జంతువు పేరునో, పక్షి పేరునో అక్షరాల్లో రాస్తే ఆ భాష చదవటం వచ్చినవాళ్ళకే అది ‘ఫలానా’అని అర్థమవుతుంది.
మరి ఆ లిపి
రానివాళ్ళకూ, నిరక్షరాస్యులకూ
అవి అర్థం కావు కదా?
మరి వాటిని అర్థం చేయాలంటే?
టైపోగ్రఫీ
డిజైన్ ద్వారా దాన్ని చాలావరకూ సాధించవచ్చు.
ఆస్ట్రేలియన్ చిత్రకారుడు డాన్ ఫ్లెమింగ్ ఈ విషయంలో చాలా పేరుపొందాడు.
జంతువుల, పక్షుల ఆకారాలు వాటి ఇంగ్లిష్ స్పెలింగ్ ల్లోనే ఒదిగిపోయేలా
ప్రతిభావంతంగా
చిత్రించాడీ గ్రాఫిక్ ఆర్టిస్ట్.
లిపి చదవటం
వచ్చినవాళ్ళను కూడా ముగ్ధులను చేసేలా ఈ చిత్రకారుడు జంతు-పక్షి ప్రపంచాన్ని అక్షరాలతో గొప్పగా నిర్మించాడు.
అతడు చిత్రించిన ఒక్కో బొమ్మనూ పరిశీలించి చూడండి-
![]() |
BUNNY (కుందేలుకు వాడుక పదం) |
![]() |
CAMEL |
![]() |
CHICKEN |
![]() |
CROCODILE |
![]() |
ELEPHANT |
![]() |
FLAMINGO |
![]() |
GIRAFFE |
![]() |
KANGAROO |
![]() |
KITTEN (పిల్లి పిల్ల) |
![]() |
MONKEY |
![]() |
OWL |
![]() |
PARROT |
![]() |
PENGUIN |
![]() |
PIG |
![]() |
RHINO (ఖడ్గ మృగం) |
![]() |
SNAIL |
![]() |
WHALE |
![]() |
DINOSAUR |
వీటిలో నాకు
బాగా నచ్చినవి- Owl,
Parrot, Pig, Snail, Whale.
ఈ తరహాలో
ఇతర ఆర్టిస్టులు కూడా వేసినా డాన్ వేసినంత
సహజంగా అవి కనపడవు.
ఇతర ఆర్టిస్టులు వేసిన కొన్ని టైపోగ్రఫీ ప్రాణులను చూడండి.
CHAMELEON (ఊసరవెల్లి) |
![]() |
BISON (దున్న) |
![]() |
MOSQUITO |
![]() |
SHARK |
![]() |
DINOSAUR |
ANT |
* * *
అక్షర స్వరూపం
చూడగానే అదేమిటో సూచించగలిగేలా,
సహజంగా చెక్కటం అన్నివేళలా సాధ్యం
కాదు.
అందుకే అది
సృజనాత్మకమైన కళ.
ఇక్కడ చూడండి-
High
Low
అనే అక్షరాలు
వాటి అర్థాన్ని వాటికవే తెలిపేలా,
చూసేవాళ్ళకు తేలిగ్గా తెలిసేలా... ఆర్టిస్టు ఎంత గొప్పగా చిత్రించాడో!
ఇవే అక్షరాలను
మరో రకంగా చిత్రించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది.
మరో రెండు
ఇలాంటి అక్షరాల బొమ్మలు -
ZIP లోని ‘I’ అక్షరాన్ని జిప్ ఆకారంగా
వేయటం బాగుంది కదూ..
ఇక... ఈ బొమ్మలో-
coffee అనే అక్షరాలు పొగలు కక్కటంలో కనపడ్డాయా? అది మాత్రమే కాదు... మరో విశేషం
ఉంది.
CUP
అనే అక్షరాలు ‘కప్పు’ ఆకారంలో కనపడుతున్నాయా?
* * *
తెలుగులోనూ ఇలాంటి ప్రయోగాలు చేశారు మన చిత్రకారులు. పత్రికల్లో, సినిమా టైటిల్స్ లో... !
తెలుగులోనూ ఇలాంటి ప్రయోగాలు చేశారు మన చిత్రకారులు. పత్రికల్లో, సినిమా టైటిల్స్ లో... !
1969 నుంచీ
ప్రచురితమవుతున్న మాసపత్రిక ‘అన్నదాత’.
దీని పేరు
చూడండి- వరి గడ్డి పరక అక్షరాలుగా మారింది.
న ఒత్తు వరి కంకి అయింది.
1975 నాటి
సినిమా ‘పాడిపంటలు ’. మోదుకూరి
జాన్సన్ రాసిన.. ‘నాగలితో నమస్కరించి, పారలతో ప్రణమిల్లి’ అంటూ సాగే ‘మన జన్మభూమి.. బంగారు భూమి’పాట దీనిలోదే.
ఈ సినిమా
లోగో్ లో పా‘డి’లో ఆవునూ, ‘పంటలోని ప తలకట్టును వరికంకిగా చిత్రించటం గమనించవచ్చు.
అంతకు ముందు
ఏడాది 1974లో ‘కోడెనాగు’వచ్చింది. గొలుసుకట్టు ఏటవాలు అక్షరాల్లో నాగుపాము తలా తోకా
-దాని పొడుగాటి తాడులాంటి శరీరం స్ఫురించేలా
చిత్రించాడు ఆర్టిస్టు.
ఈ లోగోను చూశాక, దాని గురించి ఆలోచించకుండా, దాని ప్రత్యేకత గురించి పట్టించుకోకుండా ఉండటం కష్టం!
ఇంతకంటే ప్రత్యేకంగా,
విశిష్టంగా ఉన్నసినిమా లోగో
‘బొట్టు కాటుక’
(1979).
ఈ అక్షరాలంకరణలోని
సృజనాత్మకత, దీని ఘనత గురించి ఇంతకు ముందు
ఏకంగా రెండు పోస్టులే రాశాను.
ఆసక్తి ఉన్నవారి
కోసం ఒక పోస్టు లింకు...
‘జ్యోతి’ సినిమా లోగో నిజానికి
అదే పేరుతో వెలువడిన మాసపత్రిక లోగోనే.
దీన్ని రూపుదిద్దిన చిత్రకారుడు ఆ పత్రిక సంపాదకవర్గంలో ఉన్న బాపు.
ఆ మాసపత్రిక
లోగో... తొలి రూపాలు అనదగ్గ టైటిల్స్ ఎలా ఉండేవంటే....
అర్థ గర్భితమైన సినిమా లోగోలు
ఈ కింద తెలుగు సినిమాల పేర్ల లోగోలు చూడండి. వీటి ప్రత్యేకతలేమిటో ఇట్టే తెలిసేలాగానే ఉంటాయివి.
బాగున్నాయి కదూ !
చివరిగా- ఈ మధ్య విడుదలైన సినిమా ‘కబాలి’గురించి!
ఇంగ్లిష్
అక్షరాలు KABALI అనే అక్షరాలతో ఆ సినిమాలోని హీరో రజనీకాంత్
గెటప్ వచ్చేలా భలే చిత్రించాడు ఆర్టిస్టు.
ఈ పోస్టు మొదట్లో పెట్టిన బొమ్మ అదే!
ఈ పోస్టు మొదట్లో పెట్టిన బొమ్మ అదే!
అసలు ఈ బొమ్మను
చూశాకనే ఇలాంటి పోస్టు రాయాలనే ఉద్దేశం
ఏర్పడింది!
దీంతో అప్పుడెప్పుడో
చూసి ఆనందించి వదిలేసిన డాన్ ఫ్లెమింగ్ గీసిన
ఇంగ్లిష్ అక్షరాల జంతువుల టైపోగ్రఫీకీ...
పనిలో పనిగా నా అభిమానాంశమైన - తెలుగు అక్షరాలంకరణలకూ ..
వీటన్నిటికీ ఇలా ‘హలో’ చెప్పానన్నమాట!
పనిలో పనిగా నా అభిమానాంశమైన - తెలుగు అక్షరాలంకరణలకూ ..
వీటన్నిటికీ ఇలా ‘హలో’ చెప్పానన్నమాట!
10 కామెంట్‌లు:
వేణూ!నీ సరికొత్తపోస్ట్ చాలా బాగుంది!వర్ణాలలో ఆయా చిత్రాలను ఇమిడ్చే ఈ కళను టైపోగ్రఫీ అంటారన్న మాట!నీకీ కొత్త కొత్త ఆలోచనలు blog కోసం ఎలా వస్తాయో!అని ఆశ్చర్య పోతుంటాను!ofcourse!కబాలి typo చూసి ఈ idea వచ్చిందని చెప్పావనుకో!నాకైతే డాన్ చిత్రాలే కాక మిగిలినవి కూడా చాలా బాగున్నాయి! ముఖ్యంగా crocodile ,parrot owl ant snailచాలా బాగున్నాయి!బొట్టూ కాటుక అలంకరణపై నీ అందమైన blog ఇంతకుముందు చదివాను!ఇప్పుడు కోడెనాగు మాంగల్యానికి మరో ముడి నేరము శిక్ష అన్ని నువ్న్ఎన్నుకున్న శీర్షికలు సృజనాత్మకతకు అద్దం పట్టాయి! High low రూపొందించిన విధానం ఎంత బాగుందో!అలాగే కాఫీ పొగలు అందరూ చూస్తారుగానీ కప్పులో కప్పును కనుక్కోవడం కష్టమే!ఎన్ని కళలు!ఎన్ని కళారూపాలు!ఎందరు ప్రతిభామూర్తులు!విపులాచ పృథ్వీ కదా!ఒక మంచి కళారూపాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు!
బాగుందండి మీ పోస్టు. చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఈ బొమ్మలన్నీ!
PBS' Word World అని పిల్లల కోసం ఒక టీవీ సీరియల్ వుంది. మీ పోస్ట్ చూడగానే అది గుర్తుకొచ్చింది :)
విభిన్న అంశాలను స్పృశించే మీ బ్లాగు పేరులోనే ఏదో మహాత్యం ఉన్నట్లుంది. ఏం వ్రాసారో చదవాలని చేయి అలవోకగా వెళ్ళిపోతుంది.ఎపుడూ నిరాశ పరచలేదు.
లక్స్ సోప్ యాడ్ చేసిన హీరోయిన్ లు ఎంత మంది ఉంటారు ? సినిమాల్లో ఫైటింగ్ చేసే హీరోయిన్స్ ఎంతమంది ఉంటారు ? దాదా సహెబ్, భారత రత్న లు తీసుకున్న వ్యక్తుల వివరాలు ? నోబెల్ గ్రహీతలెందరు ? వాంటెడ్ లిస్ట్ ఇస్తే ఒక పని అయిపోతుందని.
నేను చెప్పాలనుకున్నది ప్రతిసారీ శ్యామల గారు చెప్పేస్తుంటే చెప్పేసారుకదా అని వ్యాఖ్యానించకుండానే వెళ్ళిపోతున్నాను కానీ మీలాంటివారిని ప్రోత్సహిస్తేనే మరింతమంది వ్రాస్తారని భావిస్తూ మీ పరి(శీలన)శ్రమకి మా ధన్యవాదాలు !
వేణు గారూ! పోస్ట్ బాగుందండీ. మీ పోస్ట్ తో పాటూ' మీలాంటివారిని ప్రోత్సహిస్తేనే మరింతమంది వ్రాస్తారనే' నీహారిక గారి మాటలూ బాగున్నాయి.
@ Syamala Madduri: ఇలాంటి పోస్టులు రాసేటపుడు ఇవన్నీ ఎంతమందికి ఆసక్తికరంగా ఉంటాయని చిన్న సందేహం వస్తుంటుంది. ఆ సందేహం తొలగించి ఉత్సాహాన్నీ, ప్రోత్సాహాన్నీ ఇచ్చేలా ఉంది నీ స్పందన! Coffee Cup లో cupను నేను వెంటనే కనిపెట్టలేకపోయాను... ఇలా మెదడుకు మేత వేసే కళారూపాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. థాంక్యూ.
@ S: మీ స్పందనకూ, అభిప్రాయం తెలిపినందుకూ కృతజ్ఞతలు.
@ Lalitha TS: ఆ పిల్లల టీవీ సీరియల్ సంగతి గురించి మీరు చెపితేనే తెలిసింది. థాంక్యూ.
నీహారిక : మీ అభిమానానికీ, ప్రోత్సాహకరమైన స్పందనకూ కృతజ్ఞతలు.
sambasiva: నెలనెలా ఏం రాయాలా అని ఊగిసలాడేటపుడు మీరూ, అప్పుడెప్పుడో ఈ బ్లాగు సబ్జెక్టుల గురించి మీరు రాసిన కామెంటూ ఆటోమెటిక్ గా గుర్తొస్తాయి. (నా అభిరుచి మేరకు రాసేదైనప్పటికీ మీలాంటివారి అంచనాలు కూడా ఆలోచనల్లో మెదులుతుంటాయి.) థాంక్యూ.
Nice One Venu garu.
Reading your blog from phone & noticed for first time your blog is designed to read easily from phone too.
Super Sir.
చాలా బాగున్నాయి వేణుగారు.
@ Ram: థాంక్యూ. ఫోన్లోనూ బాగా కనపడుతోందంటే.. అది బ్లాగర్ వారి అమరిక ఘనత అన్నమాట.
@ తెలుగు అభిమాని: మీ స్పందనకు థాంక్యూ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి