సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

12, మార్చి 2009, గురువారం

చందమామ సంగతులు

మీలో చాలామందికిలాగే నాకు కూడా 'చందమామ' పుస్తకం చాలా ఇష్టం. బాల్యంతో లంకె ఉన్నది ఏదయినా నచ్చుతుంది కదా!

'చందమామ' అంటే కథలే కాదు, అద్భుతమయిన బొమ్మలు కూడా. చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్ ల చిత్రకళా విన్యాసాలు ఎన్నని!

చందమామ అంటే చక్రపాణి- నాగిరెడ్డిల స్వప్నఫలం మాత్రమే కాదు, అది కొడవటిగంటి చెక్కిన వెన్నెల శిల్పం కూడా.

నా దగ్గర 1947 జులై చందమామ తొలి సంచిక నుంచి 1960 వరకూ అన్ని సంచికలూ ఉన్నాయి... పి డి ఎఫ్ రూపంలో.

1961 నుంచి 2004 వరకూ అక్కడక్కడా కొన్ని సంచికలు మిస్ అయ్యాయి.

అసలు ఇవన్నీ సేకరించానంటే ఇద్దరి హెల్ప్ గురించి చెప్పాలి.
నాగమురళి, ఫణి.

నాగమురళి డిజిటల్ లైబ్రరీ లోని చందమామల నిధి కనిపెట్టారు. ఇక్కడ.

ఫణి(బ్లాగాగ్ని) ఆ నిధిని తేలిగ్గా తీసుకునే ప్రోగ్రాం రాసి అందరికీ అందించారు. ఇక్కడ.

చందమామ విశేషాలు కొన్ని మరోసారి!

1 కామెంట్‌:

వేణు చెప్పారు...

ఈ టపాలోని సమాచారం ఆధారంగా ప్రభాకర్ మందార గారు 20 సంవత్సరాల కిందట తాను రాసిన చందమామ కథను అంతర్జాలంలో డిస్కవరీ చేశారు. ఆ సందర్భంగా తన బ్లాగులో ‘... ఈ సమాచారం అందించిన సహ బ్లాగర్లు
నాగమురళి,
వేణువు,
బ్లాగాగ్ని
గార్లకు కృతజ్ఞతలు’ తెలిపారు.