సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

15, మార్చి 2012, గురువారం

షేక్ స్పియర్... సీజర్.. జ్యోతిషం!

వాళ మార్చి 15.
అంటే  The ides of March! 

క్రీ.పూ. 44లో రోమన్ జనరల్  జూలియస్ సీజర్ రాజకీయ కుట్రకు బలై  నేలకొరిగింది ఈ రోజే. 

అయితే ఏమిటట... అంటారా?

డిగ్రీ చదివే రోజుల్లో   షేక్ స్పియర్ నాటకం ‘జూలియస్ సీజర్’ మాకు  పాఠ్యాంశంగా ఉండేది.

ఆ నాటకంలో చాలా ఘట్టాలు ఆసక్తికరం!

వ్యాసుడి భారతంలోని శకుంతలా దుష్యంతుల ఘట్టాన్ని కాళిదాసు మార్పులు చేసి అభిజ్ఞాన శాకుంతలంగా తీర్చిదిద్దాడు కదా?

 అలాగే ప్లుటార్క్ రాసిన  Parallel Lives లోని సీజర్ గాథను షేక్ స్పియర్ నాటకంగా మలిచి,  అద్భుతమైన నాటకీయతను రంగరించాడు.

మన గతం, వర్తమానం,  భవిష్యత్తు అంతా ముందుగానే  రికార్డు చేసివుంటుందనీ, ఆ ప్రోగ్రాం ప్రకారమే సంఘటనలు జరుగుతాయని అంటే  హేతువాదులెవరూ నమ్మరు; నేనూ నమ్మను. 

జ్యోతిషం అంటే  షేక్ స్పియర్ కి  నమ్మకం ఉందో లేదో గానీ  నాటకీయతను సృష్టించటంలో అది ఎంతో బాగా ఉపకరిస్తుందని ఆ మహా రచయితకు బాగానే తెలుసు. 

అందుకే ...

చాలా సన్నివేశాల్లో శకునాలనీ, కలలనూ, సంకేతాలనూ  ప్రవేశపెడతాడు. కాల్పనిక సన్నివేశారణ్యంలో ‘ఉత్కంఠీరవు’డై  వీర విహారం చేస్తాడు!

 
జూలియస్ సీజర్ సంగతికొద్దాం..
 
మార్చి 15న  సీజర్ కి ఆపద రాబోతోందని sooth sayer  (జ్యోతిషవేత్త)  సీజర్ ని  హెచ్చరిస్తాడు.

ఆ  భవిష్య పురాణాన్ని  ఏమాత్రం ఖాతరు చేయకుండా ‘ఆ జోస్యుడు కలలు కంటున్నా’డంటూ  కొట్టి పారేసిన  ధీరుడు సీజర్.

జూలియస్ సీజర్  నాటకం మొదటి అంకం, రెండో సన్నివేశంలోని  ఈ సంభాషణలు చూడండి...

      Soothsayer: (రెండోసారి)  Beware the ides of March.

     CAESAR : He is a dreamer; let us leave him  


అపశకునాల  దుస్స్వప్నాలు వచ్చాయంటూ  కలవరపడుతున్న భార్య Calpurnia తో సీజర్ చెప్పిన మాటలు  ఎంతో ధీరోదాత్తంగా ఉంటాయి.

     Caesar:  "Cowards die many times before their deaths,  The valiant never taste of death but once."
 
పిరికివాళ్ళు  చావుకు ముందే  ఎన్నోసార్లు చనిపోతారు. కానీ ధైర్యశాలి ఒకే ఒక్కసారే మరణిస్తాడనే ఈ మాటలు శతాబ్దాలుగా  కోటబుల్ కోట్ గా  ప్రచారంలో ఉన్నాయి.

విషాదాన్ని ఊహిస్తూ, దానికి భయపడుతూ విలువైన సమయాన్ని వృథా చేయకూడదనే సందేశం సీజర్ మాటల్లో ఉంది.

ఈ ఘట్టం చదువుతుంటే  దానమివ్వొద్దంటూ శుక్రాచార్యుడు అభ్యంతరపెట్టినపుడు మరణానికి భయపడకుండా
బలిచక్రవర్తి చెప్పిన పలుకులు... (భాగవతంలోని పోతన పద్యం) గుర్తొస్తాయి. 

“కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే? గర్వోన్నతిన్‌ బొందరే? 
వారేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపై 
పేరైనం గలదే? శిబి ప్రముఖులున్‌ ప్రీతిన్‌ యశఃకాములై
ఈరే కోర్కెలు? వారలన్‌ మరచిరే ఇక్కాలమున్‌ భార్గవా!”

రే, కథ ప్రకారం జ్యోతిషం  నిజమవుతుంది.  ‘ఐడ్స్ ఆఫ్ మార్చి’  సీజర్ కు  మరణశాసనం రాస్తుంది.

ఈ సన్నివేశంలో షేక్ స్పియర్ రాసిన సంభాషణలు నాటకీయతతో ఆకట్టుకుంటాయి.

జోస్యుడు మార్చి 15న తనకెదురైనపుడు సీజర్ హేళనా స్వరంతో ఇలా  అంటాడు...

        CAESAR : [To the Soothsayer] The ides of March are come.

ప్రమాదం తొలిగిపోలేదనీ, ఇంకా పొంచే ఉందంటూ జోస్యుడు ధీమాగా చెప్పిన మాటలు...

        Soothsayer: Ay, Caesar; but not gone.
చివరకు కత్తిపోట్లతో సీజర్ చనిపోయేటప్పుడు సీజర్ బ్రూటస్ తో ‘నువ్వు కూడానా?’ అంటూ బాధాతప్తంగా పలికిన చివరి మాట-     

Et tu, Brute! Then fall, Caesar  ...

అత్యంత ప్రాచుర్యం పొందింది!
  

21 వ్యాఖ్యలు:

kastephale చెప్పారు...

good

వేణు చెప్పారు...

@ kastephale : థాంక్యూ.

@ సుజాత: భలే వారే! అసలు ఈ బ్లాగులో వరసగా చందమామ పోస్టులు ఎక్కువవుతున్నాయనే కదా విరామం కోసం ఈ టపా రాసిందీ!:)

పూర్వ ఫల్గుణి(poorva phalguni) చెప్పారు...

Thank you venu garu ,nijamga
chaala informative ga vundi. naaku anipinchindi manaku telisingi gooranta telyandi abooo konda kante ekkuve?
maa nannagru eppudu షేక్ స్పియర్ నాటకం
gurunchi cheppvaru.asalu ado prapamcham. chaaala chaaala bavundiane kanna
chaala vishyalu telusukunnamu
anavachhu

వేణు చెప్పారు...

@ పూర్వ ఫల్గుణి: మీ స్పందనకు థాంక్యూ.

A Homemaker's Utopia చెప్పారు...

ఈ రోజు నేను ఒక క్రొత్త విషయం తెలుసుకున్నాను Caesar గురించి.Thanks for the nice post.

ఆ.సౌమ్య చెప్పారు...

భలే బావుంది ఈ పోస్ట్. జూలియస్ సీజర్ సినిమా చూసి భలే చలించిపోయాను నేను. మార్చి 15 వెనకల ఇంత కథ ఉందా! బావుందండీ.

తృష్ణ చెప్పారు...

టపా బావుంది వేణు గారూ !

వేణు చెప్పారు...

@ A Homemaker's Utopia ,

@ ఆ. సౌమ్య ,

@ తృష్ణ: సీజర్ గురించి రాసిన టపా మీకు నచ్చినందుకు సంతోషం. Thanks all of you for the response!

కొత్తావకాయ చెప్పారు...

చాలా బాగుందండీ. శుక్రాచార్యుడు - బలి సంవాదం ప్రస్తావించడం, పోలిక ఇంకా బాగుంది.

Sujata చెప్పారు...

Yes, Very interesting.

వేణు చెప్పారు...

@ కొత్తావకాయ,
@ Sujata : Thanks for your comments!

Zilebi చెప్పారు...

వేణువు గారు,

looks like Caeser is 'seized' by జ్యోతిష్యం through out!


చీర్స్
జిలేబి.

తెలుగు అభిమాని చెప్పారు...

refreshingly different post యాదృచ్చికంగా (లేకా అనుకునేనా) మీరు కాళిదాసు ప్రస్తావన తేవటం బాగుంది. shakespeare మహా రచయిత. వీరిరువురు ప్రపంచ సాహిత్యంలోనే universally acclaimed as the very best.
చాలా బాగుంది ఈ టపా. వేణుగారు.

వేణు చెప్పారు...

@ తెలుగు అభిమాని: షేక్ స్పియర్ గురించి చెప్పేటపుడు కాళిదాసు పోలిక తెస్తుంటారు కదా? పైగా మూలంలోని ఘట్టాలను మార్చి, స్వతంత్ర కల్పనతో రసభరితంగా, రామణీయకంగా మలిచిన కాళిదాసు ఈ సందర్భంగా సహజంగానే గుర్తొచ్చాడు. థాంక్యూ!

రామ్ చెప్పారు...

క్లాసు లో కూర్చుని పాఠం విన్నంత హాయి గా ఉంది మాస్టారూ !!

విషయం తో పాటు ..Font size, spacing, sub headings కూడా ...చదవటానికి హాయి గా ఉంటానికి కారణం !!

వేణు చెప్పారు...

జిలేబి గారూ! మీ వ్యాఖ్య స్పామ్ లోకి వెళ్ళిపోయిందువల్ల లేటుగా చూసి, పబ్లిష్ చేశాను. థాంక్యూ.

వేణు చెప్పారు...

రామ్ గారూ! మీ స్పందనకు థాంక్ యూ. Font size, spacing, sub headings..లను కూడా చక్కగా పరిశీలించటం సంతోషకరం, అభినందనీయం!

పల్లా కొండల రావు చెప్పారు...

వేనూ గారూ !
బాగుంది. కొత్త విషయమొకటి తెలిసింది." యూ...టూ " అనేది మాత్రం వెన్నుపోటు సందర్భం లో వాడుతుంటారు. అయితే ఇప్పటివరకూ ఇది జీసస్ క్రీస్తుని సహచరులు మోసం చేసినప్పుడు క్రీస్తు అన్నమాటలు అని తెలుసు. అయితే నాకు నిర్ధారణగా తెలియదు. పోస్టు బాగుంది.

వేణు చెప్పారు...

కొండలరావు గారూ !
థాంక్యూ. ‘యూ...టూ’ అనే మాటలు సహచరులు మోసం చేసినప్పుడు క్రీస్తు అన్నవని నేనెప్పుడూ వినలేదు. మొదట్నుంచీ ఇది జూలియస్ సీజర్ పలుకులుగానే నాకు తెలుసు. పైగా ‘యూ టూ’ తర్వాత ‘బ్రూట్’ (బ్రూటస్) అనే మాట చూసినా ఇది సీజర్ కి సంబంధించిందేనని గ్రహించొచ్చు.

వేణు చెప్పారు...

డా. ఎం.బి.డి. శ్యామల ఇలా తన అభిప్రాయం తెలిపారు:

‘‘ ఎప్పటిలాగే చాలా బాగుంది. నువ్వెన్నుకునే వైవిధ్యాంశాలు నాకు విస్మయం కలగజేస్తాయి! విషయాన్ని చేయి తిరిగిన శిల్పి తీర్చిదిద్దినట్టు ఉంటుంది. ముఖ్యంగా వెతుకుదామన్నా ఒక్క అక్షర దోషం కూడా కనబడదు. సాధారణంగా ఎవరైనా జ్యోతిష్యం అంటారు! కానీ నువ్వు కరెక్టుగా జ్యోతిషం అని వ్రాయడం నాకు ముచ్చటేసింది. విశ్లేషణ అద్భుతం! ’’

వేణు చెప్పారు...

@ డా. ఎం.బి.డి. శ్యామల: మీ స్పందనకు కృతజ్ఞతలు.