సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

16, మార్చి 2009, సోమవారం

కొడవటిగంటి రచనా ప్రపంచం


మీరు కొడవటిగంటి కుటుంబరావు గారి పుస్తకాలు ఏమైనా చదివారా?

నేను ఆయన పుస్తకాలను కాస్త ఆలస్యంగానే చదవటం మొదలుపెట్టా. చదివినకొద్దీ ఎంతగానో నచ్చటం మొదలయింది... అలా ఏకబిగిన చాలా రచనలు చదివేశా. విషయంలో కొత్త చూపు, అద్భుతమైన పఠనీయత కొ.కు. రచనల విశిష్టత.

తన రచనల్లో శైలి గురించి ఆయన పెద్దగా పట్టించుకోలేదనే విమర్శ ఉంది కానీ నాకు అలా అన్పించదు. 75, 80 ఏళ్ళక్రితం రాసిన కథలు చూడండి... ఎంత ఆధునిక భాషాశైలి ఉంటుందో.

కొన్నేళ్ళక్రితం విశాలాంధ్ర వారు కుటుంబరావు సాహిత్యం పేరుతో ఆరు పెద్ద సంపుటాలు తెచ్చారు. మరో నాలుగు కథల సంపుటాలు, రెండు నవలా సంపుటాలు, ‘చదువు’ నవల... ఇవి కూడా.

ఇప్పుడివన్నీ దొరకటం లేదు.

తాజాగా విరసం వారు కొడవటిగంటి రచనా ప్రపంచం పేరుతో 16 సంపుటాలు తెచ్చే పెద్ద ప్రయత్నం ఆరంభించారు. ఇప్పటికే 2 కథల సంపుటాలు వచ్చేశాయి.

మొత్తం 16 పుస్తకాల వెల రూ.3,000.

అయితే ఇప్పుడు రూ. 2,000 చెల్లించినవారికి పుస్తకాలన్నీ పంపిస్తారు.

ఆసక్తి ఉన్నవారు గుంటూరులో ఉండే సి.ఎస్.ఆర్. ప్రసాద్ గారిని 98854 46750 నంబర్లో సంప్రదించవచ్చు.
..........



ఇప్పటికీ అవకాశం ఉంది!   కొత్త చేర్పు (6.11.09) 

ది కొ.కు. శత జయంతి సంవత్సరం.  ఈ కారణంతో... దాదాపు ప్రతి సాహిత్య పత్రికా కొ.కు. రచనల గురించి ప్రత్యేక సంచికలూ, ప్రత్యేక వ్యాసాలూ ప్రచురిస్తోంది. టీవీల్లో,  దినపత్రికల సాహిత్య పేజీల్లో  కొ.కు.  ప్రస్తావన కనిపిస్తోంది.

(శత జయంతి,  ఒకవేళ  వచ్చే సంవత్సరమైతే, ఈ ఏడాది ఆయన్ని పట్టించుకునేవాళ్ళు  కాదు) :)

విషయమేంటంటే... కొ.కు. 16  సంపుటాలనూ 2 వేల రూపాయిలకే ఇచ్చే పథకం,  వాస్తవానికి   డిసెంబరు -08 కే  పూర్తయింది. ఇప్పటికే నాలుగు సంపుటాలు విడుదలయ్యాయి.
 
ఈ సంవత్సరం జనవరిలో తొలి సంపుటం, మార్చి లో రెండోదీ,  ఏప్రిల్- మే నెలల్లో మూడో సంపుటం, సెప్టెంబరు లో నాలుగోదీ వచ్చేశాయి.

5, 6  భాగాలు   ప్రింటింగులో ఉన్నాయి.

కానీ  రెండు వేల రూపాయిల రాయితీ పథకాన్ని ఇప్పటికీ పరిమిత సంఖ్యలో చందాదారులకు వర్తింపజేస్తారు. 

ఈ సంపుటాల  ప్రచురణ బాధ్యతలు చూస్తున్న ఎన్. వేణుగోపాల్  గారు  ఈ సంగతి చెప్పారు.  కొ.కు. సంపుటాలన్నీ కావాలనుకునే పాఠకులు,  హైదరాబాద్ పరిసరాల్లోని వారైతే ఆయనకు ఫోన్ చేసి ( 98485 77028 )  వివరాలు తెలుసుకోవచ్చు.

చిరునామా
మైత్రి రెసిడెన్సీ, 3-6-394,
వీధి నెంబరు 3, హిమాయత్ నగర్,
హైదరాబాద్ – 500 029.


మిగిలిన ఊళ్ళలోని పాఠకులు,   గుంటూరులో ఉన్న  సి.ఎస్.ఆర్. ప్రసాద్ గారిని సంప్రదించవచ్చు.

2 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వేణు చెప్పారు...

సుజాత గారూ,

నిజమే, మీరన్నట్టు కొన్ని పుస్తకాలు ఇప్పటికే తమ దగ్గర ఉన్నవారికి ‘మళ్ళీ అన్నీ కొనటం ఎందుకు?’ అనిపిస్తుంది. నా దగ్గర కూడా విశాలాంధ్ర ప్రచురించిన కొ.కు. సాహిత్య సంపుటాలు, చదువు, కథల సంపుటం ఉన్నాయి. మిగిలినవి దొరుకుతాయని నమ్మకం లేదు.

ఇలాంటపుడు కొడవటిగంటి పుస్తకాలు సమగ్రంగా దొరికే అవకాశం వదులుకోకూడదు కదండీ. అందుకే అన్నీ తెప్పించుకుంటున్నా.

మరో విషయం- విశాలాంధ్ర వాళ్ళు విషయపరంగా సంపుటాలు తెచ్చారు. ఇప్పుడు విరసం వారు కాలక్రమానుగతంగా (క్రోనలాజికల్ ఆర్డర్) తెస్తున్నారు. 10 కొత్త కథలు కూడా చేరుస్తున్నారు.

మీ విషయానికొస్తే- సంపుటాలు విడుదలైనపుడు మీ దగ్గర లేనివి మాత్రమే విడిగా తీసుకోవచ్చు కానీ - అన్నీ అలా సాధ్యం కాకపోవచ్చు. దీనికి కారణం- పంకలనం విషయంలో విశాలాంధ్ర, విరసం వారు పాటిస్తున్న వేర్వేరు పద్ధతులే.

పోనీ, కొ.కు. పుస్తకాలు ఇంట్లో ఒకటికి రెండు ఉండనీయండి, మంచిదేగా.