ్రా వీరుడు మాత్రం చేయలేడా?’ , ‘కుర్రాళ్ళలో ఆత్మహత్యల పిచ్చి చూసి అదంతా ఉద్యమ చైతన్యం అని ముచ్చట పడకండి!’ అంటూ సాగే ఆమె వాదన చూడండి.





‘తెలంగాణాకు హైదరాబాద్ ఇవ్వటం’ లాంటి కొన్ని విషయాలను ఆంధ్రా కోణంలో కూడా  చర్చించాల్సిందని ఈ వ్యాసం చదివిన కొందరు  చెప్పారని ... రంగనాయకమ్మ గారు అన్నారు.


 ‘నిజమే.  కానీ ఒకే వ్యాసంలో అన్ని విషయాలూ చర్చించటం సాధ్యం కాదు కదా!’ అన్నారామె.




దీంతోపాటు ఇటీవలే ఆంధ్రప్రభలో  రంగనాయకమ్మ గారు రాసిన చిన్న వ్యాసం కూడా ఇస్తున్నాను.




ఆమె అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చదివి చూడండి ఓసారి !

15 కామెంట్‌లు:

kanthisena చెప్పారు...

"జ్ఞాన ప్రదర్శనలు అరుదు కానీ అజ్ఞాన ప్రదర్శనలకు కొరత వుండదు." రంగనాయకమ్మ గారి ఈ ఒక్క వాక్యం చాలు.. జరుగుతున్న దాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి..

Unknown చెప్పారు...

ధన్యవాదాలు మిత్రమా. దీనిని చదివిన తర్వాత కొందరైనా ఆంధ్ర సోదర సోదరీమణులు వాస్తవాలు గ్రహిస్తారని ఆశిద్దాం

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వేణు చెప్పారు...

ఓ ‘అజ్ఞాత’ వ్యాఖ్యలో వ్యక్తిగత దూషణ తొలగిస్తే... అది ఇలా ఉంది.

‘రంగనాయకమ్మ ... ఎంతసేపూ నాయకులు, వాళ్ళ ఆస్తుల మాటే తప్ప, తెలుగువాళ్ళందరు కలిసి ఉండాలనే మెజారిటీ ప్రజల భావన గుర్తించలేకపోయింది.’

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

తెలంగాణావాళ్ళు కోస్తా ఆంధ్రులపై దాడులు చేసేంత దుర్మార్గులు అని ఎలా అనుకున్నారు? హైదరాబాద్ ఐ.టి. ఇండస్ట్రీ మనం అనుకున్నంత గొప్పది కాదు. దాని వల్ల కొన్ని వేలు లేదా కొన్ని లక్షలు మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు ఇతర రంగాలలో పని చేసుకుంటూ బతకడమే. ప్రత్యేక తెలంగాణాకి విప్లవ రచయిత్రి ఓల్గా గారు కూడా మద్దతు ఇచ్చారు. విప్లవ రచయితలు మెజారిటీ ప్రజల కోసమే కానీ కేవలం హైదరాబాద్ అభివృద్ధిని కోరుకునే ఒక వర్గం కోసం కాదు.

Unknown చెప్పారు...

**** హైదరాబాదులో తప్ప మిగిలిన తెలంగాణా ప్రాంతాల్లో ఆంధ్రులెక్కడ ఉన్నారు? ***
సుజాత గారు నిజంగానే మీరు హైదరాబాదులో తప్ప మిగిలిన తెలంగాణా ప్రాంతాల్లో ఆంధ్రులు లేరనే అనుకుంటున్నారా. అయ్యో ఎంత అజ్ఞానం లో ఉన్నారండి ! వరంగల్, నిజామాబాద్ నల్గొండ ఖమ్మం ఎ జిల్లాలో చూసినా మీకు వందల సంఖ్యలో కాదు వేలు లక్షల సంఖ్యలో కనిపిస్తారు ఆంధ్రా వాళ్ళు. ఊర్లకు ఊర్లె వున్నాయి. గుంటూరు పల్లెలు కోకొల్లలు తెలంగాణలో.

