సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

12, ఏప్రిల్ 2009, ఆదివారం

‘యమునా తీరాన’... ఎవర్ గ్రీన్!

 
తెలుగు పాటల్లో మధురమైనవీ, మర్చిపోలేనివీ ఎన్నో ఉన్నా కొన్ని పాటలు మాత్రం నాకు ... అత్యంత ప్రీతిపాత్రంగా తోస్తాయి.

వాటిలో ‘గౌరవం’ సినిమాలో పాట-

‘యమునా తీరాన రాధ మదిలోన కృష్ణుని ప్రేమకథ...’  ఒకటి. 

చిన్నప్పడు దీన్ని తొలిసారిగా విన్నప్పుటి నుంచీ  ఇష్టం మొదలయింది. ఇది ఏ సినిమాలోదో కూడా చాలాకాలం వరకూ తెలియలేదు.

సంగీత కర్త ఎం.ఎస్. విశ్వనాథన్ అని తర్వాత తెలిసింది. 

 
‘అంతులేని కథ’ నుంచీ బాలచందర్ సినిమాల ద్వారానే విశ్వనాథన్ ఎక్కువగా తెలుసు. ‘నన్ను ఎవరో తాకిరి’, ఇంకా... ‘నా జన్మభూమి ఎంతో అందమైన దేశమూ...’ లాంటివి మినహాయింపులనుకోండీ.

ఎంతో  బాగా  తెలిసినప్పటికీ  విశ్వనాథన్ సంగీతం సమకూర్చినదే అని నాకు  చాలా కాలం తెలియని మరో  మధుర గీతం.. ‘ఏమంటున్నది ఈ గాలీ.. ఎగిరే పైటను అడగాలీ..’  (మేమూ మనుషులమే.. 1973) 

గౌరవం సినిమా 1970లో వచ్చిందట. సినిమా చూసే అవకాశం ఇంతవరకూ రాలేదు.

ఈ పాట రాసింది రాజశ్రీ అని ఎక్కడో చదివాను. నిజమేనా?


మునా తీరాన... పాటలో ఏముందని తరచి చూసుకుంటే ... సాహిత్యం కన్నా సంగీతానికే 90 శాతం మార్కులు. 

ముఖ్యంగా పాటలో రవళించే మురళీ స్వరాలు ఎంత బాగుంటాయో!

ఈ పాటను చిరస్మరణీయం చేసింది చరణాలే. పల్లవి కంటే చరణాలు  అమిత మధురంగా తోస్తాయి.

హృదయం తెలుపు ఊహలలో... రాగం నిలుపు ఆశలలో...’ అంటూ ఆరంభమవుతుంది తొలి చరణం. ఆ ట్యూను మాధుర్యాన్ని వర్ణించటం కష్టం. పాట నాకు అమితంగా నచ్చటానికి కారణం- చరణాలకు కూర్చిన బాణీలే!

నాకు తెలిసిన చాలామంది ఈ పాట ఇష్టమని చెప్పారు. కానీ నా స్థాయి (!)లో కాదనుకోండీ.

దాదాపు నలబై సంవత్సరాలు అవుతోంది ఈ పాట పుట్టి!  ‘ఎవర్ గ్రీన్ పాటలకు కాలదోషం ఉండదు కదా!


అంతర్జాలంలో ‘యమునా తీరాన...’ ఓ సారి వినండి.
http://www.chimatamusic.com/searchmd.php?st=MS%20Viswanathanఈ పాట సాహిత్యం..

యమునా తీరాన రాధ మదిలోన
కృష్ణుని ప్రేమ కథా....
కొసరి పాడేటి కోరి వలచేటి
మనసు నీది కదా..

హృదయం తెలుపు ఊహలలో..
రాగం నిలుపు ఆశలలో..
తేనెల తేటల తీయని భావన
ఊరెను నా మనసులో..        >> యమునా తీరాన రాధ మదిలోన... >>

 1.  ఎదలో తలపే వణికెనులే
అధరం మధురం చిలికెనులే
రాధా హృదయం మాధవ నిలయం
మాయని ఈ చరితమే

2. మనసే నేడు వెనుకాడే
హృదయం విరిసి కదలాడే
లోలో భయము తొణికేనే
ఎదలో సుఖము విరిసేనే
పందిరిలో నిను పొందెద ఆ దినం..
ఆ దినమే పండుగ               >> యమునా తీరాన రాధ మదిలోన... >>
 

5 వ్యాఖ్యలు:

వేణు చెప్పారు...

సుజాత గారూ,
ఈ పాటలోని మాధుర్యాన్ని విస్తరించేలా మీ వివరణ బావుంది.
కోకిలమ్మకు ఎంఎస్ విశ్వనాథనే సంగీతం కూర్చింది. ‘పల్లవించవా నా గొంతులో...’, ‘కొమ్మ మీద కోయిలమ్మ కుహూ అన్నది...’ ‘ఎవ్వరో పాడేరు భూపాల రాగం.. సుప్రభాతం’ ఈ సినిమాలోని మధుర గీతాలే.
‘పెళ్ళీడు పిల్లలు’కు బాపు దర్శకుడు. అన్నపూర్ణ వారి చిత్రం. దీనిలో శ్రీశ్రీ రాసిన పాట ‘పరువపు వలపుల సంగీతం... ఉరకలు వేసే జలపాతం’ చాలా బావుంటుంది.
‘చుట్టాలున్నారు జాగ్రత్త’లో ‘రెక్కలు తొడిగి రెపరెపలాడీ రివ్వంటుంది..’ గుర్తుందా? ఎంఎస్ విశ్వనాథనే సంగీతం!

Reg.word verification. Thanks a lot for the suggestion. I am yet to know the basics of technicalities since I am new to the blogging.

సుజాత చెప్పారు...

అన్నట్టు కోకిలమ్మ లో ఇంకో పాట ఉంటుంది. పి.బి. శ్రీనివాస్ గారు, బాలు పాడారు."శ్రీ వాణీ వీణా జనితం" అని, హీరో సంగీతం నేర్చుకునేటపుడు. ఆ పాట ఆలాపనలు(హమ్మింగ్స్), చివర్లో తారాస్థాయిలో ఉండే ఆలాపన చలా బాగుంటాయి. అలాగే సాహిత్యం కూడా! ఉదాహరణకు
"జయదేవ కవితై గోవింద గీతై పద్మావతేగా పలికినది(జయదేవుడి భార్యపేరు పద్మావతి అని మీకు తెలియదనుకోను)

ప్రియురాలి శోకమే, తొలి కావ్య శ్లోకమై
రామాయణంగా వెలసినది "..! కొన్ని సినిమా పాటలకు రావలసినంత ఖ్యాతి రాలేదేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి!

సుజాత చెప్పారు...

మొత్తానికి వర్డ్ వెరిఫికేషన్ తీసేశారన్నమాట. థాంక్స్!

వేణు చెప్పారు...

‘శ్రీ వాణీ వీణా జనితం..’ పాట ట్యూనింగ్ సహా గుర్తుంది.
ఆ పాటలో సంగీతం నేర్పే గురువుగా నటించిన వ్యక్తి పేరు చాగంటి వెంకట్రావు. మా ఫ్రెండ్ తాత గారాయన. హైస్కూల్లో రోజుల్లో చూశాను. అరవై ఏళ్ళ వయసు తర్వాత సినిమా ఛాన్స్ వచ్చిందంటూ ‘సితార’లో ఆయన గురించి రాయటం తర్వాత రోజుల్లో చూశాను.
అంతగా పాపులర్ కాని పాటల్లో కూడా ఆణిముత్యాలుంటాయి. కాకపోతే అందరూ గుర్తించరు.

Syamala Madduri చెప్పారు...

వేణూ!యమునా తీరాన పాటపై ఎం ఎస్ విశ్వనాథన్ స్వర మాధురి పై నువ్వు పోస్ట్ చేసిన యీ బ్లాగు ఎంతో బాగుంది!నీీకిష్టమైన ఈ పాట నాకుకూడా చాలా ఇష్టం!ముఖ్యంగా రాధ మదిలో కృష్ణు ని ప్రేమ కధ !అన్న చోట
రాధయొక్క ప్రేమ కథ అనికృష్ణుడి ప్రేమ కథ అని రెండర్థాలూవచ్చే చమత్కారం వుంది పాటకు కొసరి పాడేటి ప్రేమ ఉండడం అపురూపంకదా!సాహిత్యం సంగీతం రెండూ బాగున్నాయి!ఈపోస్ట్ లో మన చిన్న నాటి చాగంటి వెంకట్రవుగార్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు!