సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

20, ఏప్రిల్ 2009, సోమవారం

‘ ఎక్కడున్నావురా ఇన్ని రోజులూ’

వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించే శక్తి అందరికీ ఉండదు. దార్శనికత (విజన్) ఉన్నవారికే ఆ ప్రతిభ సాధ్యమనిపిస్తుంది. ముడిపదార్థంగా ఉన్నపుడే కళాకారుని రేంజ్ ని అందరికంటే ముందే ఊహించగలగటం అద్భుతమే కదా!
ఈ నైపుణ్యం సినీ దర్శకుల్లో బాలచందర్ కి ఉంది; విశ్వనాథ్ కి ఉంది.
ప్రకాష్ రాజ్ ను మొదటిసారి చూసినపుడు ‘ఎక్కడున్నావురా ఇన్నిరోజులూ’ అని ప్రేమగా చిరాకుపడ్డారట బాలచందర్. (నిన్నటి ‘ఈనాడు ఆదివారం పుస్తకం’లో వ్యాసం చూడండి). ప్రకాష్ రాజ్ నట జీవితం ఆ క్షణమే మలుపు తిరిగింది. అద్భుతమైన కాంబినేషన్లు ‘చారిత్రక అవసరం’ లా వాటికవే కుదురుకుంటాయేమో..
కమల్ హాసన్ నూ, రజనీకాంత్ నూ డిస్కవరీ చేసిన ఘనత కూడా బాలచందర్ దే కదా!
ఇక కె.విశ్వనాథ్ విషయం-
సూటు బూటూ వేసుకొని, పెద్ద ‘క్రాఫ్’ తో కనిపించిన ప్రభుత్వాధికారి జె.వి. సోమయాజులులో ‘శంకరాభరణం శంకరశాస్త్రి ’ని ఊహించగలిగారాయన. ఇది మామూలు విషయం కాదు. అసలు సినీ ఫార్ములాకు సుదూరంగా ఆ చిత్రకథను తయారుచేయటానికే ఎంతో భవిష్యద్దర్శనం కావాలనుకోండీ.
గాయకుడు బాలసుబ్రహ్మణ్యంలో ప్రతిభను ఘంటసాల యుగంలోనే గుర్తించి, ప్రోత్సహించిన ఎస్.పి. కోదండపాణిని కూడా ఈ కోవలోకి చేర్చవచ్చు.

1 కామెంట్‌:

M b d syamala చెప్పారు...

ఎక్కడున్నావురా యిన్ని రోజులూ! పోస్ట్ ను అనుకోకుండా చూశాను! ఏ వ్యక్తినైనా లోనారసి చూడగలగడంనిజంగా గొప్ప విషయం!నువ్వన్నట్లు భవిష్యద్ద్రష్టలకు మాత్రమే అది సాధ్య పడుతుంది!
అందుకే ఒక రజని ఒక కమల్ ఒక బాలు వంటివారు మనకు దొరికారు చిన్నారి సూర్య గాయత్రి ప్రతిభకు మురిసిపోయి నువ్వు పోస్ట్ట్ రాయలేదూ!అలా తెలుసుకొని ప్రోత్సహించడం గొప్ప విషయం!మంచి పోస్ట్ నకు ధన్యవాదాలు!