**** ఏమో, రేపు విడిపోవడమంటూ జరిగితే ఆ తర్వాత మాట తప్పి "ఇక్కడ ఆంద్రోల్లు ఉండటానికి వీల్లే"దంటే ఏం చేయాలి? ***
ఇట్లాంటి ప్రశ్నలే మీ ఆంధ్ర నేతల్ని అడగండి . విలీనమప్పుడు చేసుకున్న ఒప్పందాలను ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయలేదు, తెలంగాణాకు సాగు నీటిలో, ఉద్యోగాల్లో ఎందుకు అన్యాయం చేసి వంచించారని. అడగండి. రంగనాయకమ్మ వ్యసం లో ఇట్లాంటి మంచి పాయింట్లు చాలా వున్నాయి. వాటి ని కూడా కాస్తనిజాయితీగా విశ్లేషించండి.
రేపు మద్రాస్ లో, బెంగుళూరు లో ఆంధ్రా వాళ్ళని అక్కడి వాళ్ళు గో బాక్ అంటే ఎం చేస్తారు. ?
వాదనకు న్యాయం ధర్మం వాస్తవాలతో పనిలేదా?

అజ్ఞాత చెప్పారు...

This is in refernce to Sujata comments
Have you stepped out any where else other other than Hyd to Andhra and vice versa ?
Do you really want to know in which other places are andhras in Telangana then go see the villages in warangal,Nizambad, Adilabad, Khammam, rangareddy districts.
You don't see them many in mehboobnagar because that district is always in drought and you don't see them many in Karimnagar too.( I don't know the reason, you might be knowing better)
మరి హైద్రాబాదుని ఈ ఆంధ్రా బూర్జువాలు అభివృద్ధి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నారెందుకు తెలంగాణా ప్రజలు? "ఇది మాది! దీన్ని అభివృద్ధి చేయడానికి వీల్లేదు"అని అడ్డుపడలేదేం?
Does the above make any sense ? except for vithanda vaadam ?
Any where in the world any Capital is little more developed than the rest.
అనేక ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా నివాసంగా మారిన తర్వాత "ఇది మాది! ఇక్కడినుంచి ఆంధ్రోల్లని తరిమేస్తాం" అనడం ఏ పాటి న్యాయం?
It was a home for other state people even before andhra was merged with it, for them it does not make any difference.
No one needs to go out from any where and no one can make you go out? when peopple like us who are atleast little bit educated are thinking that you have to go away once a state is seperated then no one can help.
ఏమో, రేపు విడిపోవడమంటూ జరిగితే ఆ తర్వాత మాట తప్పి "ఇక్కడ ఆంద్రోల్లు ఉండటానికి వీల్లే"దంటే ఏం చేయాలి?
Now when united, all these years when the policy makers and implementers 'enni saarlu maata tappaledu'

Anil Dasari చెప్పారు...

రాజన్నగారు,

కొత్తగా ఈ సోదర సోదరీమణుల పిలుపెందుకు? మీ తల్లీ మా తల్లీ వేరు కదా.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

ఒక రాష్ట్రంలోని ప్రజలు రెండుగా చీలిపోవడం అనే పాయింట్ వదిలి ఇది కేవలం ఆస్థి పంపకాల విషయంగానూ, పక్కా కమ్యూనిస్టు భాషలో చెప్పాలంటే బూర్జువాలు-కార్మికులు సమస్యగానూ రంగనాయకమ్మ గారు తేల్చడం ఆశ్చర్యం!

ఇక్కడ రాష్ట్రం రెండు ముక్కలు కావడం అనే అంశానికే విలువ లేదా?

చాలా మంది ఎలా మాట్లాడుతున్నారంటే తెలంగాణా ప్రజలు విద్యా రంగంలో వెనకపడ్డానికి ఆంధ్రులు కారణం, సాంస్కృతిక రంగంలో వెనకపడ్డానికి ఆంధ్రులు కారణం , వాళ్ళ మూఢ నమ్మకాలకు ఆంధ్రులు కారణం, వాళ్ళ పల్లెల్లో బ్రతుకులు ఛిద్రమవడానికి ఆంధ్రులు కారణం....

హైదరాబాదు అభివృద్ధికి మాత్రం ఆంధ్రా వ్యాపార వర్గాల పేరాశ కారణం! ఎక్కడి న్యాయమండీ ఇది?

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

సమైక్యత అనేది కేవలం మాటలకే పరిమితమైన ఆచరణలో లేని అంశం అయినప్పుడు రాష్ట్రం ముక్కలు అవ్వడం అనే అంశానికి విలువ ఉండదు. సమైక్యత అనేది ఆచరణలో ఉంటే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చేది కాదు.

భావన చెప్పారు...

రంగనాయకమ్మ గారు ఒక పక్షం నుంచే మాట్లాడేరు ఇంక దానిలో చర్చ ఏమి వుంది. ఇది ఆమె అభిప్రాయం అంతే..

వేణు చెప్పారు...

తెలంగాణా అంశంపై రంగనాయకమ్మ గారి భావాల గురించి నేను రాసిన టపాకు స్పందించిన అందరికీ ధన్యవాదాలు!

