సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

30, మార్చి 2009, సోమవారం

ఇళయరాజా ఇంద్రజాలం !


రీ-రికార్డింగ్ తో సినిమాలకు ప్రాణం పోసే కళలో ఇళయరాజా నిష్ణాతుడని ఆయన వీరాభిమానుల్లో చాలామందికి తెలుసు.

ఇళయరాజా అంటే కేవలం శ్రావ్యమైన పాటల స్వరకర్త అనుకుంటే ఆయన్ను పరిమితంగానే అర్థం చేసుకున్నట్టు. కొందరికి మాత్రమే తెలిసిన అలనాటి సంఘటన మీతో పంచుకుంటా.
‘సితార’ సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక తొలి కాపీ చూసి, అందరూ ముఖాలు వేలాడేసుకున్నారట. (వంశీకి అది రెండో చిత్రం). అప్పుడు ఇళయరాజా వచ్చి , సినిమాకు నేపథ్యసంగీతం కూర్చారు.

అప్పటివరకూ డల్ అనుకున్న సినిమా ఆసక్తికరంగా, కళాత్మకంగా తయారైంది!

అదీ ఇళయరాజా అంటే.

వంశీ- ఇళయరాజాల సమ్మోహన సమ్మేళనానికి అది నాంది.

నేపథ్య సంగీతం (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ) ని బీజీఎం అని పొడి అక్షరాలతో వ్యవహరిస్తుంటారు. ఇది సంభాషణల వెనక, సన్నివేశాల మధ్య వచ్చే వాద్యసంగీతం. ఒక్కోసారి నిశ్శబ్దం కూడా అత్యంత ప్రభావశీలంగా ఉపయోగపడుతుంది.

ఇళయరాజా బీజీఎంలు ఎంత బాగుంటాయంటే అవి తర్వాత వచ్చిన ఆయన సినిమాల్లో పల్లవులుగా రూపాంతరం చెందాయి.

‘గీతాంజలి’లో బీజీఎంలు ఎంతోమందికి ఇష్టం. నాయకుడు, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వర్ణకమలం, శ్రీ కనకమాలక్ష్మీ రికార్డింగ్ డ్రాన్స్ ట్రూప్, అన్వేషణ ... ఇలా ఎన్నో సినిమాలను ఉదాహరించొచ్చు.

ఇన్ని చెప్పి ఇళయరాజా బీజీఎంలు వినగలిగే సైటు గురించి చెప్పకపోతే చాలా అన్యాయమవుతుంది।ఇదిగో...ఆ వెబ్ సైట్.

వినండిక మధురమైన నేపథ్యసంగీతం!

(ఈ సైటులో సినిమా-ఇతర వాద్య సంగీత ఆల్బమ్ లు ‘నథింగ్ బట్ విండ్’ , హౌ టూ నేమ్ ఇట్’ కూడా ఉన్నాయి).

5 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

ఇళయరాజా గారి సంగీతం గురించి రాసినందుకు చాలా సంతోషం.

చైతన్య చెప్పారు...

ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది... he is a legend!
thanks for the link

krishna rao jallipalli చెప్పారు...

మంచి లింకు ఇచ్చినందుకు అబినందనలు.

వేణు చెప్పారు...

@ సీతారాంరెడ్డి గారూ, ఇళయరాజా గురించి మరికొన్ని విశేషాలు త్వరలో రాయాలని నా ఆలోచన.
@ చైతన్య గారూ, మీ వ్యాఖ్య నిజమే. ఆయన living legend. అనంతమైన కళాప్రతిభ ఇళయరాజాది.

వేణు చెప్పారు...

@ Krishna rao గారూ, ధ్యాంక్సండీ!