సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

5, ఆగస్టు 2010, గురువారం

రంగనాయకమ్మ గారు మాట తప్పారు!

శ్చర్యంగా ఉంది కదూ? నిజమే!

ఎందరో పాఠకులు ఏళ్ళ తరబడి ఎంక్వయిరీలు చేస్తూ చదవాలని ఎదురుచూస్తున్న నవల.. ‘కృష్ణవేణి’  కొత్త ముద్రణ 38 ఏళ్ళ తర్వాత   ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసింది!

మాట తప్పటం ఏమిటంటారా?

ఈ నవల ప్రచురణ నిలిపివేసి, ‘కృష్ణవేణి ఇక రాదు’ అని గతంలో ఆమె  ప్రకటించిన సంగతి చాలామందికి తెలుసు!

‘‘కృప్ణవేణి నవల మళ్ళీ చదివితే, దాన్ని మళ్ళీ, మళ్ళీ ప్రచురించవలసిన  అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చాను. యువతీ యువకుల మధ్య ప్రేమా, దానిలో తలెత్తే సమస్యలూ- ఇదే అందులో కథా వస్తువు అయినా, ఆ వస్తువును చిత్రించడంలో, అందులో చాలా పొరపాట్లు జరిగాయి. చాలా తప్పు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

.. పాఠకులకు ఉపయోగకరంగా లేని రచనని ప్రచురించకుండా ఉండటమే చాలా న్యాయం. ఈసారి ‘కృష్ణవేణి’ చదివి, దాని ప్రచురణ ఆపాలనే అభిప్రాయానికి వచ్చాను.’’
‘కృష్ణవేణి’ రచనా కాలం నాటి రచయిత్రి ఫొటో

ఇలా ఆమె 1982లో ‘స్వీట్ హోమ్’ నవల ముందుమాటలో రాసిన దగ్గర్నుంచీ పాఠకుల అసంతృప్తులు మొదలయ్యాయి. ‘ఇదేం పని’ అంటూ పాఠకులు వాళ్ళ కోణంలో ఇన్నేళ్ళుగా ఆమెను అడుగుతూనే ఉన్నారు.  

‘ప్రభ’లో సీరియల్ వచ్చిన కాలంలో నేను పుట్టనే లేదు. 16 ఏళ్ళు వచ్చేవరకూ  ఆమె పుస్తకాలతో పరిచయం లేదు. ఈలోగా  ‘కృష్ణవేణి’ ప్రచురణ ఆపేశారు. అలా ఆ పుస్తకం మిస్సయ్యాను. కానీ, ఆ పుస్తకంలో ఏం ఉందో చదవాలని ఉత్సుకత. ఎలా?  మొత్తానికి విజయవాడ లెనిన్ సెంటర్లోని పాత పుస్తకాల షాపులోనే ఈ నవల సంపాదించి, చదివేశాను.

కానీ, ఎక్కడెక్కడో  ఉన్న  మిగతా పాఠకుల సంగతి?  ‘కొత్త ముందుమాటలు’ రాసి అయినా సరే, ఆ పుస్తకం రీ ప్రింట్ చేయమని వాళ్ళు తరచూ అడగటం మానలేదు.  ఇక పుస్తకాల ఎగ్జిబిషన్లలో అయితే, ప్రతి సంవత్సరం కొందరు పాఠకులైనా ‘కృష్ణవేణి’ నవల గురించి ఎంక్వయిరీ చేయకుండా  ఉండరు.

అయినా సరే, రంగనాయకమ్మ గారు  తన చెప్పిన మాట మీదే నిలబడ్డారు...ఇన్నేళ్ళూ!

చివరికి-  38 సంవత్సరాల  తర్వాత.. పాఠకుల వాదనే, వారి  అభీష్టమే నెగ్గింది! ‘కృష్ణవేణి’ పునర్ముద్రణకు సమ్మతించారామె.

అందుకే ... ‘మాట తప్పాను’  అని తాజా పుస్తకం కవర్ పేజీ పైనే ప్రకటించారు.

‘‘.. కానీ  ఇప్పుడు  ఇందులో (తాజా ముద్రణలో ) అనేక విమర్శలు చేర్చాను కాబట్టి, దీనివల్ల పాఠకులకు మేలే గానీ హాని లేదు. ఈ కథలో, పరిశీలించి నేర్చుకోవలసిన విషయాలు, చాలా ఉన్నాయి. ఆ అవసరం కోసమే నా మాట తప్పాను’’  అని ముందుమాటలో వివరించారామె.


1964లో వచ్చిన ఎడిషన్  ముఖచిత్రం


తొలి నవల ఇదే!

రంగనాయకమ్మ గారు రాసిన తొలి నవల ‘కృష్ణవేణి’. పందొమ్మిది ఏళ్ళ వయసులో 1959లో ఆమె ఈ నవల   రాశారు. 1960లో  ఆంధ్రప్రభ వారపత్రికలో ఇది సీరియల్ గా వచ్చినపుడు ఎంతో ఆదరణ పొందింది. వారం వారం పాఠకులు ఆసక్తిగా ఎదురుచూసి మరీ  చదివారు.ఇది 1974 నాటి ముఖచిత్రం


1979లో వచ్చిన ఎడిషన్   ముఖచిత్రం

  
  ‘కృష్ణవేణి నవల ప్రచురితమవుతున్న రోజుల్లో యూనివర్సిటీ విద్యార్థులు పత్రిక కాపీల కోసం వాల్తేరు స్టేషన్ కి పరుగెత్తేవార’ని  పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు ఓచోట రాశారు.

1961లో ఈ నవల తొలిసారి  పుస్తకంగా వచ్చింది. తర్వాత ఆపేసేవరకూ రెండు మూడేళ్ళ కోసారి పునర్ముద్రణ అవుతూ వచ్చింది.

‘‘ఈ కథ అంటే నాకు మొదటి నించీ ఇష్టమూ, భయమూ కూడా’’ అన్న రంగనాయకమ్మ గారే  ‘‘.. ఈ పుస్తకం అంటే ఇప్పుడు భయం తగ్గింది’’  అని కూడా  అంటున్నారు.

ఎందుకంటే...

నేనెందుకులెండి  చెప్పటం! పుస్తకం చదివేటప్పుడు మీకెటూ  తెలుస్తుందిగా!:)

ఈ  నవలను ఈ-బుక్ గా కినిగెలో చదవాలంటే...  లింకు-
 http://kinige.com/kbook.php?id=933&name=Krishnaveni

తాజా కలం: (30.8.10) 
ఈ నవల గురించి నిన్నటి ఈనాడు ఆదివారం మ్యాగజీన్లో సమీక్ష వచ్చింది. చూడండి...

150 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

"కృష్ణవేణి" నవల నేను చదవలేదు. ఆ నవల ముద్రణ ఎందుకు ఆపేశారు అనే ప్రశ్నకి సమాధానంగా అందులో మూఢ నమ్మకాలు ఏవో ఉన్నాయని చెప్పినట్టు గుర్తు ఉంది.

వేణు చెప్పారు...

ప్రవీణ్ శర్మ గారూ!‘కృష్ణవేణి’ నవలను రంగనాయకమ్మ గారు ఇంతకాలం పున: ప్రచురించకుండా ఎందుకు ఆపేశారో .. ఈ టపాలోనే రాశాను కదా? మీకు గుర్తున్నట్టు- ఆ కారణం ‘మూఢ నమ్మకాలు ఉన్నాయని’ కాదు.

దశాబ్దాల తర్వాత కొత్త ప్రచురణ వచ్చింది కదా, ఇప్పుడు చదివి, మీ అభిప్రాయం కూడా చెప్పండి మరి!

Praveen Mandangi చెప్పారు...

నేను బలి పీఠం, జానకి విముక్తి నవలలు చదివాను. బలి పీఠం నవల వ్రాసిన శైలికి, జానకి విముక్తి నవల వ్రాసిన శైలికి చాలా తేడా ఉంది. జానకి విముక్తి నవలలో "కొందరు రాజకీయంగా కొంత అభ్యుదయ భావాలు కలిగి ఉన్నా, స్త్రీ-పురుష సంబంధాలు విషయానికి వచ్చేసరికి పాత భూస్వామ్య భావాలనే నమ్ముతారు" అనే డైలాగ్ బాగా ఆలోచింపచేస్తుంది.

సమైక్యవాది చెప్పారు...

ఎందుకు ప్రవీణూ రంగనాయకమ్మ గారిని అంత అన్ పాపులర్ చేస్తావు? అసలు టపాలో ఎందుకు పునర్ముద్రించబడలేదో క్లియర్ గా రాసుంటే నీకు కనబడలేదా?

అవునులే అసలు నువ్వు వ్యాఖ్యానించే ముందు అసలు టపా పూర్తిగా చదివితే కదా..

సరే మూఢనమ్మకాల వల్ల అని అన్నావు. అది ఎక్కడి నుంచి విన్నావు/చదివావు అనే విషయం కూడా రాయవు. నీకు తోచింది ఊహించి రాసేస్తుంటావు. ఎలాగబ్బా నీతో?

డేవిడ్ చెప్పారు...

ఇన్నాళ్ళకన్న కృణవేణి నవల పునర్ముద్రనకు నోచుకున్నందుకు సంతోషం...నేను ఆ నవల కోసం ఎదురుచుశాను ఇన్నాల్లకు మల్లి మార్కేట్లోకి వచ్చ్గందన్నమాట. స్వీట్ హొం నవల సందర్బంగా కొన్ని నవలలను ఎందుకు పునర్ముద్రించడం లేదో వివరించారు. తప్పకుండ ఆ నవలను చదవాలి....

తార చెప్పారు...

లేదు లేదు, అన్నకి అది ఇంగ్లీషు కాకపోవటం వలన చదివినా అర్ధం కాలేదు

వేణు చెప్పారు...

@ ప్రవీణ్ శర్మ, సమైక్యవాది, తార : థాంక్యూ!:)

వేణు చెప్పారు...

@ క్యాంపస్ వాయిస్: మీలాగే చాలామంది పాఠకులు ‘కృష్ణవేణి’ చదవాలనే అభిలాషతో ఉన్నారండీ. నవోదయకో, విశాలాంధ్రకో వెళ్తే ఈ నవల తప్పుకుండా దొరుకుతుంది. మీ స్పందనకు ధన్యవాదాలు.

వేణు చెప్పారు...

సుజాతా! నిజమేనండీ. ఈ నవలకు రంగనాయకమ్మ గారు రాసిన ఫుట్ నోట్లు ఎంత నవ్వు తెప్పిస్తాయో.. కథా గమనానికి ఇవి అడ్డు పడిన ఫీలింగ్ కూడా నాకు రాలేదు.
సో.. ‘కృష్ణవేణి’ గురించి మీరు రాసే టపా కోసం ఎదురుచూస్తాను. మీ స్పందనకు థాంక్యూ.

Praveen Mandangi చెప్పారు...

సుజాత గారు. రంగనాయకమ్మ గారు మార్క్సిస్ట్ కనుక ఆఆమె రచనలు చాలా మంది చదవరు. గతంలో నేను ఇంగ్లిష్ లో ఒక పుస్తకం వ్రాసి ప్రజాశక్తి బుక్ హౌస్ ద్వారా పబ్లిష్ చేశాను. ఆ పుస్తకానికి యాభై కాపీలు వరకే అమ్ముడుపోయాయి. ఆ పుస్తకానికి 500 కాపీలు ప్రింట్ చెయ్యడానికి అప్పట్లో నాకు 3000 రూపాయలు ఖర్చు అయ్యాయి. ఆ పుస్తకం కావాలంటే మీకు ఫ్రీగా పంపిస్తాను. అది మార్కెట్ లో ఎక్కడ దొరుకుతుందో ఎవరినైనా అడగండి.

వేణు చెప్పారు...

ప్రవీణ్ శర్మ గారూ!
‘రంగనాయకమ్మ గారు మార్క్సిస్ట్ కనుక ఆమె రచనలు చాలా మంది చదవరు’అన్న మీ అభిప్రాయంతో ఏకీభవించలేను. ‘మార్క్సిస్టుల రచనలు ఎక్కువమంది చదవరు’ అనేదే నిజమైతే... కొ.కు., శ్రీశ్రీల పుస్తకాలకు అంత విస్తృత పాఠకాదరణ ఉండేదా?

రంగనాయకమ్మ గారి రచనల్లో కథలూ, నవలలనే కాకుండా non-fiction ను కూడా పాఠకులు బాగానే చదువుతున్నారు. పుస్తక ప్రతుల విక్రయం, తరచూ జరుగుతున్న పునర్ముద్రణలే దీనికి సాక్ష్యం!

తార చెప్పారు...

సుజాత గారి మీద ఎదో హత్యా ప్రయత్నం జరుగుతునట్టున్నది..

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

వేణు గారు. ఈ లింక్ చదవండి: http://blogzine.sahityaavalokanam.gen.in/2010/08/blog-post_06.html

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

సుజాత గారి సమాధానం కోసం ఆ ఒక్క పోస్ట్ కే కామెంట్లు ఎనేబుల్ చేశాను. సుజాత గారి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను.

వేణు చెప్పారు...

ప్రవీణ్ శర్మ గారూ!
‘మూఢనమ్మకాలు’ అనే మాట రంగనాయకమ్మ గారే ఉపయోగించారు కాబట్టి, మీరు రాసింది ‘కొంత’ కరెక్టే. మీరు ప్రస్తావించిన ‘ఇంటర్వ్యూ’ గమనం సాహిత్య వార్షిక సంచికలో 2001 ఏప్రిల్లో ప్రచురితమైంది. (దాన్నే ‘మానవ సమాజం’ పుస్తకంలో చేర్చారు).

రంగనాయకమ్మ గారి వాక్యం మరోసారి చూద్దాం- కృష్ణవేణి నవల్లో ‘‘స్త్రీల ఆత్మగౌరవానికి తగిన అంశాలు చక్కగా లేవనీ, పైగా అందులో కొన్ని మూఢ నమ్మకాలు కూడా ఉన్నాయనీ అర్థమయ్యాక , ‘అయ్యో, అలా రాశానా?’ అనుకోకుండా ఎలా ఉంటాను?’’

‘కృష్ణవేణి’నవలపై అసంతృప్తినే కానీ, ఆ ప్రచురణను ఎందుకు ఆపేశారో ఆ కారణం ఈ ఇంటర్వ్యూలో రంగనాయకమ్మ గారు చెప్పలేదు కదా? ఆ కారణాన్ని అప్పటికి 19 ఏళ్ళ క్రితం- 1982లో ‘స్వీట్ హోమ్’ ముందుమాటలోనే స్పష్టంగా చెప్పారు.

దాన్నే నేను నా టపాలో కోట్ చేశాను. అది ‘చదివాక’ కూడా మీకు ‘గమనం’ ఇంటర్ వ్యూలోని వాక్యమే గుర్తొచ్చిందన్నమాట!:)

దీని గురించి మీ బ్లాగులో ఏకంగా టపాయే రాసేశారే!

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

నేను పై కామెంట్ పోస్ట్ చేసినప్పుడు ఆఫీస్ లో ఉన్నాను. "మానవ సమాజం" పుస్తకం ఇంటిలో ఉంది. నా పుస్తకాలు కొన్ని ఆఫీస్ లో, కొన్ని ఇంటిలో ఉంటాయి. స్కానర్ ఆఫీస్ లో ఉంది. మీ కోసం ఇంటికి వెళ్లి పుస్తకం తీసుకొచ్చి స్కాన్ చేశాను. మానవ సమాజం పుస్తకం 2006లో చదివాను. అందులో వ్రాసినవి గుర్తుండకపోవచ్చు. అంతమాత్రాన వ్యక్తిగత ఆరోపణలు చెయ్యాల్సిన అవసరం లేదు.

సుజాత గారు. మీతో అలా మాట్లాడింది జ్యోతి గారు అని సమాధానం స్టైల్ చూస్తే తెలిసిపోతుంది. ఆ మధ్య కస్తూరి మురళీకృష్ణ అనే రచయిత ద్రౌపది నవలని విమర్శించడానికి ఆ నవల చదవాల్సిన అవసరం లేదు అని అన్నారు. జ్యోతి గారు మురళీకృష్ణ గారి అభిమాని. జ్యోతి గారికి మొదటి నుంచి నా రచనలంటే ఇష్టం లేదు. నా రచనలు నచ్చకపోతే ఆమె నా రచనలు చదవాల్సిన అవసరం లేదు. అంతమాత్రాన నా అభిమాన రచయితలని కూడా విమర్శించడం విచిత్రంగా ఉంది. నేను అడవి బాపిరాజు వ్రాసిన నారాయణరావు నవల, ఇతర నవలలు కూడా చదివాను. నేను చదివిన నవలల లిస్ట్ ఇస్తే ఆ నవలలు చదవకూడదు అనుకుంటారా? ఇది చాలా విచిత్రమైన వాదనలా ఉంది.

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

ఇక్కడ నేనేమీ బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం లేదు. మా పట్టణంలో విశాలాంధ్ర బ్రాంచ్ తప్ప ఎక్కడా మార్క్సిస్ట్ పుస్తకాలు దొరకవు. ఒకప్పుడు విజయవాడకి చెందిన మాధురి పబ్లికేషన్స్ వారు మా పట్టణంలో బుక్ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు నేను రంగనాయకమ్మ గారు వ్రాసిన జానకి విముక్తి నవల, మానవ సమాజం వంటి పుస్తకాలు కొన్నాను. రంగనాయకమ్మ గారు వ్రాసిన మిగిలిన రచనలు వైజాగ్, విజయవాడలలో కొన్నాను.

చదువరి చెప్పారు...

"ఆ వస్తువును చిత్రించడంలో, అందులో చాలా పొరపాట్లు జరిగాయి. చాలా తప్పు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి." అని ఆమె అన్నట్టుగా మీరు రాసారు. ’మూఢనమ్మకాల’ని ఆమె అన్నట్టుగా ప్రవీణ్ చూపించారు. రెండూ రచయిత్రి చెప్పినవే. పొరపాట్లూ, తప్పు అభిప్రాయాలే మూఢనమ్మకాలని రచయిత్రి ఉద్దేశమేమోనని అనిపిస్తోంది.

ప్రవీణ్ చెప్పేదాంట్లో విషయమున్నట్టుగానే నాకగుపిస్తోంది. దాన్ని తోసిపుచ్చనక్కర్లేదు.

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

బ్లాంకెట్ స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్లకి సమాధానం చెప్పినట్టు నాకు సమాధానం చెప్పడం బాలేదు. టాపిక్ కి సంబంధం లేవి విషయం చెపుతున్నానని అనుకోవద్దు. "కొంచెం ఆధునికత నేర్చుకోవాలి, శంకరాభరణం శంకర శాస్త్రిలా మడికట్టుకుని కూర్చుంటే బాగుపడము" అని అంటే "నీకు అర్థం కాని, మాకు అవసరం లేని సలహాలు ఇవ్వకు" అని సమాధానం చెప్పింది ఓ శిరోమణి. ఆమె శంకరాభరణం సినిమా చూసిందో లేదో నాకు తెలియదు. ఆ సినిమా చూస్తే నిజజీవితంలోని కష్టాలు కొంత వరకైనా అర్థమవుతాయి. "నేను ఒకరిని కన్విన్స్ చెయ్యడానికి చెప్పలేదు. నా సలహా నచ్చకపోతే అది మీ ఇష్టం" అని సమాధానం చెప్పాను. ఒకరి అభిప్రాయాలు మనకి నచ్చకపోవచ్చు. అంతమాత్రాన తమ అభిప్రాయాలు చెప్పినవాళ్లని తిట్టాలని రూల్ లేదు.

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

మార్క్సిస్ట్ పుస్తకాలు పబ్లిష్ చెయ్యడం సుజాత గారు చెపుతున్నంత సులభం కాదు. పుస్తకం వ్రాసినవాళ్లకి లాభం మీద ఆశ లేకపోయినా పబ్లిషర్లు లాభాల కోసమే అమ్ముతారు. పుస్తకం ప్రింటింగ్ కి ఒక కాపీకి 10 రూపాయలు ఖర్చు అయితే రచయిత కాపీ మీద ధర 30 రూపాయలు అని ముద్రించాలి. రవాణా ఖర్చులు పోనూ పబ్లిషర్ నుంచి రచయితకి వచ్చేది తక్కువే. ఆ పుస్తకం ప్రింట్ చెయ్యకముందు గాంధీ గారు (రంగనాయకమ్మ గారి జీవిత భాగస్వామి) పబ్లిషర్లు అంత తొందరగా డబ్బులు ఇవ్వరు అని చెపితే నేను నమ్మలేదు. పుస్తకం ప్రింట్ తీసిన తరువాత అర్థమయ్యింది. ప్రజాశక్తి వాళ్లకి 50 కాపీలు ఇచ్చాను. ఏడాది తరువాత నేను పుస్తకాలు పంపించినట్టు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వాళ్లు ఇచ్చిన రశీదు పోయింది. డబ్బులు తీసుకోవడానికి ప్రజాశక్తివాళ్ల దగ్గరకి వెళ్లలేదు. మిగిలిన 450 కాపీలు నా దగ్గరే ఉన్నాయి.

తార చెప్పారు...

మూఢ నమ్మకాలు అంటే చేతబడి, కాష్మోర, అవే కదా..

సుజాత గారు, ఆత్మహత్య చేసుకోవాలా/వద్దా అని డైలమాలో ఉన్నవారికి పనికిరావచ్చు, మీరు చెప్పినట్టు చేస్తే ఫోన్ బిల్లు తగ్గే అవకాశం కుడా ఉన్నది.

కానీ మీరు మూఢ నమ్మకాలని నమ్మితే మాత్రం కొందరు బతికి అవి మీపై ప్రయొగించే అవకాశం ఉన్నది సుమా.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సుజాత వేల్పూరి చెప్పారు...

మార్క్సిస్ట్ పుస్తకాలు పబ్లిష్ చెయ్యడం సుజాత గారు చెపుతున్నంత సులభం కాదు....

ఇదేమిటి ప్రవీణ్ ఈ ఆరోపణ? ఆ పుస్తకాలు పబ్లిష్ చేయడం గురించి నేనెక్కడ మాట్లాడానసలు?

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

మార్కెట్ లో పుస్తకాలు కొనేవాళ్లు ఎక్కువగా ఉంటే రచయిత లక్ష రూపాయలు ఖర్చు పెట్టైనా పుస్తకాలు ప్రింటింగ్ చెయ్యించగలడు. నేను ఇప్పటి వరకు మూడు పుస్తకాలు వ్రాసాను. పుస్తకాలు వ్రాసేవాళ్లకి పబ్లిషింగ్ ఎంత కష్టమో తెలియదా? కాపీకి పది రూపాయలు ఖర్చుతో ప్రింటింగ్ చెయ్యించినవారెవరైనా పుస్తకం మీద ధర ముప్పై రూపాయలనే ముద్రిస్తారు. పబ్లిషర్లు వాళ్లకి ఇచ్చేది తక్కువ అని వాళ్లకి తెలుసు లేదా ఆలస్యంగా ఇస్తారని తెలుసు. పుస్తకాలకి మార్కెట్ ఎక్కువ ఉంటే పబ్లిషర్ల నుంచి డబ్బులు తొందరగా రాబట్టుకోవచ్చు. నా పుస్తకాల విషయానికి వస్తే నా ఆఫీస్ లోనే అవి DTP చెయ్యించి వాటిని ప్రింటింగ్ ప్రెస్ వాళ్లకి ఇస్తాను. నాకు కేవలం DTP ఖర్చు మాత్రమే మిగులుతుంది. ప్రింటింగ్ ప్రెస్ వాళ్లు ప్రింటింగ్ మెటీరియల్ ధరలు పెరిగితే ప్రింటింగ్ చార్జిలు పెంచుతారు.

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

కొనేవాళ్లు ఉంటే పబ్లిష్ చెయ్యడం సులభమే నేను చెప్పేది. ఆ విషయం అర్థం కాలేదా? నా దగ్గర ప్రింటింగ్ కి సరిపడా డబ్బులు ఉన్నాయి. కొనేవాళ్లు తక్కువ కనుకే కాపీలు తక్కువగా ప్రింట్ చెయ్యిస్తుంటాను.

తార చెప్పారు...

వేణు గారు, ఇంక కామెంట్లు ఆపెయ్యండి, ఇదీ పబ్లిష్ చెయొద్దు.
బ్లాగ్ అందమే పొతున్నది, ఇంత మంచి బ్లాగ్ పాడు అవ్వటం బాలేదు..

వేణు చెప్పారు...

ప్రవీణ్ శర్మ గారూ!

ప్రచురణ కష్టాల గురించి ఇంత వివరించారు గానీ, మీరు రాసిన ఆ మూడు పుస్తకాల టైటిల్స్ ఏమిటో ఎక్కడా చెప్పనే లేదు. :)

అన్నట్టు- ‘మార్క్సిస్ట్ పుస్తకాలు పబ్లిష్ చేయడం గురించి నేనెక్కడ మాట్లాడానసలు?’ అని సుజాత గారడిగిన ప్రశ్నకు మీ జవాబేమిటి?

వేణు చెప్పారు...

తార గారూ!

థాంక్యూ వెరీ మచ్ ఫర్ యువర్ కన్సర్న్. టపాకు దూరంగా చర్చ వెళ్ళటం నాకూ నచ్చలేదు. అయినా ఏ కామెంటునూ రిజెక్ట్ చేయలేదు ‘ప్రజాస్వామిక దృష్టి’తో! మరీ దూషణతో ఉన్నవయితే ఎటూ తిరస్కరిస్తాననుకోండీ.

భావన చెప్పారు...

చాలా విన్నాను ఈ నవల గురించి. ఐతే ఇప్పుడూ చదివే అవకాశం కూడా దొరుకుతోంది. థ్యాంక్స్ వేణూ చెప్పినందుకు.

వేణు చెప్పారు...

@ భావన: ‘కృష్ణవేణి’ నవల గతంలో చదివినవారు కూడా ఈ కొత్త ముద్రణ చదవటం తప్పనిసరి అనుకునేలా రంగనాయకమ్మ గారి ఫుట్ నోట్లున్నాయి. మీ స్పందనకు ధన్యవాదాలు.

Unknown చెప్పారు...

ఈ పుస్తకం ఈ ఆదివారం సాయంత్రం నాకు అందుతుంది. వెంటనే చదవడం మొదలు పెట్టేస్తాను. చాలా ఎదురు చూస్తున్నాను ఈ పుస్తకం కోసం. అయితే, తొందరగా చదివేస్తే, అయిపోతుందే అని దిగులు కూడా వుంటుంది. చదివాక మళ్ళీ రాస్తాను.

ఎవరో అన్నట్టు, "మూఢ నమ్మకాలు అంటే చేతబడి, కాష్మోర, అవే కదా..." మాత్రమే కాదు. రంగనాయకమ్మ గారు మాటల్లో (అచ్చు అవే మాటలు కావు) చెప్పాలంటే, "సమాజంలో ఎక్కువ మంది పేదగానూ, తక్కువ మంది ధనికులు గానూ ఎందుకు వున్నారూ అని తెలుసుకోక పోవడం మూఢ నమ్మకం కాదూ?". ఒక విషయాన్ని తార్కికంగా తెలుసుకోకుండా, వున్నది వున్నట్టు నమ్మేస్తే దాన్ని మూఢ నమ్మకం అంటాము సాధారణంగా. రంగనాయకమ్మ గారు ప్రస్తావించినవి చేతబడి లాంటి మూఢ నమ్మకాలు కాదు.

వేరే చోట ఎవరో రాసినట్టు గుర్తు. చలం గారు నాస్తికులనీ, చివరి రోజుల్లో రమణ మహర్షి ఆశ్రమంలో చేరారనే అన్నట్టు గుర్తు. రెండవ మాట నిజమే గానీ, మొదటి మాట నిజం కాదు. చలం గారు నాస్తికులు కారు. ఆయన రచనల్లో నాకు తెల్సినంత వరకూ నాస్తికత్వం లేదు. ఎటొచ్చీ గుడ్డి నమ్మకాలను బాగా విమర్శించారు.

వేణు చెప్పారు...

JUBV గారూ!
మీరన్నది కరక్టే. రంగనాయకమ్మ గారు ‘మూఢ నమ్మకాలు’ అనే మాటను ఏ అర్థంలో ప్రయోగిస్తారో సందర్భాన్నిబట్టి ఆమె పాఠకులకు తేలిగ్గానే అర్థమవుతుంది. ‘కృష్ణవేణి’ context లో అయితే.. తర్కరహితంగా కథావస్తువును చిత్రీకరించటం అని ఆమె ఉద్దేశమని అనుకుంటున్నాను.

>>..‘తొందరగా చదివేస్తే అయిపోతుందే అని దిగులు..’>> నెమ్మదిగా చదవండయితే! :)

అజ్ఞాత చెప్పారు...

JUVB గారు, ఎవరో కాదు అన్నది నేనే, కానీ అవి ఈ టపాకి వర్తించవు అని గమనించగలరు.

ఇక మీరు చెప్పినదానికొస్తే, ఆ లెఖ్ఖన రంగనాయకమ్మగారు తన రచనల్లో చక్కటి మూఢనమ్మకాలని రంగరించి రాస్తున్నరు మరి...

Praveen Mandangi చెప్పారు...

వేణు గారు. నిజం చెపితే ఒకరికి విజ్ఞానదాయకంగా ఉంటుంది, ఇంకొకరికి గొంతులో దిగని వెలగపండులా ఉంటుంది. చివరి సారిగా ఒక మాట చెపుతున్నాను. వంటలు, వార్పులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్లకి స్త్రీవాదం అర్థం కాదు. చిన్నప్పుడు అనుకున్నాను "పెళ్లి చేసుకుంటే పైలట్ ఉద్యోగం చేసే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి" అని. ఆడవాళ్లు ఎక్కువగా టీచర్ లాంటి చిన్న ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు పైలట్ ఉద్యోగం చేసే అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు?

అజ్ఞాత చెప్పారు...

Airlines.

ఈనాడు పెళ్ళి పందిరి..

వేణు చెప్పారు...

తార గారూ!
>>.. ఆ లెఖ్ఖన రంగనాయకమ్మగారు తన రచనల్లో చక్కటి మూఢనమ్మకాలని రంగరించి రాస్తున్నారు మరి...>>
మీరు నాన్ సీరియస్ గా రాశారని తెలుస్తూనే ఉంది కానీ, పూర్తిగా అర్థం కాలేదు. ఇలా అర్థోక్తిలా రాస్తే అపార్థాలకు తావిచ్చినట్టవుతుంది. అందుకే తప్పకుండా దీన్ని మీరు వివరించాల్సిందే!

వేణు చెప్పారు...

ప్రవీణ్ శర్మ గారూ!
పైలట్ ఉద్యోగం చేసే అమ్మాయిలు దొరక్కేం... వెతకాలి గానీ! ఇంతకీ... పెళ్ళి చేసుకోడానికి మీరివ్వదలిచిన ప్రాధాన్యం అమ్మాయిలు చేసే ‘ఉద్యోగానికే’నన్నమాట :)

Praveen Mandangi చెప్పారు...

It's not just preference of job. నాకు తెలిసిన ఒక వ్యక్తి తనకి కాబోయే భార్య తన కంటే హై ప్రొఫైల్ ఉద్యోగంలో ఉందని సంబంధం రద్దు చెయ్యించుకున్నాడు. భార్య తన కంటే తక్కువ స్థాయి ఉద్యోగం చెయ్యాలనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్రీనివాస్ చెప్పారు...

వంటలు, వార్పులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్లకి స్త్రీవాదం అర్థం కాదు
_________________________________________

ఇదేంటి శరత్ గొంతులాగా ఉంది

మంచు చెప్పారు...

ప్రవీణ్ కొసం
"పైలెట్ గా పనిచేస్తూ, సిగరెట్ మందు అలవాటులేని , 21-31 మద్య వయస్సుగల హిందూ వితంతువు" ని చూడాలా ఇప్పుడు.. సానా కస్టమే...

అజ్ఞాత చెప్పారు...

>>మీరు నాన్ సీరియస్ గా రాశారని తెలుస్తూనే ఉంది కానీ

లేదు చాలా సీరియస్ గానే రాశాను, వారి రచనలు మీద నేను ఇప్పుడు చర్చ చేపట్టను, వారి పుస్తకం ఒక్కటీ చదివిన పాపాన పోలేదు, పొయే ధైర్యం కుడా చెయ్యలేను (దీనికి వేరే కారణం ఉన్నది)..
కానీ ఒకటి మాత్రం చెప్పగలను, రచయితలు తమ ఊహా శక్తితో దేశ ఆర్ధక విధానాలని నిర్దేశింపజాలరు.

ఇద్దరు కమ్యూనిస్టలు చైనా గొప్పా, రష్యా గొప్పా అని వాదించుకోని తన్నుకున్నారు అని తెలిసాక నవ్వకోలేక చచ్చిపోయాను, ఒక మోడల్ కట్టి తేల్చుకోవచ్చుగా, ఊహూ, అలాంటివి వుంటాయి అని తెలిస్తే కద.

రంగనాయకమ్మ గారు కుడా, సామాజిక అంశాలు తమ పరిధిలో ఉన్నవి తమ అభిప్రాయం చెప్పి నాకు ఇది తప్పు అనిపించింది, లేదా ఇది తప్పు అంటే అర్ధం ఉన్నది, కానీ ఆర్ధిక అంశాలపై వ్యాఖ్యానించే అంతటి జ్ఞానం వారికి లేదు.( ఏది తప్పో, ఏది ఒప్పో)

ఒట్టి తన తర్కంతో వాదన చేసి, అదే గొప్ప సైన్సు అనుకోవటం, అదే రాయటం అతి పెద్ద మూడ నమ్మకం.
(వారి రచనలు చదవకపోయినా, వారి రచనలపై చర్చలు, కొన్ని రచన పరిచయాలు చదివి, కాస్త స్వానుభవంతో చెప్పుతున్న మాటలు).

అజ్ఞాత చెప్పారు...

నేను ఎదో రాసాను, అది పట్టుకొని, JUVB ప్రసాదు గారు లాంటి రంగనాయకమ్మ గారి ఫ్యాన్స్ నన్ను చర్చకి ఆహ్వానించరాదని మనవి.

నేను చర్చించాలి అంటే, కొన్ని లెఖ్ఖలు ఇస్తాను అవి చేయగలిగితేనే, నేను ముందే సెప్తున్నా, తర్కంతో చర్చ నా వల్ల కాదప్ప..నేను వాటికి జవాబులు కుడా ఇయ్య..

Unknown చెప్పారు...

మంచు గారు
దీన్ని ఖండిస్తున్నాం
గ్రహణం నాడు వెజ్ బిర్యానీ మాత్రమే తినే వితంతువు అని రాయాలి కదా

అజ్ఞాత చెప్పారు...

మంచు గారు, మాంసం తినని మర్చిపొతే ఎలా చెప్పండి.

సుజాత వేల్పూరి చెప్పారు...

ప్చ్, లాభం లేదు, మీరంతా ఇంకో ప్రాథమిక అర్హత మర్చిపోయారు. సరే, ఆయనే వచ్చి ఇంకో సంబంధం లేని కామెంట్ తో కలిపి చెప్తాడులే, చూద్దాం!

Unknown చెప్పారు...

ప్రాథమిక అర్హత?ప్రాథమిక అర్హత??
వదిన అవ్వాలా ?

Unknown చెప్పారు...

50 comments!!

Praveen Mandangi చెప్పారు...

టాపిక్ తో సంబంధం లేని కామెంట్ వ్రాసిది సుజాత గారా, నేనా? మీ కామెంట్ మీరే చదువుకోండి సుజాత గారు.
@ ఒంగోలు శ్రీను. వంటలు, వార్పులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్లకి స్త్రీవాదం అర్థం కాదు. నిజమే. కానీ నన్ను శరత్ 'కాలం'తో పోల్చకు. అతనికి, నాకు పోలికే లేదు.

Praveen Mandangi చెప్పారు...

వేణు గారు. మీరు కూడా మలక్పేట్ రౌడి ప్రమాదవనం బ్లాగ్ లాగ టాపిక్ తో సంబంధం లేని కామెంట్లు పబ్లిష్ చేస్తున్నారు. వీళ్ల కామెంట్లు చదివితే మీది కూడా కెలుకుడు బ్లాగ్ అనుకోగలరు.

వేణు చెప్పారు...

తార గారూ,
చాలా సీరియస్ గానే రాశారా? సరే. కానీ- రంగనాయకమ్మ గారి ‘ పుస్తకం ఒక్కటీ చదివిన పాపాన పోలేదు’ అని చెపుతున్న మీతో సీరియస్ గా అటుంచి, మామూలుగానైనా ఏం మాట్లాడతాం? కానీ, మీరు సీరియస్ సూత్రీకరణలూ, నిర్థారణలూ చేశారు కాబట్టి... మీ వ్యాఖ్యకు స్పందించాల్సిందే.

మీరు రాసిన వాక్యం- ‘రచయితలు తమ ఊహా శక్తితో దేశ ఆర్థిక విధానాలని నిర్దేశింపజాలరు’ అనేది... చాలా అస్పష్టంగా ఉంది. దేశ ఆర్థిక విధానాలను నిర్దేశిస్తున్నామని ఏ రచయితలు అన్నారని/భావిస్తున్నారని మీరనుకుంటున్నారు?

రంగనాయకమ్మ గారికి ‘ఆర్ధిక అంశాలపై వ్యాఖ్యానించే అంతటి జ్ఞానం లేదు.( ఏది తప్పో, ఏది ఒప్పో)’ అన్నారు. అంతటి జ్ఞానం ఆమెకు ఉన్నదో లేదో నిర్థారించేసిన మీరేమో.. అసలు ఆమె పుస్తకాలే చదవలేదు!

>> ఒట్టి తన తర్కంతో వాదన చేసి, అదే గొప్ప సైన్సు అనుకోవటం, అదే రాయటం అతి పెద్ద మూడ నమ్మకం>>

తర్కంతో చేసిన వాదనను ‘గొప్ప సైన్సు’ అని ఎవరనుకున్నారు? రంగనాయకమ్మ గారు అనుకున్నారని మీరనుకుంటే సరిపోతుందా? కేవలం ఆమె రచనలపై చర్చలూ, రచనా పరిచయాలూ మాత్రం చదివి, ‘ఆమె ఫలానా అనుకున్నారనీ, అదే రాశారనీ’ నిర్థారణకు వచ్చెయ్యటం... మూఢ నమ్మకం కాదూ?

అజ్ఞాత చెప్పారు...

వేణు గారు, మీ ప్రశ్నలు బాగున్నాయి, సమాధానాలు నా వ్యక్తిగత వివరాలతో ముడిపడి ఉన్నాయి.. అవి ఇక్కడ చెప్పటం/చర్చించటం కొంచం ఇబ్బంది..

>>దేశ ఆర్థిక విధానాలను నిర్దేశిస్తున్నామని ఏ రచయితలు అన్నారని/భావిస్తున్నారని మీరనుకుంటున్నారు?

నిర్దేశించే శక్తి ఉంటే మనం ఇలా ఉండేవాళ్ళమా?

>>అంతటి జ్ఞానం ఆమెకు ఉన్నదో లేదో నిర్థారించేసిన మీరేమో.. అసలు ఆమె పుస్తకాలే చదవలేదు!

హాహాహా..
ఇది చాలా పెద్ద ప్రశ్న...
ఇప్పుడు నేను రంగనాయకమ్మగారి రచనలపై ఒక సమీక్ష రాసాను అనుకోండి, నా డొల్లతనాన్ని అది చక్కగా చూపిస్తుంది కదా, అలానే, వారి స్టేట్మెంట్లు కుడా (ఆర్దిక శాస్త్ర) జ్ఞనాన్ని ప్రతిఫలిస్తుంది..
కాని నా మాటలకి అర్ధం కాస్త నిఘూడ మైనది, మన తర్కమే మనల్ని ఎలా తప్పుదారి పట్టిస్తుందో చెప్పటం, అనుభవంలో తెలియాల్సిందే, ఇది చాలా పెద్ద విషయం, మీకు ఆసక్తి వుంటే నాకు మైల్ చెయ్యగలరు. (taara.blog@gmail.com).

నా కామెంట్ కొంచం కటినంగా ఉండొచ్చు, అది కాస్త మిగతా కమ్యూనిస్టులని కుడా దృష్టిలో పెట్టుకొని రాసింది.

శరత్ కాలమ్ చెప్పారు...

నాకు తెలిసిన పైలట్ అమ్మాయి పైన చెప్పిన అన్ని అర్హతలతో వుంది కానీ ఇంకో ముఖ్యమయిన అర్హత కూడా వుంది. అదేంటో ఊహించండి చూద్దాం. అయినా ఎన్ని అర్హతలుంటే పెళ్ళికి అంత మంచిది కదా.

Malakpet Rowdy చెప్పారు...

అంతటి జ్ఞానం ఆమెకు ఉన్నదో లేదో నిర్థారించేసిన మీరేమో.. అసలు ఆమె పుస్తకాలే చదవలేదు!
_____________________________________


వేణూ గారూ,

అసలు రామాయణం చదవకుండా అనువాదం చదివి రాముడి ఖేరెక్టర్ డిసైడ్ చెసెయ్యడం లాంటిడే ఇదీనూ. You cant apply to separate yardsticks to Ranganayakamma and Tara

వేణు చెప్పారు...

మలక్ గారూ!

అనువాదాల మూలంగా పాత్రల స్వభావాలే మారిపోతాయా? రామాయణం విషయంలో- మూల విధేయంగా భక్తిశ్రద్ధలతో పండితులు చేసిన అనువాదాలను (ఒకటి కాదు, మూడు ) ఆధారం చేసుకుని సాగించిన విమర్శ రంగనాయకమ్మ గారిది. రామాయణంపై జరిగిన చర్చలూ, వచ్చిన రచనా పరిచయాలను మాత్రమే చదివి, ఆమె విమర్శకు దిగలేదు.

మరి తార గారి సంగతి? తెలుగులోనే దొరుకుతున్న రంగనాయకమ్మ గారి పుస్తకాలను చదవకుండా; ఆమె రచనలపై ‘చర్చలూ, రచనా పరిచయాలూ మాత్రమే’ చదివానంటున్నారు.

ఈ విషయంలో ఇద్దరికీ ఇంత తేడా స్పష్టంగా కనిపిస్తోంది!

మీరే చెప్పండి... ఒక రచయిత పుస్తకాలు (అనువాదాలో, మూల రచనలో ) చదవకుండా ఆ రచయిత భావాలను విమర్శించటం సరైన పనేనా?

Unknown చెప్పారు...

రామాయణం అనువాదం లో చదివితే రాముడి వ్యక్తిత్వం అర్ధం కాదా? అలా ఐతే అందరు వాల్మీకీ రామాయణమే చదవాలేమో...ఇంతకీ రాముడికి తార కి వున్న సారూప్యమేమి? ఇక్కడ వేణుగారు తార గారి గురించి పూర్తిగా తెలియకుండా వ్యాఖ్య చేశారనా..? హేవిటో అన్నీ ప్రశ్నలే..:-(

Malakpet Rowdy చెప్పారు...

మూల విధేయంగా భక్తిశ్రద్ధలతో పండితులు చేసిన అనువాదాలను
__________________________________

అలాగే మూలవిధేయంగా రంగనాయకమ్మ పుస్తకాలపై చేసిన పరిచయాన్ని?

అసలు రామాయణం చదవకుండా రాముడి కేరెక్టర్ ని డిసైడ్ చెయ్యచ్చుగానీ, ఆవిడ స్టేట్మెంట్లని, పుస్తక పరిచయాలని చదివి ఆవిడ సామర్ధ్యాన్ని నిర్ణయించకూడదా?


___________________________________


రామాయణం అనువాదం లో చదివితే రాముడి వ్యక్తిత్వం అర్ధం కాదా?

___________________________________

By the same logic, రంగనాయకమ్మ పరిచయాన్ని చదివితే ఆవిడ అర్హతలు కూడా అర్ధం కావా?


అలా ఐతే అందరు వాల్మీకీ రామాయణమే చదవాలేమో
___________________________________

రంగనాయకమ్మ ని చెయ్యాలంటే అస్విడ పుస్తకాలన్నీ చదవాలన్నట్టుగానే ఇది కూడా


ఇంతకీ రాముడికి తార కి వున్న సారూప్యమేమి?
_________________________________

నేనన్నది రంగనాయకమ్మకీ తారకీ ...

రామాయణం చదవకుండా రంగనాయకమ్మ వ్యాఖ్యానించినడం సబబైతే, రంగనాయకమ్మ రచనలు చదవకుండా తార వ్యాఖ్యానించడం కూడా సబబే! అదీ ఇక్కడ సారూప్యం!!

Malakpet Rowdy చెప్పారు...

‘చర్చలూ, రచనా పరిచయాలూ మాత్రమే’ చదివానంటున్నారు.
_____________________________________

అంటే అనువాదాలు మార్చలేనిదానిని చర్చలు మారుస్తాయంటారా?

Malakpet Rowdy చెప్పారు...

Lets have one standard here for everyone - either refer to the original book or refer to all the supplements.

తార ఇంకా తన విమర్శ పూర్తిగా మొదలుపెట్టకుండానే "నీకు విమర్శించే అర్హత లేదు" అని నిర్ణయించడంతో వచ్చింది ఈ చిక్కంతా.

Praveen Mandangi చెప్పారు...

చర్చలలో మాట్లాడేవాళ్లు నిరాధార విమర్శలు చెయ్యగలరు. ఉదాహరణకి ద్రౌపది నవలలో అశ్లీలం ఉందని విమర్శించారు. నిజానికి అందులో అశ్లీలం లేదు. కేవలం అశ్లీలం కావాలనుకునేవాడు తెలియక ఆ పుస్తకం చదివితే కొన్ని పేజిలు చదివిన తరువాత అతనికి నిరాశ కలుగుతుంది. విషవృక్షం పుస్తకంపై విమర్శలు చేసేవాళ్లు కూడా అలాంటి విమర్శలు చెయ్యగలరు. రామాయణం యొక్క చారిత్రక పరిణామం గురించి ఆ పుస్తకంలో వ్రాసి ఉందని విమర్శకులు చెప్పరు. .

Malakpet Rowdy చెప్పారు...

అనువాదాలు వ్రాసేవాళ్ళు కూడా తమ స్వంత మసాలా కలిపి వ్రాయగలరు.

Malakpet Rowdy చెప్పారు...

ఒక్క వాలి విషయంలోనే రెండు అనువాదాలు రెండు రకాలుగా వ్రాయబడ్డాయి. ఇక రామాయణం మొత్తం తీసుకుంటే?

అజ్ఞాత చెప్పారు...

>> తెలుగులోనే దొరుకుతున్న రంగనాయకమ్మ గారి పుస్తకాలను చదవకుండా.

సరిపోయింది.. ఐతే మీకు రంగనాయకమ్మగారిమీద చాలా అభిమానమునట్టున్నది..

ఇక్కడ ఒక విషయం గమనించాలి, సైన్సు వేరు, సాహిత్యం వేరు, నేను వారి ఆర్ధిక శాస్త్ర జ్ఞనాన్ని తిరస్కరించాను, అసలు రియల్ ఎనాలసిస్ రాని వాళ్ళు ఏ లెఖ్ఖ ప్రకారం ఇది తప్పు ఇది ఒప్పు అని ఎకనామిక్స్ పాలసీస్ మీద చెప్పగలరు? ఇక్కడా చాలా తప్పులు జరుగుతాయి ఒట్టి ఆలోచనలని పట్టుకోని పరిగెత్తితే..

>>చదవకుండా ఆ రచయిత భావాలను విమర్శించటం సరైన పనేనా?

వేణు గారు, నేను రంగనాయకమ్మ గారి భావాలను ఎక్కడ విమర్శించాను? నేను తప్పుబట్టింది వారి ఆర్ధిక శాస్త్ర జ్ఞనాన్ని. దానికి వారి రచనలని క్షుణ్ణంగా చదవక్కర్లేదు.

@మలక్ గారు,
నా భావాన్ని బాగా అర్దం చేసుకున్నారు..

డ్రెంచకుడు చెప్పారు...

>>>కేవలం అశ్లీలం కావాలనుకునేవాడు తెలియక ఆ పుస్తకం చదివితే కొన్ని పేజిలు చదివిన తరువాత అతనికి నిరాశ కలుగుతుంది.

అంటే నీకలా నిరాశ కలిగిందా ప్రవీణూ?

Malakpet Rowdy చెప్పారు...

I may be totally wrong but this is what I heard from a friend

నా స్నేహితుడొకడు వేశ్యావృత్తిపై రీసెర్చ్ చేసి సైంటిఫిక్గా ఎనలైస్ చేసి దానిని నిషేధించడం కన్నా చట్టబధ్ధం చెయ్యడం వలనే వేశ్యల జీవితాలని బాగు చెయ్యాటం సులభం అనే కంక్లూషన్ తో ఆవిడ అభిప్రాయానికోసం పంపిస్తే ఆవిడ సమాధానం (అసలు రీసెర్చి గురించి ఒక్కమాట కూడా మాట్లాడకుండా) "ఇదే నీ అక్కో చెల్లో అయితే ఇదే చెప్తావా?"

Ever since then the guy explodes beyond imagination whenever anyone brings her name up :))

వేణు చెప్పారు...

ప్రవీణ్ శర్మ గారూ!
టాపిక్ తో సంబంధం లేని కామెంట్లు పబ్లిష్ చేయటం గురించి. ఈ టపాతో నేరుగా సంబంధం లేని స్త్రీవాదం గురించీ, పెళ్ళి ఎంపిక గురించీ ప్రస్తావన మొదలుపెట్టింది మీరే కదండీ?

వేణు చెప్పారు...

తార గారూ!
‘మిగతా కమ్యూనిస్టులను కూడా దృష్టిలో పెట్టుకుని రాసిందయితే’ ఆ విషయం స్పష్టంగానే చెప్పొచ్చు కదా! దానిలో రంగనాయకమ్మ గారి పేరు ప్రస్తావించటం ఎంతవరకూ సబబు?

మీ మరో వ్యాఖ్య..
>> నేను వారి ఆర్ధిక శాస్త్ర జ్ఞానాన్ని తిరస్కరించాను>>

తిరస్కరించటమో, అంగీకరించటమో అది మీ ఇష్టం. అయితే ‘ఆమె ఆర్ధిక శాస్త్ర జ్ఞానం ఇదీ’ అని మీకు తెలియాలంటే ఆమె పుస్తకాలు
(సాహిత్యేతర పుస్తకాలే) చదవాలి కదా.. అది చేయకుండానే ఆమె ఆర్ధిక శాస్త్ర జ్ఞానాన్ని తిరస్కరించేశారన్నమాట!

>> నేను రంగనాయకమ్మ గారి భావాలను ఎక్కడ విమర్శించాను?>>

మలక్ గారిని నేనడిగిన ‘జనరల్’ ప్రశ్నఅది. మిమ్మల్ని స్పెసిఫిక్ గా ఈ ప్రశ్న నేనడగలేదు.

>> నేను తప్పుబట్టింది వారి ఆర్ధిక శాస్త్ర జ్ఞనాన్ని. దానికి వారి రచనలని క్షుణ్ణంగా చదవక్కర్లేదు >>

అదే నా ప్రశ్న. వారి ఆర్ధిక శాస్త్ర జ్ఞానం ఆమె పుస్తకాలు చదవకుండా మీకెలా తెలిసింది? తెలిశాకే కదా, తప్పుపట్టటమైనా, ఒప్పుపట్టటమైనా! ఆమె పుస్తకాలు చదవకుండానే ఆమె ఆర్ధిక శాస్త్ర జ్ఞానం మీకు తెలిసిందంటే.. అది సెకండరీ సోర్సుల ద్వారానే. అలాంటపుడు మీ విమర్శకు విలువ ఉంటుందా?

అజ్ఞాత చెప్పారు...

ద్రౌపదిలో, క్రిష్ణుడికి, చెల్లి అయ్యె ద్రౌపదికీ సంభందం దాదాపు అంటగట్టాడు రచయిత, (ప్రేమ వ్యవహారం గట్రా ఉన్నది). అది అశ్లీలం కాదుగా అన్నావా, సరి పోయింది, నీకో కధా వస్తువు దొరికింది విజృంభించి, వదిన వాదం పక్కన పెట్టి ఇది రాస్తావా??

మంచు చెప్పారు...

ఎవరి సంగతి ఎమిటొ గాని... రంగనాయకమ్మ/చలం గురించి మన ప్రవీణ్ ఇచ్చిన పరిచయాలు, వాళ్ళ రచనలకు మనొడు రాసిన సమీక్షలు చూసాకా ..వీళ్ళిద్దరి మీద ""ఒక రకమయిన"" ఇంప్రెస్షన్ కలిగింది.

Malakpet Rowdy చెప్పారు...

అయితే ‘ఆమె ఆర్ధిక శాస్త్ర జ్ఞానం ఇదీ’ అని మీకు తెలియాలంటే ఆమె పుస్తకాలు
(సాహిత్యేతర పుస్తకాలే) చదవాలి కదా
_____________________________________

I am surprised you have posed this question. మా ఫ్రెండులా ఆవిడకి ఓ రెండు ఉత్తరాలు రాస్తేనో లేక ఆవిడతో ఒక గంట మాట్లాడితేనో చాలదా? What if Tara knows her in person?

Malakpet Rowdy చెప్పారు...

ఆమె పుస్తకాలు చదవకుండానే ఆమె ఆర్ధిక శాస్త్ర జ్ఞానం మీకు తెలిసిందంటే.. అది సెకండరీ సోర్సుల ద్వారానే. అలాంటపుడు మీ విమర్శకు విలువ ఉంటుందా?
_____________________________________

ఆవిడ రచనలు చదవకుండా ఆవిడని డైరెక్టుగా కలిసి మాట్లాడి ఉంటే అది ప్రైమరీ సోర్సే అవుతుంది కదా?

వేణు చెప్పారు...

మలక్ గారూ!

>> మూలవిధేయంగా రంగనాయకమ్మ పుస్తకాలపై చేసిన పరిచయాన్ని? >>

ఎవరు, ఎప్పుడు చేశారా పరిచయం? పుస్తక రూపంలోనేనా? అయితే అది ఎక్కడ దొరుకుతుంది?

>> అసలు రామాయణం చదవకుండా రాముడి కేరెక్టర్ ని డిసైడ్ చెయ్యచ్చుగానీ >>

దీనికి ఇందాకటి వ్యాఖ్యలోనే సమాధానం రాశాను.

>> ఆవిడ స్టేట్మెంట్లని, పుస్తక పరిచయాలని చదివి ఆవిడ సామర్ధ్యాన్ని నిర్ణయించకూడదా?>>

‘ఆర్ధిక అంశాలపై వ్యాఖ్యానించే అంతటి జ్ఞానం వారికి లేదు’ అనేది తీవ్రమైన వ్యాఖ్య. ఇంతటి వ్యాఖ్య చేయటానికి ఆవిడ స్టేట్మెంట్లనీ, ఆమె రచనలపై చర్చలు, కొన్ని రచనా పరిచయాలు మాత్రమే ఆధారం చేసుకుంటానంటే.. (ఆమె రాసిన సాహిత్యేతర పుస్తకాలు అందుబాటులో ఉండికూడా) ఏం చెపుతాం?

తార గారి సోర్సుల్లో.. రంగనాయకమ్మ గారి స్టేట్మెంట్లు మాత్రమే ఆమెతో నేరుగా సంబంధమున్నవి. (అవి ఏమిటో, ఎక్కడ, ఎప్పుడు చేశారో చెప్పాల్సివుంటుంది) మిగిలినవి ‘ఇతరుల’కు సంబంధించినవి.

>> రామాయణం చదవకుండా రంగనాయకమ్మ వ్యాఖ్యానించినడం సబబైతే, రంగనాయకమ్మ రచనలు చదవకుండా తార వ్యాఖ్యానించడం కూడా సబబే! అదీ ఇక్కడ సారూప్యం!!>>

రామాయణం చదవకుండా రంగనాయకమ్మ గారు వ్యాఖ్యానించిందెక్కడ? ఆమె వాల్మీకి రామాయణం అనువాదం మొత్తం చదివి, అవసరమైన చోట మూలంలోని కాండ, సర్గ, శ్లోకం నంబర్లను ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు. కాబట్టి ఆమెకూ, తారకూ సారూప్యం ఇక్కడ అస్సలు లేదు!

Malakpet Rowdy చెప్పారు...

ఎవరు, ఎప్పుడు చేశారా పరిచయం? పుస్తక రూపంలోనేనా? అయితే అది ఎక్కడ దొరుకుతుంది?
_____________________________________

Okay, for the sake of the discussion, read Praveen's opinion on Ranganayakamma on his blogs. Thats in electronic format.

దీనికి ఇందాకటి వ్యాఖ్యలోనే సమాధానం రాశాను.
_________________________________

And I am repeating it, because you are applying two different yardsticks again

ఆమె వాల్మీకి రామాయణం అనువాదం మొత్తం చదివి,
___________________________________

అలాగే తారకూడ ఆవిడకి సంధించిన వాటినే చదివానని చెప్తున్నాడుగా.

వేణు చెప్పారు...

మలక్ గారూ!

>> అంటే అనువాదాలు మార్చలేనిదానిని చర్చలు మారుస్తాయంటారా? >>

అనువాదాలు వేరూ, చర్చలు వేరూ. రెంటికీ తేడా ఏమిటో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదనుకుంటాను.

Malakpet Rowdy చెప్పారు...

అవసరమైన చోట మూలంలోని కాండ, సర్గ, శ్లోకం నంబర్లను ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు
_____________________________________

కేవలం నెంబర్లే మూలంలోవి - భావాలన్నీ అనువాదాలలోనివే కదా. అలాంటప్పుడు ఆవిడ ప్రతిపాదించిన రాముడి కేరేక్టర్ అనువాద రాముడిది :))

అజ్ఞాత చెప్పారు...

>>దానిలో రంగనాయకమ్మ గారి పేరు ప్రస్తావించటం ఎంతవరకూ సబబు?

ఇద్దరినీ విడదీయటం సాధ్యమా? (నా లెఖ్ఖవేరు).

>>అది సెకండరీ సోర్సుల ద్వారానే. అలాంటపుడు మీ విమర్శకు విలువ ఉంటుందా?

పుస్తకాలు చదవాల్సిందెనా? వారితో పరిచయం ఉంటే అవదా? నేను మీకు మొదటి కామెంట్ లొనే చెప్పాను, స్వానుభవం కొంత అని.

తరువాత, అసలు ఆవిడ పుస్తకాలు చదవకుండా ఎలా తెలిసింది అంటారా..
ఇది మీరు న్యూట్రల్ గా అడిగారా? లేక వారి అభిమానిగానా? వారి అభిమానిగా, అసలు రంగనాయకమ్మ గారి రచనలు చదవకుండా ఎలా చెప్తున్నావ్ (అసలు అలా వీలవదు అనే భావనలో వుండి) అని బల్లగుద్ది మరీ అడిగితే నేను; తప్పైపోయింది బాబు అని అంటాను.
అలా కాకుండా, మీరు ఎలా చెప్తున్నారు అని తెలుసుకోవాడానికి అడిగితే, నేను ఎదైనా చెప్పగలను, నాకు మీరు కొంచం అభిమాని లానే అనిపిస్తున్నారు, మరి అది తప్పు ఐతే సావధానంగా చెప్పగలను.. కాకపొతే కొంచం సైన్సుకి, తర్కంకి వున్న చిన్నపాటి తేడాని మీరు తెలుసుకునే ప్రయత్నం చెస్తే ఇంకా బాగా అర్దం అవుతుంది..

అవును, రాఘవులు గారి శిష్యులు కాదు కదా మీరు?

Malakpet Rowdy చెప్పారు...

అనువాదాలు వేరూ, చర్చలు వేరూ. రెంటికీ తేడా ఏమిటో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదనుకుంటాను
_____________________________________

Nope - చెప్పండి మీరే తేడా ఏమిటో. అనువాదాలమీద కామెంటరీ రాసి దానికీ మూలానికి లింకుపెట్టడం గురించి కూడా!

WitReal చెప్పారు...

>> పెళ్లి చేసుకుంటే పైలట్ ఉద్యోగం చేసే
>> అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి

పెవీన్ అన్నా, లైఫులో plan-B ఉండాలన్నా!
బొమ్మ తరుగాడితే, దెబ్బైపోద్ది.

వేణు చెప్పారు...

మలక్ గారూ!

>> తార ఇంకా తన విమర్శ పూర్తిగా మొదలుపెట్టకుండానే "నీకు విమర్శించే అర్హత లేదు" అని నిర్ణయించడంతో వచ్చింది ఈ చిక్కంతా >>

‘వారి పుస్తకం ఒక్కటీ చదివిన పాపాన పోలేదు’ అంటూనే తీవ్ర వ్యాఖ్య చేస్తున్నపుడు అది అసమంజసం అంటూ ఎత్తిచూపటం తప్పెలా అవుతుంది? "నీకు విమర్శించే అర్హత లేదు" అనే వాక్యం మీదే. అలా నేనేమీ రాయలేదు. మీరన్నట్టు ‘నిర్ణయించనూ’ లేదు.

అజ్ఞాత చెప్పారు...

మంచు గారు,

రంగనాయకమ్మగారి గురించి నేను ఏమీ చెప్పలెను కానీ, చలం గారిని అన్న కళ్ళతో చూడొద్దు, ఆయన రచనలు చాలా బాగుంటాయి, స్వచమైన రిలేషన్స్ ఉండాలి అన్న ఉద్దేశం తో రాస్తారు..

తప్పక చదవండి, మైదానంతో మొదలెట్టి, తరువాత మ్యూజింగ్స్ ఇలా..

Malakpet Rowdy చెప్పారు...

వారి పుస్తకం ఒక్కటీ చదివిన పాపాన పోలేదు’ అంటూనే తీవ్ర వ్యాఖ్య చేస్తున్నపుడు అది అసమంజసం అంటూ ఎత్తిచూపటం తప్పెలా అవుతుంది?
_____________________________________
ఎందుకంటే వారి పరిజ్ఞానాన్ని విమర్శించడానికి వారు వ్రాసిన పుస్తకాలు చదవక్కరలేదు కనుక.

Do we need to read Praveen Sarma's books on Vadina-Maridi to judge his sense of context while posting comments?

WitReal చెప్పారు...

@ Malak

>> Do we need to read
>> Praveen Sarma's books on
>> Vadina-Maridi to judge

అఫ్ కోర్స్, YES. ఒక్కసారి సదివితే, అ తరవాతనుంచి అన్న కామేంట్లన్ని కరివేపాకైపోద్ది.

On a serious note, he writes with lot of conviction. ఆ కన్విక్షన్ ఎంత స్ట్రాంగంటే, కత సదవతా వుంటే ముందే తెల్సిపొతా వుంటది - వల్లభ లాంటి హీరోలకేమవుద్దో

The only problem is that, his conviction is beyond conventional logic

Praveen Mandangi చెప్పారు...

నేను వ్రాసిన కథలైనా, ఇంకొకరు వ్రాసిన కథలైనా చదవకుండ విమర్శిస్తే ఫార్స్ లాగే ఉంటుంది. పెళ్లికి వయసు, ఎత్తు లాంటి పట్టింపులు అవసరం లేదు అని వ్రాస్తే అది బూతు అనుకునేవాళ్లకి కాంటెక్స్ట్ ఏమి అర్థమవుతుంది.

Praveen Mandangi చెప్పారు...

ఒక వ్యక్తి వ్రాసిన రచనలు చదవకుండానే ఆ వ్యక్తిని విమర్శించడం ఎప్పటి నుంచో ఉన్నదే. నాకు తెలిసి సల్మాన్ రష్దీ వ్రాసిన శటానిక్ వర్సెస్ నవల టైం నుంచి.

వేణు చెప్పారు...

మలక్ గారూ!

>> అనువాదాలు వ్రాసేవాళ్ళు కూడా తమ స్వంత మసాలా కలిపి వ్రాయగలరు >>

అవును, రాయగలరు. కానీ, రామాయణ విషవృక్షానికి ఆధారమైన తెలుగు అనువాదాల్లో అలాంటి సొంత మసాలాలు కలిశాయనుకుంటున్నారా?

>> ఒక్క వాలి విషయంలోనే రెండు అనువాదాలు రెండు రకాలుగా వ్రాయబడ్డాయి. ఇక రామాయణం మొత్తం తీసుకుంటే?>>

రామాయణం ప్రాచీన కావ్యం కాబట్టి.. సంస్కృత మూలం ఒకటి కాకుండా రకరకాలు ఉన్నాయి. ఇదో ప్రత్యేక పరిస్థితి. ఇక్కడ సమస్య ‘మూలం’లోనే భిన్న వర్షన్లు ఉండటం. అనువాదాలు కూడా తాము ఆధారం చేసుకున్న మూలంలోని వర్షన్లనే ప్రతిబింబిస్తాయి కదా!

>> చెప్పండి మీరే తేడా ఏమిటో. అనువాదాల మీద కామెంటరీ రాసి దానికీ మూలానికి లింకు పెట్టడం గురించి కూడా!>>

అనువాదాలు వేరూ, చర్చలు వేరూ అన్నదానికి మీ వ్యాఖ్య ఇది. పేరు చెప్పకున్నా ఇది ‘రామాయణ విషవృక్షం’మీద మీ విసురని తెలుస్తూనే ఉంది. అది మీ అభిప్రాయం కాబట్టి నేను చెప్పేదేమీ లేదు. కానీ ‘రామాయణం చదవకుండా రంగనాయకమ్మ వ్యాఖ్యానించార’నే అభిప్రాయం ఖండిస్తాను.
ఆమె వ్యాఖ్యానం మీకు నచ్చకపోతే అది వేరే సంగతి. కానీ ఆమె అసలు రామాయణమే చదవలేదనటం సరి కాదు.

Malakpet Rowdy చెప్పారు...

రామాయణ విషవృక్షానికి ఆధారమైన తెలుగు అనువాదాల్లో అలాంటి సొంత మసాలాలు కలిశాయనుకుంటున్నారా?
_____________________________________

ఉండచ్చనే అనుకుంటున్నాను. లేవు అని మీరు కన్ ఫర్మ్ చేస్తే అది వేరే సంగతి.

అన్నట్టు Are you sure there are multiple versions of Valmiki Ramayan? This gets interesting now. Which version's translation did Ranganayakamma read and how did she decide it was authentic? Its just a curious question

వేణు చెప్పారు...

>> మా ఫ్రెండులా ఆవిడకి ఓ రెండు ఉత్తరాలు రాస్తేనో లేక ఆవిడతో ఒక గంట మాట్లాడితేనో చాలదా? >>

చాలదు! చాలుతుందని మీరు అనుకుంటే అనుకోండి!

ఒకరి ఆర్ధిక శాస్త్ర జ్ఞానం గురించి ఓ అవగాహనకు రావటం వేరు. దాన్ని నలుగురికీ ప్రకటించి, విమర్శించాలనుకున్పపుడు మాత్రం ఈ సోర్సులు ఏ మాత్రం చాలవు. ఆ వ్యక్తి రాసిన సంబంధిత పుస్తకాలు చదవాల్సిందే. అది కనీస బాధ్యత!

>> ఆవిడ రచనలు చదవకుండా ఆవిడని డైరెక్టుగా కలిసి మాట్లాడి ఉంటే అది ప్రైమరీ సోర్సే అవుతుంది కదా? >>

ఇది మరీ బావుందండీ. ఇక విమర్శకులంతా రచయిత ఏం రాశారో అది చదవటం మానేసి, డైరెక్టు భేటీలు వేసి ‘ప్రైమరీ సోర్సు’ ఉంది కదా అని విమర్శలను మొదలుపెట్టెయ్యొచ్చంటారా?

>> ఎందుకంటే వారి పరిజ్ఞానాన్ని విమర్శించడానికి వారు వ్రాసిన పుస్తకాలు చదవక్కరలేదు కనుక >>

ఒకరు రాసిన పుస్తకాలు చదవకుండానే వారి ‘పరిజ్ఞానాన్ని’ విమర్శించాలనే తొందర ఎవరికైనా ఎందుకుండాలి? రెండు ఉత్తరాలూ, ఓ గంట మాట్లాడటం తోనే ‘ఇక చాల్లే’ అనుకుని, చేసే విమర్శలకు ఎంత విలువుండాలో అంతే విలువ ఉంటుంది!

వేణు చెప్పారు...

తార గారూ!
>> పుస్తకాలు చదవాల్సిందేనా? వారితో పరిచయం ఉంటే అవదా? >>

ఇప్పుడు మలక్ గారికి రాసిన సమాధానమే దీనికీ వర్తిస్తుంది. అసలు ఏ రచయిత పైన అయినా విమర్శకు దిగేముందు వారు రాసిన ‘పుస్తకాలు చదవాల్సిందేనా’ అనే ప్రశ్న ఎలా వస్తోందసలు? ఇంత ప్రాథమికమైన విషయమ్మీద చర్చ అవసరమా?

>> అసలు ఆవిడ పుస్తకాలు చదవకుండా ఎలా తెలిసింది అంటారా.. ఇది మీరు న్యూట్రల్ గా అడిగారా? లేక వారి అభిమానిగానా? >>

అభిమాని అడిగితే ఒక రకంగారూ, అభిమాని కాని వారు అడిగితే ఒక రకంగానూ సమాధానం ఉంటుందా? ఇది ఎవరైనా అడగగల ప్రశ్నే కదా!

>> రాఘవులు గారి శిష్యులు కాదు కదా మీరు?>>

రాఘవులు గారంటే సీపీఎం రాఘవులు గారేనా? ఇప్పటికే ‘కృష్ణవేణి’ నవల్లోంచి రామాయణంలోకి పోయింది చర్చ. ఇప్పుడు మళ్ళీ పార్టీల ట్విస్ట్ ఎందుకులెండి.:)

వేణు చెప్పారు...

మలక్ గారూ!
సంస్కృతంలో వాల్మీకి రాసిన రామాయణానికి మనదేశంలో మూడు- నాలుగు రకాల వర్షన్లున్నాయంటారు. మొత్తం 7 కాండల్లో 24 వేల శ్లోకాలుంటే అన్నిటిలోనూ కామన్ గా ఉన్నవి వెయ్యి శ్లోకాలేనట. మొదటి, చివరి కాండలైన బాల, ఉత్తర కాండలు ప్రక్షిప్తాలనేవారున్నారు.

‘ఫలానా రామాయణం’ ప్రామాణికమని ఏ పండితులూ, పరిశోధకులూ కచ్చితంగా ‘నిర్ణయించలేదు’. ఇన్ని వేల ఏళ్ళ తర్వాత అలా చేయటం సాధ్యం కాదు కూడా. ఇలాంటప్పుడు రామాయణ కావ్యాన్ని పరిశీలించదలిచినవారు ఏం చేయాలి? ప్రామాణిక పుస్తకాల ప్రచురణకు పేరు పొందినవారు పండితుల చేత అనువదింపజేసిన పుస్తకాలనే ఆధారం చేసుకోవాలి. రంగనాయకమ్మ గారు తాను ఏయే పుస్తకాలను ఆధారం చేసుకున్నారో ‘విషవృక్షం’లో వివరంగానే రాశారు.

అజ్ఞాత చెప్పారు...

>>అసలు ఏ రచయిత పైన అయినా విమర్శకు దిగేముందు వారు రాసిన ‘పుస్తకాలు చదవాల్సిందేనా’

ఇప్పుడు ప్రవీణ్ శర్మ ఒక భిభత్స భౌతిక శస్త్ర పుస్తకం రాస్తే చదివి దాన్లో తప్పులు చూపించక్కర్లేదు, ఒక్క ఐదు నిముషాలు ఆయనతో మాట్లాడితే చక్కగా వారి పరిజ్ఞానం అర్ధం ఐపోతుంది.

>>అభిమాని అడిగితే ఒక రకంగారూ, అభిమాని కాని వారు అడిగితే ఒక రకంగానూ సమాధానం ఉంటుందా?

లేదు, అభిమానులు అసలు రంగనాయకమ్మ గారు తప్పు చేయ్యరూ అని ఒక స్థిరనమ్మకంతో ఉంటారు, పైథారగరస్ థీరం తెలియనివాడు థిరీ ఆఫ్ రెలెటివిటినీ తిట్టినట్టూ, ఇప్పుడు మీరూ దాదాపుగా అదే చేస్తున్నారు, మీకు తెలిసిన సాహిత్య కోణం నుంచి సైన్సు ని అర్ధం చేసుకునే ప్రయత్నమే, ఇలాంటి వారికి అమర్త్య సెన్ వచ్చినా కుడా సమాధానం చెప్పలేదు, కాబట్టి చర్చలో పాల్గొనము.

న్యూట్రల్‌గా తెలుసుకోగోర ప్రయత్నం ఐతే, వారికి వివరంగా నేర్పి, చెప్పే అవకాశం వున్నది, ఎంతకీ సూదితో భుమి కి రంధ్రం చేస్తాను అంటే నేను ఏమీ చెప్పలేను. మీ ఇష్టం నాయనా అని పక్కకి వెల్తాను.
ఇప్పుడు రంగనాయకమ్మగారు ఇలానే చేస్తున్నారు, దానికి మీరు, ఏ త్రవ్వేదాకా చూడకుండా ముందే అది అవ్వదు అని ఎలా అంటావు అని అడిగితే ఏమి చెప్పగలను, పోనీ శాస్త్రీయంగా చెప్ప ప్రయత్నంచేసినా, వినే ప్రయత్నం మీరు చెయ్యరు, ఎంతకీ త్రవ్వేదాకా చూడకుండా అన్నదే మీ ప్రశ్న.

రంగనాయకమ్మగారు గొప్ప ఆర్ధిక వేత్త అని నోబెల్ ప్రైజ్ కి రెకమెండ్ చేస్తూ నేను ఈ చర్చ నుంచి వైదొలుగుతున్నాను.
మీకు న్యూట్రల్ గా తెలుగుకోవాలి అనుకుంటే నాకు మైల్ చెయ్యండి.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Praveen Mandangi చెప్పారు...

ఇక్కడ రామాయణంపై విమర్శ అసలు విషయం కాదు. ఫ్రెంచ్ మావోయిస్ట్ ఆర్థికవేత్త చార్లెస్ బెతెల్హీమ్ రచనలని రంగనాయకమ్మ గారు తెలుగులోకి అనువదించడం రుచించనివాళ్లు అసలు విషయం పైకి చెప్పకుండా విషవృక్షం పుస్తకాన్ని సాకుగా చూపిస్తున్నారు. చార్లెస్ బెతెల్హీమ్ రచనలు నేను ఇంగ్లిష్ లో చదివాను.

Praveen Mandangi చెప్పారు...

తాము రామాయణ విషవృక్షం పుస్తకం చదవలేదని చెప్పుకున్నారు కదా. అసలు వ్యతిరేకత ఆ పుస్తకం పై కాదు అని దాని అర్థం. చార్లెస్ బెతెల్హీమ్, మావో జెడాంగ్ ల గురించి రంగనాయకమ్మ గారు వ్రాయడం నచ్చక, ఆ విషయం డైరెక్ట్ గా చెప్పకుండా ఏవో మాట్లాడుతున్నారు. తెలియని విషయాలు తెలిసినట్టు చెప్పుకోవడం మంచిది కాదు. అది విషవృక్షం పుస్తకం పై కావచ్చు, ఇంకే విషయమైనా కావచ్చు.

వేణు చెప్పారు...

తార గారూ!
ప్రవీణ్ శర్మ గారినో, మరొకరినో పోలిక తెచ్చి మాట్లాడటం ఇక్కడ సరి కాదు. ఒక రచయిత జ్ఞానం మీద విమర్శ చేయాలంటే ఆ రచయిత రాసిన పుస్తకాలు చదవక్కర్లేదూ, ఆ వ్యక్తితో ‘ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడితే చక్కగా వారి పరిజ్ఞానం అర్థమైపోతుంద’ని మీరంటుంటే... ఇంకా ఏం చెప్పను? నే చెప్పగలిగిందేదో ఇంతకుముందే చెప్పేశాను.

>> అభిమానులు అసలు రంగనాయకమ్మ గారు తప్పు చేయ్యరూ అని ఒక స్థిర నమ్మకంతో ఉంటారు >>

ఇలాంటి సూత్రీకరణ చేయటానికి మీకున్న ఆధారాలేమిటి? అభిమానులందర్నీ యాంత్రికంగా ఒక గాటన కట్టే ప్రయత్నమిది. అభిమానులైనా, కాకపోయినా.. వారు చేసే వాదనలో పాయింట్ ఉందా లేదా అనేది ముఖ్యం.

>> ఎంతకీ సూదితో భుమి కి రంధ్రం చేస్తాను అంటే నేను ఏమీ చెప్పలేను >>

మీ పోలిక ప్రస్తుత సందర్భంలో నేనన్న ఏ నిర్దిష్ట పాయింటుకు వర్తిస్తుంది?

>> రంగనాయకమ్మగారు గొప్ప ఆర్ధిక వేత్త అని నోబెల్ ప్రైజ్ కి రెకమెండ్ చేస్తూ నేను ఈ చర్చ నుంచి వైదొలుగుతున్నాను >>

ఆమె గొప్ప ఆర్థిక వేత్త ఆమె ఎక్కడా చెప్పలేదు. నేనూ అనలేదు. ‘ నోబెల్ ప్రైజ్ కి రెకమెండ్ చేస్తూ’ అనే మాటలెందుకు చెప్పండి? ఇక చర్చలో కొనసాగటమైనా, వైదొలగటమైనా అది మీ ఇష్టం.

>> మీకు న్యూట్రల్ గా తెలుసుకోవాలి అనుకుంటే నాకు మైల్ చెయ్యండి >>

ఇక్కడ చెప్పలేనిదీ... ప్రైవేటుగా మెయిల్లో చెప్పగలిగేదీ ఉంటుందా? ‘న్యూట్రల్ గా తెలుసుకోవాలని ఉంటే’ అనే షరతు కూడా పెట్టారు మీరు. ఇక్కడ జరుగుతున్న చర్చ నా ఒక్కడి కోసమే కాదు, ఇతర పాఠకుల కోసం కూడా. బహిరంగ చర్చను ఆకస్మికంగా ‘ప్రైవేటు చర్చ’గా మార్చటం నాకు సమ్మతం కాదు.

Malakpet Rowdy చెప్పారు...

ఒకరి ఆర్ధిక శాస్త్ర జ్ఞానం గురించి ఓ అవగాహనకు రావటం వేరు. దాన్ని నలుగురికీ ప్రకటించి, విమర్శించాలనుకున్పపుడు మాత్రం ఈ సోర్సులు ఏ మాత్రం చాలవు. ఆ వ్యక్తి రాసిన సంబంధిత పుస్తకాలు చదవాల్సిందే. అది కనీస బాధ్యత!
_____________________________________

When they assessed your skills at your current job, did they read your books? Come on!ఇది మరీ బావుందండీ. ఇక విమర్శకులంతా రచయిత ఏం రాశారో అది చదవటం మానేసి, డైరెక్టు భేటీలు వేసి ‘ప్రైమరీ సోర్సు’ ఉంది కదా అని విమర్శలను మొదలుపెట్టెయ్యొచ్చంటారా?
___________________________________

I would say yes. What one speaks is more important than what one writes. డైరెక్టు భేటీలోనే మనిషి అసలు సత్తా తెలుస్తుంది. జాబ్ ఇంటర్వ్యూలు కూడా అందుకే కదా?

అజ్ఞాత చెప్పారు...

>>ఆ వ్యక్తితో ‘ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడితే చక్కగా వారి పరిజ్ఞానం అర్థమైపోతుంద’ని మీరంటుంటే... ఇంకా ఏం చెప్పను? నే చెప్పగలిగిందేదో ఇంతకుముందే చెప్పేశాను.

ఇది ఇప్పటికి ఎన్నో సారో నేను చెప్పటం, సాహిత్య కోణం లో సైన్సుని చూడొద్దు.
ఇలా కనపడిన ప్రతి వాడికీ ఉత్తరాలు రాసి, విరిగిపోయిన స్కేల్ తో భూమిని కొలిచే రంగనాయకమ్మ అని అనిపించుకున్నారు, ఇప్పుడూ మీరూ, ఆవిడ చేసిన రచనల్లో పెద్ద పెద్ద విశేషాలున్నాయి అని బ్రమలో ఉన్నారు.

సాహిత్యం వేరు, సైన్సు వేరు, ఇప్పుడు పి,హెచ్.డీ మౌఖిక పరీక్షలు ఒక ౨౦ ని. కన్నా ఎక్కువ వుండవు, ఆ పది/ఇరవై ని. ఎలా తేల్చేస్తున్నారు అంటే ఏమి చెప్తాను, బేసిక్ ఐ.యస్. యల్.యమ్. కుడా తెలియని ఆవిడ ఆర్దిక శాస్త్రంలో పెద్ద గట్టి పిండం అని మీరు తెలిస్తే, మీ ఇష్టం, అది నా తప్పు అంటే, నా తప్పులు మీరు ఎంచే ముందు కాస్త ఐనా అవగాహన మీకు ఉండాలి, అది లేదు, దానికి తోడు, మీరు ఏ లెఖ్ఖన చెప్పారు, దాని కధా కామీషు ఏంటి అని మీరు అడగరు, అసలు అలా జరిగే అవకాశం లేదు అని కుర్చుంటే నేను ఏమి చెప్పను? అసలు అదే పాజిబుల్ కాదు (అవతలి వాడు చెప్పేది ఏంటో తెలుసుకుందా అనే కనీస ప్రయత్నం కుడా చెయ్యకుండా) అని అన్నప్పుడు, మీకు చెప్పటం సాధ్యం కాదు, కాస్తో కుస్తో ఎకనామిక్స్ తెలుసుకుంటే ఎమైనా నేను చెప్పేది అర్ధం అవుతుంది, అవి నేర్పుదామనే మిమ్మల్ని మైల్ చెయ్యమన్నాను తప్ప, ఇదెదో ప్రవేట్ వ్యవహారం కాదు.

మొన్న ఒకాయన (పెద్ద సంస్కృత పండితుడు, మీకూ తెలిసే ఉండొచ్చు) అసలు రిజర్వ్ బ్యాంక్ ఒక దండగమారి వ్యవహారం అది ముసేస్తే సరిపోతుంది, ఆ డబ్బులు అచ్చు వేయటం వేరే ఏ బ్యాంక్ కి ఐన ఇవ్వొచ్చు అని తేల్చిపడేశారు, పాపంలే, వేదాలలో అన్ని ఉన్నాయి అనుకునే రకం లే అని అనుకున్నాను, ఇప్పుడు నేను ఆయన రాసిన పుస్తకాలు అన్నీ చదివి తేల్చాలి కామోసు..
రంగనాయకమ్మగారు అంతకన్నా ఘోరమైన కామెంట్లు ఇచ్చారు, ఇంకా వారి జ్ఞానాన్ని మెచ్చుకోడం, దాన్ని నేను ఖండించడం..

Malakpet Rowdy చెప్పారు...

ఆ వ్యక్తితో ‘ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడితే చక్కగా వారి పరిజ్ఞానం అర్థమైపోతుంద’ని మీరంటుంటే
_____________________________________

అంతేకాదు - అవతలవారు జ్ఞాని అని తెలియడానికి సమయం పట్టచ్చు గానీ అవతలవారికి కనీస పరిజ్ఞానం లేదు అని తెలియడానికి 5 నిమిషాలు చాలు.

Malakpet Rowdy చెప్పారు...

Let me use another analogy - to confirm that a system is broken - One failed test is enough and to confirm that a system is tight, it usually takes a lot of time.

వేణు చెప్పారు...

మలక్ గారూ!
>> When they assessed your skills at your current job, did they read your books? Come on! >>

ఉద్యోగ నియామకాలకూ, రచయిత ‘ఆర్ధిక శాస్త్ర జ్ఞానం’పై చేసే విమర్శలకూ పోలిక తెచ్చారన్నమాట! రిక్రూట్ చేసేవాళ్ళు అభ్యర్థి పరిజ్ఞానం నచ్చితే ఉద్యోగం ఇస్తే ఇస్తారు. లేకపోతే లేదు. ‘ఆ అభ్యర్థికి పరిజ్ఞానం లేదు’ అంటూ విమర్శలకు దిగరు.

రిక్రూటర్లు అభ్యర్థిపై ఒకవేళ విమర్శలు చేసే పని కూడా పెట్టుకోదలిచారా? అయితే... ఆ అభ్యర్థి తన పరిజ్ఞానం ప్రతిఫలించే పుస్తకాలు రాసివుంటే... వాటిని కూడా వారు బాధ్యతగా చదవాల్సిందే!
రిక్రూటర్, అభ్యర్థి అనే పాత్రలు ఇప్పుడు విమర్శకుడు, రచయిత అనే పాత్రలుగా మారతాయి. విమర్శకుడిగా మారిన ఆ రిక్రూటర్ తను చేసిన అరగంట ఇంటర్వ్యూ ను మాత్రమే ఆధారం చేసుకుని ‘అభ్యర్థి కి పరిజ్ఞానం లేదు’ అంటూ విమర్శలు చేయలేడు.

>> What one speaks is more important than what one writes. >>

రాసిందాన్నికంటే మాట్లాడిందానికే ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుందా? ఎందుకలా? రచయితల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా?
ఇప్పుడు మీరు ఈ వ్యాఖ్యలన్నీ రాస్తున్నారు ... వీటి కంటే మీతో మాట్లాడి ఆ విషయాలకే నేనిప్పుడు ప్రాముఖ్యం ఇవ్వాలా? ఇదే సూత్రం మీకూ అప్లై అవుతుంది కాబట్టి... నేను రాస్తున్న ఈ వ్యాఖ్యల కంటే మీరు నాతో మాట్లాడి, ఆ మాటలకే ప్రాముఖ్యం ఇవ్వాల్సివుంటుంది. ఎలా ఇప్పుడూ ?

>> డైరెక్టు భేటీలోనే మనిషి అసలు సత్తా తెలుస్తుంది. జాబ్ ఇంటర్వ్యూలు కూడా అందుకే కదా? >>

డైరెక్టు భేటీలోనే మనిషి అసలు సత్తా తెలుస్తుందనేది సాపేక్షమైన అంశం. అన్ని సందర్భాలకూ, అందరు వ్యక్తులకూ ఇది నిరపేక్షంగా వర్తించదు.

నేను రాసిన సందర్భం- ఒక రచయిత ( రంగనాయకమ్మ గారి) ఆర్ధిక శాస్త్ర జ్ఞానం విషయంలో తార గారి నిర్థారణ గురించి. ఆ నిర్థారణకు రావటానికి ఉపకరించిన సోర్సులు సరైనవి కావనేది నా అభ్యంతరం. ఈ విషయాన్ని నిర్దిష్టంగా చూడకుండా... జాబ్ ఇంటర్వ్యూలంటూ పోలిక తెచ్చి, జనరలైజ్ చేసి మాట్లాడితే .. సమస్య అలాగే ఉంటుంది.

వేణు చెప్పారు...

>> అవతలవారు జ్ఞాని అని తెలియడానికి సమయం పట్టచ్చు గానీ అవతలవారికి కనీస పరిజ్ఞానం లేదు అని తెలియడానికి 5 నిమిషాలు చాలు >>

‘అవతలవారు జ్ఞాని అని తెలియడానికి సమయం పట్టచ్చు’. కదా? ఈ లోపు ‘ కనీస పరిజ్ఞానం లేదు’ అంటూ 5 నిమిషాల్లో నిర్థారణకు వచ్చెయ్యవచ్చా?

అయినా మీ సూత్రీకరణ అందరికీ వర్తించేది కాదు లెండి. ‘అవతలవారి’ ని బట్టీ, ‘పరిశీలకులను’ బట్టీ, సందర్భాన్ని బట్టీ ఫలితం మారిపోతుంటుంది.

వేణు చెప్పారు...

తార గారూ !
>> కాస్తో కుస్తో ఎకనామిక్స్ తెలుసుకుంటే ఎమైనా నేను చెప్పేది అర్ధం అవుతుంది, అవి నేర్పుదామనే మిమ్మల్ని మైల్ చెయ్యమన్నాను తప్ప, ఇదెదో ప్రవేట్ వ్యవహారం కాదు >>

ఎకనామిక్స్ కాస్తో కూస్తో తెలుసుకుంటే తప్ప అర్థం కాని విషయమేదీ మీరేమీ చెప్పలేదే? అయినా ‘కాస్తో కూస్తో’ కూడా నాకు ఎకనామిక్స్ రాదని మీకు ఎలా తెలిసిందీ? ఇక అదేదో నేర్పుదామని మీకు సత్సంకల్పం కలిగినందుకు సంతోషంగానే ఉంది!

>> ‘ఆవిడ చేసిన రచనల్లో పెద్ద పెద్ద విశేషాలున్నాయి అని బ్రమలో ఉన్నారు’ >>

నాకు ఏయే భ్రమలున్నాయో మీకు ఎంచక్కా ఎలా తెలిసిపోతోందో! ఎలా వచ్చేశారండీ ఈ నిర్థారణకు - నా గురించి ఏమీ తెలియకుండానే? ఆమె పుస్తకాలేవీ చదవకుండా దానిలో పెద్ద పెద్ద విశేషాలు లేవని ఎలా చెప్పగలుగుతున్నారు? ...ఈ ప్రశ్నలన్నీ అడగటానికి నాకైనా, ఎవరికైనా ఎకనామిక్స్ తెలిసుండాలా?

అజ్ఞాత చెప్పారు...

సరే దినికి ఒకటే మార్గం, మా సోర్సెస్ తప్పు ఐనంతమాత్రాన రంగనాయకమ్మగారి నాలెడ్జ్ ప్రువ్ ఐపోదు, సెట్ ఓపెన్ కాదు అని అన్నంత మాత్రాన, అది క్లోజ్డ్ ఐపోదు, సాగర్ ఆధునీకరణకి ఒక వెయ్యి కోట్లు అప్పు అవసరం కదా, DCF కట్టి అది వేరే దేశం నుంచి అప్పుతెచ్చుకుంటే మంచిదా, లేక రైతుల దగ్గిరనుంచి తెస్తే మంచిదా, లేక పన్నులు పెంచాలా? వీటిల్లో ఏది మంచిదో వారి చేత ఒక ఆర్టికల్ వ్రాయించి (DCF తో), లేదా మీరు కనుక్కోని చెప్పండి, దానితో మా అభిప్రాయం తప్పు ఐపోతుంది కదా.

Malakpet Rowdy చెప్పారు...

రిక్రూట్ చేసేవాళ్ళు అభ్యర్థి పరిజ్ఞానం నచ్చితే ఉద్యోగం ఇస్తే ఇస్తారు. లేకపోతే లేదు. ‘ఆ అభ్యర్థికి పరిజ్ఞానం లేదు’ అంటూ విమర్శలకు దిగరు.
___________________________________


నేను పనిచేసిన ప్రతీచోటా ఫీడ్ బేక్ ఉంది - అందులో ఇంటర్వ్యూ కి వచ్చిన కేండిడేట్ పేరిజ్ఞానం మీద కూలంకషమైన రిపోర్ట్ ఉంటుంది. అది కాక చాలా సందర్భాలలో ఆ కేండిడేట్ కే విషయాలు చెప్పడం జరుగుతుంది. మీరు పనిచేసే చోట ఇలాంటిది లేదా?

ఈ లోపు ‘ కనీస పరిజ్ఞానం లేదు’ అంటూ 5 నిమిషాల్లో నిర్థారణకు వచ్చెయ్యవచ్చా?
___________________________________

On the average, I spent 45-60 minutes on a candidate I have selected and around 8-9 minutes on a candidates I have rejected. This is based on my own data.

Malakpet Rowdy చెప్పారు...

ఈ లోపు ‘ కనీస పరిజ్ఞానం లేదు’ అంటూ 5 నిమిషాల్లో నిర్థారణకు వచ్చెయ్యవచ్చా?
_____________________________________

To oversimplify the case,
కలిసిన మొదటినిమిషంలోనే ఎవరైనా 1/0 = ఇన్ ఫినిటీ అన్నారనుకోండి, వాళ్ళ పరిజ్ఞానం వెంటనే తెలిసిపోతుంది. కానీ దానికి సరైన సమాధానం చెప్పినంత మాత్రాన వాళ్ళు జ్ఞానులైపోరు.

ఒక కారు టైరు పనిచెయ్యదు అని చెప్పాలంటే ఒక కన్నం చూపిస్తే చాలు. పని చేస్తుంది అని చెప్పాలంటే అనూవణూవూ వెతకి లోపాలేవీ లేవని చెప్పాలి

Malakpet Rowdy చెప్పారు...

ఇప్పుడు మీరు ఈ వ్యాఖ్యలన్నీ రాస్తున్నారు ... వీటి కంటే మీతో మాట్లాడి ఆ విషయాలకే నేనిప్పుడు ప్రాముఖ్యం ఇవ్వాలా? ఇదే సూత్రం మీకూ అప్లై అవుతుంది కాబట్టి... నేను రాస్తున్న ఈ వ్యాఖ్యల కంటే మీరు నాతో మాట్లాడి, ఆ మాటలకే ప్రాముఖ్యం ఇవ్వాల్సివుంటుంది. ఎలా ఇప్పుడూ ?
_____________________________________

We are talking about primary and secondary sources here. ఆ పరిజ్ఞానాన్ని అంచనా వెయ్యాలంటే నేను మాట్లాడిన దానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంటర్వ్యూలు పెట్టేది ఇందుకే

Malakpet Rowdy చెప్పారు...

Whatever you say in person is primary and whatever you publish is secondary

Malakpet Rowdy చెప్పారు...

Curious question - not directly related to the post:


Who wrote this?


బొగ్గు కంటే బంగారానికి విలువ ఎక్కువని మనందరికీ తెలుసు.

ఎందుకనో ఎప్పుడైనా ఆలోచించారా?


‘బొగ్గు ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంది. బంగారం ఎక్కడో కానీ దొరకదు. అందుకే దానికంత విలువ’ అనే సమాధానం తడుతోంది కదూ!


కానీ ఇది నిజం కాదు. ఏ వస్తువుకు ఉన్న విలువ అయినా ఆ పదార్థానిది కాదు. ఆ వస్తువు కోసం జరిగిన శ్రమలదే. బంగారం సంగతైనా ఇంతే!

You or Ranganayakamma?

Unknown చెప్పారు...

తార గారు,

ఇక్కడ టాపిక్ కరెక్ట్గా నడవట్లేదు. వేణు గారు అడిగింది ఒక్కటే :
>>.. ఆ లెఖ్ఖన రంగనాయకమ్మగారు తన రచనల్లో చక్కటి మూఢనమ్మకాలని రంగరించి రాస్తున్నారు మరి...>>
దీనికి వివరణ. మీకు సవాలక్ష తెలిసి వుండొచ్చు, ఆర్దిక సాశ్త్ర కోవిదులే అయి వుందొచ్చు. ఆవిడతో పరిచయమే వుండొచ్చు, కాని అవన్ని మీ అభిప్రాయాలు. వేరొకరికి విశ్లేషించి చెప్పాలంటే, అందరికి అందుబాటులోని పుస్తకమో/విషయమో ప్రామాణికంగా తీసుకుని చర్చిస్తే అర్తవంతంగా వుంటుంది. రంగనాయకమ్మ గారి ఏ రచనలో మీరు అనుకున్న మూడ నమ్మకాలు వున్నాయి - ముందు కోట్ చేసి చెప్పండి. ఈ విషయన్నే మీరు ఎక్కడిక్కెక్కడికో తీసుకువెళ్తున్నారు.

అజ్ఞాత చెప్పారు...

Vescart గారు,

బహుశా నా కామెంట్లు సరిగ్గా చదివినట్టులేరు.

"దానికి తోడు, మీరు ఏ లెఖ్ఖన చెప్పారు, దాని కధా కామీషు ఏంటి అని మీరు అడగరు, అసలు అలా జరిగే అవకాశం లేదు అని కుర్చుంటే నేను ఏమి చెప్పను? అసలు అదే పాజిబుల్ కాదు (అవతలి వాడు చెప్పేది ఏంటో తెలుసుకుందా అనే కనీస ప్రయత్నం కుడా చెయ్యకుండా) అని అన్నప్పుడు, మీకు చెప్పటం సాధ్యం కాదు"

మంచు చెప్పారు...

వేణు గారు :
ఈవిడ ఆర్ధకశాస్త్ర పరిజ్ఞానం మీద అంత నమ్మకం ఎలా ఏర్పడింది. మీరు ఒక అభిమాన రచయతగా ఆవిడ ఏది చెప్పిన్నా కరెక్ట్ అనుకుంటున్నారా ? లేక ఆవిడ రాసిన అర్ర్దికశాస్త్రానికి సంబంధించిన ఆర్టికల్స్ ఎమయినా మీకు బాగా నచ్చాయా.. ఎందుకంటే మీరు తార ని కనీసం తనకి ఎమి నచ్చలెదొ అడగలేదు.. జస్ట్ ఆవిడని విమర్శించొద్దు అని మాత్రమే అంటున్నారు.

నేను నైపుణ్యత సాధించిన సబ్జెక్ట్ లొ ఎవరయినా కామెంట్ చేసినప్పుడు , వాళ్ళు చేసిన ఒక్క స్టుపిడ్ స్టేట్మెంట్ ని బట్టి అవతలి వారికి ఎంత జ్ఞానం వుందొ చెప్పగలను. దానికి వారు రాసిన పుస్తకాలు చదవక్కర్లేదు.. వాళ్ళు చెప్పినవి వినక్కర్లేదు.. అలాగే మీరు స్ట్రాంగ్ అయిన సబ్జేక్ట్ లొ అయినా అంతే...

నాకు ఈ విషయం లొ మీరు ఎదొ ఒక అభిమాని గా సమర్దిస్తున్నరు కానీ తార/మలక్ చెప్పిన్ దానికి పెద్ద ఇంపార్టన్స్ ఇస్తున్నట్టు కనిపించడం లేదు.

Praveen Mandangi చెప్పారు...

వ్యక్తి మీద ద్వేషం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆర్థిక శాస్త్రం గురించి వ్రాసినా, యంత్ర శాస్త్రం గురించి వ్రాసినా నచ్చదు. అందుకే ఆ రచయిత పై నిరాధార ఆరోపణలు చేస్తారు.

Unknown చెప్పారు...

కామెంట్లన్ని చదివే చాలా గందరగొళంగా అనిపించింది. చాలా తేలికగా చెప్పే సమధానాన్ని అనవసరంగ ఆర్థిక శాస్త్రం మీకు తెలియదు, ఆవిడకు తెలియదు అని అంటున్నారు. అందుకే, అన్ని కామెంత్స్ ని రోల్ బాక్ చెసి మొదటి కామెంట్ కి వచ్చాను. మీరు ఏమి చెప్పినా ఓపిగ్గా వింటాను - టాపిక్ కి సంభందించినదైతే. కాని మీరు ఏక పక్షంగా చెప్పేస్తున్నారు, "మీకు చెప్పటం సాధ్యం కాదు" అని.

ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను - ఏ రచనలో వారు మూఢ నమ్మకాలను రంగరించి ప్రస్తావించారు? (మీకు జరిగిన స్వియానుభవం ఆధారంగానే చెప్తున్నారా? 'ప్రమాదొ ధిమతాపిః' - ఎంతటివారైనా ఒక్కోసారి తప్పు చేస్తారు. అది ఒక్కసారా, ఆవిడ నైజమే అదా అని తేల్చాలంటె మీరు కొంత శ్రమ పడాలేమో. ఎందుకంటె మీరు చెప్పిన సందర్భానికి చాలా మంది ముందు ఇలానే స్పందించే అవకాశం వుంది. అసలు ఆవిడ అభిప్రాయం ఎందుకు అదగవల్సి వచింది ముందు? ఏమి క్వాలిఫికేషన్స్ వున్నాయని 'legalising prostitution' గురించి అడిగారు? ఇది కాకుండా ఇంకా ఎక్కడైనా ఆవిడ దేశం ఇల నడవాలి అని రాశారా? అది మీరు ప్రస్తావిస్తే బావుంటుంది. అందరికి అర్ధం అవుతుంది. ( మీరు పదే పదే ఇతరులకు చెప్పటం సాధ్యం కాదు అనుకుంటే అసలు వ్యాఖ్య చేయకుండా వుండాల్సింది. అవతలి వారు అర్ధం చెసుకొళెరని ముందుగానె తెల్చేస్తున్నారు. మీరు కొంచెం త్వరగా అవతలి వారి మీద అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటున్నారని అనిపిస్తుంది )

Unknown చెప్పారు...

