సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

4, ఏప్రిల్ 2009, శనివారం

ఈ రచయిత ఎవరో చెప్పుకోండి చూద్దాం!


ఈ ఫొటో చూసి, ఈ రచయిత ఎవరో చెప్పగలరా?

ఫోటో చూసి, రచయితను గుర్తించటం తెలుగు పాఠకులకు అంతగా అలవాటు లేని పని కాబట్టి కొన్ని క్లూలు ఇస్తాను.
* ఈ రచయిత 500పైగా తెలుగు పుస్తకాలు రాశారు.
* అపరాధ పరిశోధక నవలా రచయితగా సుప్రసిద్ధుడు.
* సస్పెన్స్, థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ రచనల్లో ప్రత్యేక ముద్ర ఉన్న రచయిత.
* తాను రూపకల్పన చేసిన హీరో్ పేరుమీదే పబ్లికేషన్స్ నడిపారు.
* డజన్ సినిమాలకు కథ, మాటలు రాశారు.
* సాహిత్య, సినీ, పిల్లల మాసపత్రికలకు సంపాదకునిగా వ్యవహరించారు.
* ఈ రచయిత ఇప్పుడు జీవించిలేరు.

ఎంతో ప్రాచుర్యం పొందిన రచయిత పేరును చెప్పమని ఇలా క్విజ్ అడగటం అన్యాయమే. 

కానీ ఈయన చనిపోయినపుడు తెలుగు పత్రికలు చాలా అన్యాయం చేశాయి. అప్రధానంగా చిన్న వార్త ఇచ్చాయి. కొన్ని పత్రికలయితే అసలు పట్టించుకోనేలేదు. నివాళి వ్యాసాలు అసలే లేవు. నేటి పాత్రికేయుల సాహితీ పరిచయం ఇంతలా ఉంది. 

 డిటెక్టివ్ నవలలకు సాహిత్య గౌరవం ఉండదు కాబట్టి ఇలా జరిగిందనుకోలేం. ఇతర అంశాల్లో ఆయన కంట్రిబ్యూషన్ సంగతి పట్టించుకోనేలేదు!

11 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

శ్రీ కొమ్మూరి సాంబశివ రావు గారు. ప్రసిద్ధ రచయత శ్రీ చలం గారికి బందువు కూడా. ఆ మద్య శ్రీ మల్లాది వెంకట కృష్ణ మూర్తి ఆ తరువాత కౌముది వారు శ్రీ సాంబశివ రావు గురించి రాసారు. ఆయన స్వంత ప్రచురణ సంస్త 'ఆధునిక గ్రందమాల'. మరిన్ని విషయాలకి కౌముది చూడండి. ఇక మీరు చెప్పినట్లు... డిటెక్టివ్ నవలలకు సాహిత్య గౌరవం ఉండదు కాబట్టి ఇలా జరిగిందనుకోలేం.... ఇది నిజమే మరి. అప్పుడు గాని ఇప్పుడు గాని ఈ డిటెక్టివ్ రచయతల స్తితి ఒక్కటే. మీకు తెలుసు సంచలన డిటెక్టివ్ రచయత శ్రీ మధు బాబు ఈ మద్య వార్తలలో టి.వి లలో కనబడుతున్నాడు కాని విపరీతం గా నవలలు రాసే నాటి ఆయన స్తితి ఏమిటి. కొన్ని కొన్ని తప్పవు. అంతే. అన్నట్లు.. విజయ బాపినీడు గారు, ఆరుద్ర గారు, సిని రచయత సత్యానంద్ గారు, ఇంకో సిని రచయత సత్య మూర్తి గారు (సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గారి తండ్రి) దేవి శ్రీ ప్రసాద్ గారి బాబాయి శ్రీ కృష్ణ మోహన్ గారు, మల్లాది గారు ఇంకా అనేక మంది ప్రముఖులు డిటెక్టివ్ నవలలు రాసిన వారే.

వేణు చెప్పారు...

సారీ krishna rao గారూ, మీ ఆన్సర్ కరెక్టు కాదు!

నేనిచ్చిన క్లూలో హీరో పేరు మీద పబ్లికేషన్స్ నడిపారని ఉంది. అలాంటప్పుడు మీ జవాబు కరెక్టయితే ఆధునిక గ్రంథమాల కాకుండా‘యుగంధర్ గ్రంథమాల’ అవుతుంది కదా.

ఏమైనా మీ స్పందనకు నా అభినందన!

బ్లాగు వీక్షకులారా! నేను చెప్పేదాకా ఈ రచయితను కనుక్కోలేరా?

వేణు చెప్పారు...

ఇంతకీ ఆ రచయిత విశ్వప్రసాద్ అండీ!
‘డిటెక్టివ్ భగవాన్’ ఆయన నవలల్లో హీరో. ‘భగవాన్ పబ్లికేషన్స్’ పేరుతో సొంతంగా వందల పుస్తకాలు ప్రచురించారు. సస్పెన్స్, థ్రిల్లర్ గా ప్రసిద్ధికెక్కిన ‘మాయలాడి’ నవల విశ్వప్రసాద్ పాపులర్ నవలల్లో ముఖ్యమైనది.
ఆయన సుహాసిని అనే సాహిత్య మాసపత్రకకూ, కొత్తగులాబి అనే సినీ పక్షపత్రకకూ, వసంత బాల అనే పిల్లల కథల మాసపత్రికకూ సంపాదకునిగా పనిచేశారు.

అజ్ఞాత చెప్పారు...

అయ్యో పోరబడ్డానే.. 30 సంవత్సరాలు అయ్యింది డిటెక్టివ్ నవలతో బందాలు అనుబందాలు తెగిపోయి. పైగా విశ్వప్రసాద్ గారి పుస్తకాలు చాలా చదివాను (జోకర్ 5 బాగాలు అని గుర్తు, విశ్వప్రేమ, విశ్వశాంతి ఇలా విశ్వ అనే పేరుతొ చాలా రాసారు కదూ) కాని ఫోటో చూడడం సంబవించ లేదు. ఇప్పటిలాగా అప్పట్లో వ్యక్తిగత ప్రచారాలు చాలా తక్కువ అవి డిటెక్టివ్ రచయతలు కానివ్వండి, సాంఘిక నవల రచయతలు కానివ్వండి . రచయిత వివరాలు అసలు దొరికేవి కావు మరి. బగవాన్ సహాయకుడి పేరు రాంబాబు అనుకొంటా. నిజమేనా?? వారు ఏ ఏ సినిమాలకి రచనలు అందించారో చెప్పగలరు.

వేణు చెప్పారు...

krishna rao గారూ!

భగవాన్ అసిస్టెంట్ ‘రాంబాబు’ అని సరిగానే గుర్తుపట్టారు.

‘స్టీల్ మ్యాన్’ అనే పేరుతో రాంబాబు సాహసాలను ఓ నవలగా రాశారు విశ్వప్రసాద్. రాంబాబు భార్య కిరణ్మయి. భగవాన్ భార్య మణి, బోయ్ భార్గవ. ఈ పేర్లన్నీ గుర్తున్నాయా?

విశ్వ్రప్రసాద్ గారు ‘కత్తుల రత్తయ్య’, ‘జగత్ కిలాడీలు’ సినిమాలకు రచన చేశారు. ‘రౌడీ రాణి’కి కథ, మాటలు రాశారు. మిగిలిన సినిమాల వివరాలు తెలియలేదు.

‘మాయలాడి’ నవల గురించి త్వరలో ఓ టపా రాస్తాను. దాని కోసం నా అన్వేషణ అదో కథ!

సుజాత వేల్పూరి చెప్పారు...

ఈ పాత డిటెక్టివ్ నవలలు గుంటూరు లో లిబర్టీ థియేటర్ ఎదురుగా ఉన్న ఒక షాపులో దొరుకుతాయి. కృష్ణారావు గారు, ప్రయత్నించండి!

అజ్ఞాత చెప్పారు...

thanks సుజాత గారు.. సండే మార్కెట్ (over bridge) లో కూడా కొన్ని దొరుకుతాయి కాని.... ఇప్పుడు ఇక వాటిని చదివే ఓపిక / ఆసక్తి లేదనే అనుకుంటున్నాను. కొన్ని డిటెక్టివ్ బుక్స్ ఎవరో నెట్ లో కూడా పెట్టారు.

Unknown చెప్పారు...

ఇతర డిటెక్టివ్ నవాలా రచయితల తో పోల్చితే విశ్వ ప్రసాద్ గారు మహా భారతం వ్రాసిన వ్యాస మహర్షి లాంటి వారు. వారి రచనలలో మాయలాడి నవల అధ్బుతంగా ఉంటుంది. ఆనవలలు ఎక్కడ దొరుకుతాయో తెలిస్తే ఈ తరం వాళ్ళు కూడా వాటిని కోని చదువుకుంటారు.చద వడం అలవాటు చేసుకుంటారు.

Unknown చెప్పారు...

స్వర్గీయ శ్రీ విశ్వప్రసాద్ గారు వ్రాసిన నవలల్నీ ఎక్కడ దొరుకుతుందో దయచేసి తెలుపగలరు.ఆ నవలలు మళ్ళీ చదవాలని ఉంది.

వేణు చెప్పారు...

విశ్వప్రసాద్ గారి మూడు నవలలు.. మాయలాడి, జోకర్, జానీవాకర్ ఇప్పుడు పునర్ముద్రణ జరిగి మార్కెట్లో ఉన్నాయి. పల్లవీ పబ్లికేషన్స్ పంపిణీ చేస్తోంది.

విహారి చెప్పారు...

ఇప్పుడు కూడా గుంటూరులో ఉన్నాయా..ప్లీజ్ చెప్పగలరు