సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

24, ఏప్రిల్ 2009, శుక్రవారం

ఆ రెండు మౌన గీతాలు !


ళయరాజా స్వరపరిచిన పాటల్లో ఓ రెండు నాకు మరీ మరీ ఇష్టం.

1981లో వచ్చిన ‘మౌనగీతం’లో పాట ఒకటి.

1983లో వచ్చిన ‘సాగర సంగమం’లోది మరోటి.

రెంటినీ బాలూ, జానకి లే పాడారు.

పల్లవికీ చరణానికీ మధ్య వచ్చే వాద్య సంగీతం ఆ పల్లవీ, చరణాలకంటే మధురంగా ఉండటం చాలా అరుదు. 

ఇళయరాజా పాటల్లో బాణీకి ఉండే ప్రాధాన్యమే వాద్య (జంత్ర) సంగీతానికి ఇవ్వటం క(వి)నిపిస్తుంది.

మౌనగీతంలోని ‘పరువమా చిలిపి పరుగు తీయకు’ అనే పాటలో బాణీకి రెండో స్థానం, Interlude కు ప్రథమస్థానం ఇస్తా నేను. ఆ పాట కొత్తగా వినిపిస్తున్న రోజుల్లో మనసుకు ఎలాగో పట్టేసింది. 

 ఎక్కడో రేడియోలో దూరంగా వస్తూంటే పాట పూర్తయ్యేవరకూ ఆగిపోయి వినటం, తర్వాతే కదలటం నాకింకా బాగా గుర్తు. 

తొలి చరణానికి ముందు వచ్చే గంటల్లాంటి ధ్వని, అంతకుముందు ఆగిపోతూ మెల్లగా అయిపోతూ సాగిపోయే వాద్యసంగీతం మర్చిపోలేము. రెండో చరణానికి ముందు వచ్చే సంగీతం మొదటి దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఒకదానితర్వాత ఒకటిగా దూసుకొచ్చే వాద్యాల సమ్మేళనం వింత అనుభూతిని ఇస్తుంది.

తర్వాతి సంవత్సరాల్లో క్యాసెట్ దొరుకుతుందేమోనని ప్రయత్నించా కానీ దొరకలేదు. అయితే ఇప్పడా పాట అంతర్జాలంలో అందుబాటులో ఉందనుకోండీ. 

ఈ పాట మహా బేస్ వాయిస్ తో మొదలవుతుంది. 

అయినా ఆకట్టుకోవటం ఇళయరాజీయమే.

రెండో పాట ‘మౌనమేలనోయి...’ . ఇది అందరికీ తెలిసిన పాటే. ఈ పాట కొత్తగా రేడియోలో వినిపించే రోజుల్లో నాకో విచిత్రమైన అనుభవం ఎదురైంది. నేను నిద్రపోయి, మెలకువ వస్తున్నదశలో ఆ పాట చెవులకు సోకింది. నిద్ర లేచాక కూడా ఆ ట్యూనింగ్, నేపథ్యంలోని ఆ వేణు గాన మధురిమ నన్ను వదల్లేదు. 

It haunts me like anything for a long time.

సాహిత్యం సరిగా వినలేదు కాబట్టి ఆ పాట ఏమిటో, ఏ సినిమాలోదో తెలుసుకోవటం అంత త్వరగా సాధ్యమే కాలేదు. 

 అది కమలహాసన్- విశ్వనాథ్- ఇళయరాజా ల త్రివేణీ సంగమం ‘సాగర సంగమం’లోదని తర్వాత తెలిశాక సంతోషం వేసిందనుకోండీ. 

‘తారాడే హాయిలో...’ తర్వాత ఒకదాని వెంట మరొకటి వినవచ్చే రెండు రకాల వేణువుల మాధుర్యం, ‘ ఇది ఏడడుగుల వలపూ మడుగుల.. ’ దగ్గర బాలు గొంతులో పల్లవించే భావం, ఆ బాణీలోని శ్రావ్యత అనుభూతించండి.

ఈ రెండు పాటల్లో ఒకదాని సినిమా పేరులో మౌనం, మరో పాటలో పల్లవిలోనే మౌనం ఉండటం- ఈ రెండూ నా హాంటింగ్ మెలడీలు కావటం నాకు సంబంధించి ప్రత్యేకంగా అనిపిస్తాయి.
 
ఆత్రేయ, వేటూరిలు రాసిన పాటలివి. కింద ఇచ్చిన సైట్లో పాటల లిరిక్స్ ను ఆ పాట ఎదురుగా లింక్ అనేచోట నొక్కి చూడవచ్చు.

http://www.chimatamusic.com/searchmd.php?st=Ilaya%20Raja
ఇప్పడు పాటలను వినే లంకెలు ఇస్తున్నా కింద.
పరువమా... పాట వినటం కోసం...
http://www.chimatamusic.com/playcmd.php?plist=7515
మౌనమేలనోయి... పాట వినటం కోసం...
http://www.chimatamusic.com/playcmd.php?plist=5768

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మౌనగీతాల సంగతులు మధురంగా ఉన్నాయి, ఇలాంటి వాటి గురించి ‘బిహైండ్ ద సీన్స్’ ఏమైనా తెలిస్తే రాయండి. మీనుంచి మరిన్ని మంచి టపాలు ఆశిస్తున్నా.

వేణు చెప్పారు...

ధ్యాంక్యూ! ‘బిహైండ్ ద సీన్స్’ తెలిసినవి తప్పకుండా రాస్తాను.

SURYA చెప్పారు...

Let me tell you a very interesting thing about PARUVAMA song. This was revealed by none other than SPB himself on ETV's Paduta Teeyaga show very recently.
Listen the song very carefully and you will find a constant "jogging beat" that goes with the situation. Imagine how that sound was generated!
The maestro did not use any instrument for that. Rather, he asked one of his musicians to clap on his thigh continuously to obtain that sound. What a great imagination!
According to SPB, the song came out very beautifully but by the end of the recording, the musician who produced the sound had literally been left with swollen thighs because of the constant clapping.
I was not only amazed on hearing this but also my eyes turned moist. What a great composer Ilaiyaraja is! Hats off.
Try to translate this info into Telugu and re-write a full piece about the Paruvama song. If you can use your influence in ETV, try to get the recording of the two episodes of Paduta Teeyaga where Gangai Amaran was the chief guest and Ilaiyaraja's songs were exclusively sung. In fact, Paduta Teeyaga helps music buffs learn a lot about many things related to film music.

వేణు చెప్పారు...

సూర్యా,
పరువమా పాటలో ‘జాగింగ్ బీట్’ గురించి నువ్వు చెప్పింది అనూహ్యం. నిజంగా ఆసక్తికరంగా ఉంది!
ఈటీవీ ‘పాడుతా తీయగా’లో గంగై అమరన్ అతిథిగా వచ్చిన భాగాలు చూడలేదు. ఆ భాగాలు సంపాదించటానికి ప్రయత్నిస్తాను. మంచి సమాచారం పంచుకున్నందుకు థాంక్యూ!

M b d syamala చెప్పారు...

మౌనగీతాలు పోస్ట్్ నన్నెంతో ఆనందపరిచింది ఇళయరాజా మ్యూజిక్ మ్యాజిక్ గురించీ ఎంత చెప్పుకున్నా తక్కువే!!చిత్రమేమిటంటే నా క్కూడా గుందెను ఉయ్యాలలూపిన పాట పరువమా చిలిపి పరుగు తీయకే పాట!జానకి బాలు అద్భుతంగా పాడారు నువ్వన్నట్లు ఈ పాటలో interludeకి ప్రథమ స్థానం బాణికి రెండో స్థానం అన్న నీ మాటతో నేనేకీభవిస్తాను ఆరిథం అద్భుతం ఇక మౌనమేలనోయి ఈపాట ఒక లలిత లలిత సుమధురగీతం !రచన రాగం సంగీతం అన్నీ సమ్యక్మిశ్రితమైన గీతం ఇంత మంచి పాటలను గుర్తు చేసినందుకు నీకు ధన్యవాదాలు!

వేణు చెప్పారు...

Thank you Syamala, for your response and opinion. Glad that you too like the song!