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI చెప్పారు...

telangaana udyama geetaalu/paatalakai..
www.raki9-4u.blogspot.choosi spandinchandi..prachaaram cheyandi..telangaana saadhiddaam...jai telangaana

అజ్ఞాత చెప్పారు...

మొదటి గా "నేను తెలంగాణ ఏర్పాటు కి వ్యతిరేకం కాదు".
ఇక రంగనాయకమ్మ విష్యానికి వస్తే......
రంగనాయకమ్మ అన్న ఈ మాటలు చాలా పిల్లతనం గా ఉన్నాయి. "తెలంగాణ తో కలిసి ఉనే వారికి పెద్ద లాభమే నన్న మాట.అంటే ఆంధ్ర తో కలిసి ఉంటే తెలంగాణ కి పెద్ద నష్టమే నన్న మాట".
"కలిసి ఉనడటం వలన ఇద్దరికీ లాభమే" అనేది సమైక్య వాదుల వాదన. అభివృధ్ధి అనేది ఒకరిని ఒకరు దోచుకొంటె కానీ సాధ్యం కాదా ఏమిటి. అలానే విడిపోతే ఇద్దరం నష్టపోతాం అని చెప్తున్నారు. విడి పోవటం వలన ఆంధ్రా బూర్జువాలు మళ్ళీ తెలంగాణ లో కొత్తవాళ్ళకి లంచాలు ఇచ్చుకోవాలి.కొత్త అధికార కేంద్రాలను ప్రసన్నం చేసుకోవాలి. ఆంధ్రలోనూ లంచాలు ఇచ్చుకోవాలి. కొంత కాలం వాళ్ళ ఆస్థుల విలువలు పడిపోతాయి.పరిశ్రమలు తాత్కలికం గా నైనా రావటం తగ్గుతుంది. దీని వలన తెలంగాణ వాళ్ళకు వచ్చే ఉద్యోగాలూ తగ్గుతాయి. తెలంగాణా బూర్జువాల ఆస్థులూ తగ్గుతాయి. కాకపోతే బాగా డబ్బున్న బూర్జువాలు తగ్గినప్పుడు మరింత కొనుగోళ్ళు జరుపుతారు. తరువాత ఆ నష్టం పూడే అవకాశం ఉంది. అంటే కానీ తెలంగాణ వాళ్ళ కి వచ్చిన నష్టం వలన ఆంధ్ర బూర్జువాలకి లాభం ఏమీ రాదు.
ఆమె లాగిక్ ఉపయోగించి.."తెలంగాణ బూర్జువాలకి తెలంగాణ వస్తే ఏదో పెద్ద లాభమే ఉందన్న మాట.అంటే తెలంగాణ వలన ఆంధ్ర వాళ్ళకి ఏదో పెద్ద నష్టమే ఉందన్న మాట!"
ఇక పోతే రాష్ట్రం విభజించ్టనికి రంగనాయకమ్మ అభిప్రాయ సేకరణ అవసరం లేదు అన్నారు. అదే సమయం లో తెలంగాణ పాఋటీలకి ఎన్నికలు తెలంగాణ అంశం పై గెలవమని ఒక సలహా ఇచ్చారు. ప్రస్తుతానికి తెలంగాణ అంశం ప్రాతిపదికన తెలంగాణ పార్టీ ఎన్నికలు గెలవలేదు. కాబట్టీ అలా జరిగే వరకూ తెలంగాణ ఏర్పాటుని వాయిదా వేయలా? వాయిదా వేయక పోతే ఏ ప్రాతిపదికన తెలంగాణ ఇవ్వాలి. టీవీ లలో కనపడే జనాల అల్లర్లని చూసి ఇవ్వాలా..ఆమె కి ఈ విషయం లో ఒక స్పష్టత లేనట్లు కనపడుతోంది.
ఎవరో ఒకరు ఇద్దరు మనుషుల టొ తాను మాట్లాడిన విషయలను బట్టి రంగనాయకమ్మ ఏవో నిర్ణయించుకున్నట్లు కూడా ఉంది (సైకిల్ పార్టీ కి వోట్ వెయ్యటం మొదలైనవి). ఆమె తో మాట్లాదిన వాళ్ళు తెలంగాణ ప్రజాలకు ఎంత ప్రాతినిధ్యం వహిస్తారో కూడా చూడాలి కదా.తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకించే తెలంగాణ స్నేహితులు నాకు తెలుసు. అంతమాత్రం చేత వాళ్ళూ తెలంగాణ ప్రజాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించలేరు.