సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

23, డిసెంబర్ 2011, శుక్రవారం

శ్రవణానంద కారకా... ఇళయరాజా ! (పార్ట్-1)


మాటలు విఫలమయ్యే చోటే  సంగీతం ప్రారంభమవుతుంది - ఇళయరాజా  రీ రికార్డింగ్ విశేషాలను తెలిపే ఓ   వెబ్ సైట్ హోమ్ పేజీలో కనపడే  వ్యాఖ్య ఇది.  

సినిమాల్లో  సంభాషణలకు ఆస్కారం లేని,  మాటలేవీ  పనిచేయని  దృశ్యాలుంటే  అక్కడి భావం ప్రేక్షకులకు అందించాలంటే ఎలా? ఇక్కడే  పాట సాయానికి వస్తుంది.

మరి   పాట అవసరం లేని,  దానికి  అవకాశం లేనిచోట  నేపథ్య సంగీతమే దిక్కు.   ఈ విషయంలో మనకున్న పెద్ద దిక్కు ఇళయరాజాయే!

చలనచిత్రాల్లోని  కొన్ని  సన్నివేశాలు  నీరసంగా ఉంటే..  వాటికి  నేపథ్య సంగీతం జోడించి  వాటికి  ఊపిరి పోసి ఊపునిస్తాడు  ఇళయరాజా!  నిస్సారంగా తోచే  దృశ్యాలు కూడా  ఆయన కూర్చిన ధ్వని ముద్రతో ,  ఒక్కోసారి  హఠాత్తుగా ఆగిపోయిన శబ్దంతో ...  నిశ్శబ్దంతో  వన్నెల వెలుగులద్దుకుంటాయి.  అనితరసాధ్యమనిపించేలా   అవసరమైన మూడ్ ని  సృష్టిస్తాయి.  (రీ రికార్డింగ్ లో ఇళయరాజా ప్రతిభను తెలుసుకోవాలంటే  మ్యూట్ లో దృశ్యాలను చూస్తే సరి!)

రీ రికార్డింగ్ కళలో  ఇళయరాజా ప్రతిభా సంపత్తిని చాటే  తెలుగు సినిమాలు చాలానే ఉన్నాయి.  సితార, గీతాంజలి, శివ, నాయకుడు’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘స్వర్ణకమలం’,  అన్వేషణ ....

తాజా ఉదాహరణ శ్రీరామరాజ్యం !

 మరల నిదేల శ్రీరామ రాజ్యమం’టే....
నిజమే.  ఈ సినిమా మంచి చెడ్డల గురించి వెబ్ సైట్లలో, బ్లాగుల్లో,  ఆన్ లైన్ మ్యాగజీన్లలో  ఇప్పటికే ఎన్నో టపాలు వచ్చేశాయి.  అయితే ఇది సమీక్ష కాదు. కనీసం పాటల విశ్లేషణ కూడా కాదు. కేవలం నేపథ్య సంగీతం గురించి మాత్రమే!

ఈ సినిమాకు   సమకూర్చిన సంగీతం విషయంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి.  ‘ఇళయరాజాకు ఏం పుట్టిందో ... విదేశీ వాద్యాలు ఉపయోగించాడు’ అని చిరాకు పడినవారున్నారు.  అయితే సంగీత వాద్యాల విషయంలో స్వదేశీ, విదేశీ అనే భేదం లేదనీ, కొన్ని పరదేశ వాద్యాలు మన సంగీతంలో భాగమైపోయాయనీ  బాలు ఈ మధ్యే ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు.

నాకైతే  ఈ సినిమాలో పాటలు బాగా  నచ్చాయి.  సంగీతం కొత్తగా,  వినసొంపుగా,  మధురంగా  ఉంది. . రీ రికార్డింగు చాలాచోట్ల ఎంతో బాగా వచ్చింది.  మరపురాని మెరుపులెన్నో వినిపించాయి. పాటల మధ్యలో ని ఇంటర్ ల్యూడ్స్ ఇంకా ఇష్టంగా అనిపించాయి. 

వాటిని సరదాగా  పంచుకోవటానికే ఈ టపా !

దు:ఖోద్వేగ భరితం
శ్రీరామరాజ్యం సినిమాలో  గుర్తుండిపోయే సన్నివేశాల్లో  రాముడు  సీత కాళ్ళ దగ్గర తలపెట్టుకుని దు:ఖించటం ఒకటి.  శయన మందిరంలో నిద్రపోతున్న ఆమెను హృదయభారంతో రాముడు చూసే విషాదభరిత సన్నివేశానికి  గాఢతను అద్దుతూ  సమకూర్చిన  అర్థవంతమైన నేపథ్య సంగీతమిది.  

( ఈ ఎంపీత్రీ మాతృక అయిన యూట్యూబ్  వీడియో ను అందించిన  sharanKay కు కృతజ్ఞతలతో... ) 
 

 స్వర్ణసీతను చూసిన వేళ...
సినిమాలోని థీమ్ మ్యూజిక్.  వాల్మీకి మహిమతో  రామ మందిరంలోకి ప్రవేశించిన సీత  తన బంగారు ప్రతిమను అబ్బురంగా తిలకించే  సన్నివేశానికి ఇళయరాజా అందించిన  నేపథ్య సంగీతం... సీత మనసులో చెలరేగే  పరవశ మధుర భావాలకు శబ్దరూపాన్నిస్తూ... !
A melodious theme track from Ilayaraja's magnum opus "Sri Rama Rajyam". (Sita visits Rama mandiram, finds her own golden statue). This film's BGM is the best ever to come out from Indian film industry.
 
ఇదే సినిమాలోని థీమ్ ట్రాక్ వినండి. భావగర్భితంగా సాగే ఈ జంత్ర సంగీతం మధ్యలోకొచ్చేసరికి విచిత్ర అనుభూతికి గురిచేసేలా ఉంటుంది.
(పై  రెండు BGMs ను నవ తరంగం సైట్ ద్వారా  అందించిన  pkiran కు కృతజ్ఞతలు )
 
పాటలను అలంకరించిన ఇంటర్ ల్యూడ్స్ గురించి...  (రెండో భాగంలో)

9 కామెంట్‌లు:

ఆ.సౌమ్య చెప్పారు...

నాక్కూడా ఈ సినిమాలో నేపథ్య సంగీతం చాలా బాగా నచ్చిందండీ...మీరు బాగా రాసారు.

ఆ.సౌమ్య చెప్పారు...

ఇంకో గమ్మత్తైన విషయం నేను గమనించినది ఏమిటంటే ప్రతీ నేపథ్య సంగీతం బిట్ కూడా ఈ సినిమాలో ఏదో ఒక పాటకి రిలేట్ అయినట్టే ఉంటాయి. బహుసా పాటల్లోని రాగాలే నేపథ్య సంగీతానికీ ఎంచుకున్నారేమో....ప్రతీ బిట్ విన్న తరువాత "అరె ఇది ఏ పాటలో వస్తుంది, ఆ పాటలా ఉందే" అనిపిస్తుంటుంది. కానీ ఏ పాటకి దగ్గరగా ఉందో తట్టదు.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వేణు చెప్పారు...

@ ఆ.సౌమ్య: మీరన్నట్టు ఈ సినిమా పాటల్లోని రాగాలే నేపథ్య సంగీతానికి కూడా ఎంచుకున్నారు. మీ అభినందనకు థాంక్యూ.

వేణు చెప్పారు...

@ సుజాత: మీ వ్యాఖ్య చూశాక మరోసారి విన్నాను... చాలా బాగుంది మీ పరిశీలన! నిజమే, స్వర్ణసీతను చూసే సందర్భంలో ఆ సాహిత్యాన్ని గుర్తు చేసేలా కూర్చిన ట్యూన్ చాలా సందర్భోచితం. అసలు ఈ సాహిత్యాన్ని గుర్తు చేసుకోకపోయినా విడిగా కూడా ఆ సందర్భంలో సీత భావ సంచలనాన్ని స్ఫురింపజేస్తోంది ఇళయరాజా నేపథ్య సంగీతం!

వేణూశ్రీకాంత్ చెప్పారు...

చాలాబాగా రాశారండీ... BGM ని చాలాసార్లు మనం అసలు పట్టించుకోం కానీ గమనిస్తే సన్నివేశంలోని మూడ్ ని ఎలివేట్ చేయడానికి చాలా ఉపయోిస్తుంది. నాకు కూడా ఈ సినిమా నేపధ్యసంగీతం బాగానచ్చింది.

వేణు చెప్పారు...

@ వేణూ శ్రీకాంత్: థాంక్యూ. మీరన్నట్టు సన్నివేశంలోని మూడ్ ఎలివేట్ అవ్వటంలో బీజీఎం పాత్ర చాలా ఉంటుంది.

GKK చెప్పారు...

వేణు గారు: బాగుంది. as always thoroughly researched and painstakingly done. శ్రవణానందకారకా.. చాలా బాగుంది. వయొలిన్ కూడా విదేశీ వాయిద్యమే. మన కచ్చేరీలలో భాగమైపోలేదూ. ఇళయరాజా తన విశ్వరూపాన్ని చూపించాడు ఈ చిత్రంలో.

వేణు చెప్పారు...

తెలుగు అభిమాని గారూ, థాంక్యూ. సంగీతానికి సంబందించిన చర్చల్లో మీ అభిప్రాయం ఒక benchmark లా నాకనిపిస్తుంది.