@తార గారు
అసలు నాకు రంగనాయకమ్మ గారి రచనలతో ఎటువంటి పరిచయం లేదు. ఆవిడ సాహిత్యం మాత్రమే రాస్తుందని అనుకున్నా. సహజంగానే సామాజిక వ్యవస్తల మీద రచయితలకు వుండే ఆలోచన శైలితో విమర్శలు చెస్తారనే తెలుసు. కాని, మీరు ఆర్దిక శాస్త్ర ప్రస్తావన తెచ్చి నన్ను కొంత ఆస్చర్య పరిచారు. అందు కోసమే కోట్ చెసి చెప్పమంటున్నా. (పలాన వ్యాసం లో, రచనలో ..ఇలా రాసారు, అది తప్పు అని). అది తప్పు కాదు అని నెను బహుశా వ్యతిరేకిస్తే, మీ శాస్త్రాన్ని కొద్ది కొద్దిగా చెప్పొచ్చు. అసలు అన్నప్రస్న రోజే ఆవకాయ అంటే ...?

Malakpet Rowdy చెప్పారు...

I'm interesting in knowing who said this:

కానీ ఇది నిజం కాదు. ఏ వస్తువుకు ఉన్న విలువ అయినా ఆ పదార్థానిది కాదు. ఆ వస్తువు కోసం జరిగిన శ్రమలదే. బంగారం సంగతైనా ఇంతే!

I picked this from one of the old posts from this blog which is a review on an Economics book written for kids

వేణు చెప్పారు...

మలక్ గారూ!
>> Whatever you say in person is primary and whatever you publish is secondary >>

ఇది ఉద్యోగ నియామకాలకు వర్తిస్తుందేమో. ముఖ్యంగా రచయితల విషయంలో ఈ సూత్రం అంగీకార యోగ్యం కాదు.

రచయితల పరిజ్ఞానాన్ని అంచనా కట్టి, విమర్శించదలిచినవారు ఆ రచయితలతో ఒకసారి వ్యక్తిగతంగా మాట్లాడి, ‘ఈ మాత్రం చాల్లే’ అనుకుని సంతృప్తి పడి, విమర్శలు మొదలుపెడదామంటే చాలా చిక్కులొస్తాయి.

వారి మధ్య జరిగిన ఆ సంభాషణకు ఆధారం ఉండాలి కదా? అందుకని దాన్ని రికార్డు చేయాలి. ఆడియో చాలదు, వీడియో కూడా కావాలి. ఈ రెండూ స్పష్టంగా ఉండాలి. అంతేనా? సందర్భమేమిటో దాని ముందువెనకలేమిటో కూడా రికార్డు అవ్వాలి. సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని ఏమీ మార్చలేదనే హామీ కూడా అవసరమవుతుంది.

ఇంతా చేసి.. జీవించివున్న రచయితల విషయంలో మాత్రమే దీన్ని చేయగలుగుతాం!

పుస్తకాల్లోనైతే రచయిత చెప్పదలిచింది స్పష్టంగా ఉంటుంది. సంభాషణల్లో కంటే అక్షరరూపంలో భావ స్పష్టత ఎక్కువ. విమర్శకుడితో పాటు ఇతరులు కూడా దాన్ని చదివి, ఆ విమర్శ సరైందో కాదో తేల్చుకోగలుగుతారు.

Malakpet Rowdy చెప్పారు...

LOL

ఆ ప్రాస్టిట్యూషన్ లీగలైసేషన్ మెసేజ్ పెట్టింది నేను.

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Malakpet Rowdy చెప్పారు...

రచయితల పరిజ్ఞానాన్ని అంచనా కట్టి, విమర్శించదలిచినవారు ఆ రచయితలతో ఒకసారి వ్యక్తిగతంగా మాట్లాడి,
__________________________________________________________________

ఇక్కడ అంచనా వేస్తోంది రచనలని కాదు - ఉన్న పరిజ్ఞానాన్ని. రచనలపై విమర్శలు రాయాలి అంటే అవి చదవాలి, పరిజ్ఞానాన్ని అంచనావెయ్యడానికి అది అక్కరలేదు

ఆవిడ బాగా పాడగలరా లేదా అని కనుక్కోడానికి ఆవిడ రచనలు చదవక్కరలేదు కదా

Malakpet Rowdy చెప్పారు...

వారి మధ్య జరిగిన ఆ సంభాషణకు ఆధారం ఉండాలి కదా? అందుకని దాన్ని రికార్డు చేయాలి. ఆడియో చాలదు, వీడియో కూడా కావాలి. ఈ రెండూ స్పష్టంగా ఉండాలి. అంతేనా? సందర్భమేమిటో దాని ముందువెనకలేమిటో కూడా రికార్డు అవ్వాలి. సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని ఏమీ మార్చలేదనే హామీ కూడా అవసరమవుతుంది.
_____________________________________

Are we fighting a court battle here? Everyone here goes with the trust that Tara is honest and so are you.

అజ్ఞాత చెప్పారు...

అన్ని దేశాల్లోనూ అసలైన డబ్బు బంగారమే. కాయితం డబ్బుకి గానీ, ఇంకో రకం డబ్బుకి గానీ అసలు మూలం బంగారమే. బంగారం బిళ్ళలు చలామణిలో తిరిగితే అరిగిపోతాయి కాబట్టి, ఆ తిరిగే పని బంగారం బిళ్ళకి బదులు కాయితం ముక్క చేస్తోంది.

-------
ప్రపంచ ధనం మాత్రం బంగారమే!

----

కానీ ఇది నిజం కాదు. ఏ వస్తువుకు ఉన్న విలువ అయినా ఆ పదార్థానిది కాదు. ఆ వస్తువు కోసం జరిగిన శ్రమలదే. బంగారం సంగతైనా ఇంతే!

--------

శ్రమలే చెయ్యకుండా మనుషులు జీవించడం ఏనాటికీ సాధ్యం కాదు!

-------

వస్తువుకు ఉండే విలువ గురించి పరిశోధన 2 వేల ఏళ్ళకిందటే ప్రారంభమైంది. ఈ పరిశోధన గ్రీకు మేధావి అరిస్టాటిల్ (క్రీ.పూ. 384-322) తో మొదలై, ఇంగ్లండ్ మేధావి రికార్డో (క్రీ.శ. 1772-1823) ద్వారా 2 వేల ఏళ్ళ పాటు సాగింది. 1867లో కార్ల్ మార్క్స్ ‘విలువ’ పరిశోధనలో ‘శ్రమ దోపిడీ’ రహస్యం బయటపడింది.

గారు ఇదే బ్లాగ్ నుంచి తెచ్చినవి, అన్నీ తప్పే (బంగారం గురించి సులభంగా అర్దమవటం కోసం అనుకున్నా).

ఇవి అన్ని చాలా ప్రాధమిక విషయాలు..

వేణు చెప్పారు...

మంచు గారూ!

>> నేను నైపుణ్యత సాధించిన సబ్జెక్ట్ లొ ఎవరయినా కామెంట్ చేసినప్పుడు , వాళ్ళు చేసిన ఒక్క స్టుపిడ్ స్టేట్మెంట్ ని బట్టి అవతలి వారికి ఎంత జ్ఞానం వుందొ చెప్పగలను. దానికి వారు రాసిన పుస్తకాలు చదవక్కర్లేదు.. వాళ్ళు చెప్పినవి వినక్కర్లేదు >>

సబ్జెక్టులో నైపుణ్యం సాధించటం అంటే మీ అర్థం ఏమిటి? డిగ్రీలుండటమా? రిసర్చ్ చేయటమా? నైపుణ్యం వచ్చేసిందని మనకు మనమే నిర్ణయించేసుకోవచ్చా?

‘వారు రాసిన పుస్తకాలు చదవక్కర్లేదు.. ’ అనే వాదన ఎంత అసంబద్ధమో ఇప్పటికే చాలాసార్లు చెప్పాను!
ఇప్పుడేమో ‘వాళ్ళు చెప్పినవి వినక్కర్లేదు’ అంటూ మీరు మరో పాయింట్ జోడించారు! చాలా బావుందండీ. :)

Malakpet Rowdy చెప్పారు...

రెండు వ్యాఖ్యలు తార గారివే కదా. (including prostitution).
_____________________________________

It was me who posted it (unless you feel that I am Tara)

Malakpet Rowdy చెప్పారు...

‘వారు రాసిన పుస్తకాలు చదవక్కర్లేదు.. ’ అనే వాదన ఎంత అసంబద్ధమో
____________________________________

ఎంత సమంజసమో మీకు ఉదాహరణలతో సహా చెప్పాను.

వేణు చెప్పారు...

మలక్ గారూ!

>> Are we fighting a court battle here? Everyone here goes with the trust that Tara is honest and so are you >>

ఇక్కడ తార గారి నిజాయితీ గురించి నేనేమీ వ్యతిరేకంగా వ్యాఖ్యానించలేదు. అలాంటి అభిప్రాయం మీకెలా ఏర్పడింది?
నేనిక్కడ చర్చిస్తున్నది- రచయితలతో ఒకసారి వ్యక్తిగతంగా మాట్లాడి, ఎవరు విమర్శలు మొదలుపెట్టినా వచ్చే చిక్కుల గురించి. (అది తార గారికే కాదు, నాకైనా, మీకైనా.. ఎవరికైనా కూడా వర్తిస్తుందనేది నా భావం).

Malakpet Rowdy చెప్పారు...

అలాంటి అభిప్రాయం మీకెలా ఏర్పడింది?
_______________________________

When you were speaking of recording and morphing.

ఇంతకీ మీరు సమాధానం చెప్పలేదు - పైనున్న బంగారం, శ్రమ స్టేట్ మేంట్ మీదా ఆవిడదా?

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Unknown చెప్పారు...

@Tara wrote:
అన్నీ తప్పే (బంగారం గురించి సులభంగా అర్దమవటం కోసం అనుకున్నా).
ఇవి అన్ని చాలా ప్రాధమిక విషయాలు..
---------------------------------------------------------------
వివరణ ఇవ్వండి. ఏ విధంగా తప్పు? మీరు తప్పు అనగానే అవి తప్పులు అయిపోవు. వీటిని ఏ మీ వాదనకి ఆధారాలేమిటో ఇవి తప్పులయితే నిజాలేమిటో చెప్పండి, అవి నిజాలెందుకో సాక్ష్యాలు చూపించండి.

Unknown చెప్పారు...

@tara wrote:
వారి పుస్తకం ఒక్కటీ చదివిన పాపాన పోలేదు, పొయే ధైర్యం కుడా చెయ్యలేను
-
-
రంగనాయకమ్మ గారు కుడా, .... కానీ ఆర్ధిక అంశాలపై వ్యాఖ్యానించే అంతటి జ్ఞానం వారికి లేదు.
-
-
అవతలి వాడు చెప్పేది ఏంటో తెలుసుకుందా అనే కనీస ప్రయత్నం కుడా చెయ్యకుండా) అని అన్నప్పుడు, మీకు చెప్పటం సాధ్యం కాదు
-------------------------------------------------------
వేణు గారూ,

ఒక్క పుస్తకం కూడా చదవకుండా ఒక రచయిత జ్ఞానం గురించి కామెంట్ చెయ్యడానికి పూనుకున్న ఈ మనిషే "అవతలి మనిషి వాదన వినాల"ని నీతిబోధలు చేస్తోంది. పై వ్యాఖ్యలు ఆ వ్యక్తి నిజాయితీ లేమినీ ద్వంద్వ ప్రమాణాలనీ అనుమానాలకి తావు లేకుండా నిరూపిస్తున్నాయి.

ప్రతీ పబ్లిక్ ఫోరంలోనూ ఇలాంటి కనీసపు integrity లేని మనుషులూ, వీధి రౌడీలూ, చేరుతూనే ఉంటారు. ముఖ్యంగా internetలో ఇలాంటి వ్యక్తులు మరీ ఎక్కువగా తారసపడతారు. ఒకసారి వాళ్ళు కనీసపు నిజాయితీలేని మనుషులని అర్ధం అయిన తరవాత వాళ్ళతో వాదిస్తూ ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగమూ ఉండదు. ఇలాంటి మనుషుల వల్ల అర్ధవంతమైన చర్చ పక్క దారి పడుతుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులని (అధమపక్షం వాళ్ళ పొంతనలేని పోస్టులని) మీ బ్లాగులో అనుమతించకూడదని నా అభిప్రాయం.

Praveen Mandangi చెప్పారు...

విమర్శకుల వాదన చాలా విచిత్రంగా ఉంది. అదేదో సినిమాలో విలన్ ’చరిత్ర అడక్కు, చెప్పింది విను’ అంటాడు, అలా. రంగనాయకమ్మ గారు వ్రాసిన కాపిటల్ పరిచయం, ఇంగ్లిష్ పెంగ్విన్ ఎడిషన్ రెండూ నా దగ్గర ఉన్నాయి. అవతలివారిని తెలివితక్కువవాళ్లు అనుకునేవాళ్లని చూశాను కానీ నిరక్షరాస్యుల కింద లెక్క కట్టేవాళ్లని ఇక్కడే చూస్తున్నాను.

వేణు చెప్పారు...

మలక్ గారూ!

>> రచనలపై విమర్శలు రాయాలి అంటే అవి చదవాలి, పరిజ్ఞానాన్ని అంచనావెయ్యడానికి అది అక్కరలేదు >>

రచయిత పరిజ్ఞానాన్ని అంచనా వెయ్యడానికి పుస్తకాలు ఆధారంగా ఉన్నపుడు ఆ రచనలు చదివి తీరాలి! ఇదే నేను పదేపదే చెపుతున్నది. ఆ పుస్తకాలు సెకండరీ సోర్సు కాదూ, ప్రైమరీ సోర్సు అని కూడా చెప్పాను.

>> ఆవిడ బాగా పాడగలరా లేదా అని కనుక్కోడానికి ఆవిడ రచనలు చదవక్కరలేదు కదా >>

ఒక గాయని బాగా పాడగలరా లేదా అని కనుక్కోడానికి ఆమె పాడిన పాట తప్పనిసరిగా వినాలనేదే నా పాయింట్. వినక్కర్లేదని అంటున్నది మీరే!

Praveen Mandangi చెప్పారు...

రవి గారు. వాళ్ల దగ్గర సమాధానం లేకపోతే పొంతన లేని అనాలజీసే వస్తాయి, టైర్ బాగలేదని తెలుసుకోవడానికి ఒక రంధ్రం చాలు లాంటివి.

వేణు చెప్పారు...

తార గారూ!

మీరు కోట్ చేసిన వాక్యాలన్నీ రంగనాయకమ్మ గారు రాసిన ‘పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం’ పుస్తకంలోవి.

>> ఇవి అన్ని చాలా ప్రాధమిక విషయాలు..>>

ఔను. పిల్లల కోసం రాసిన పుస్తకం కదా, ప్రాథమిక విషయాలే ఉంటాయి!

మలక్ గారూ!

బంగారం గురించి మీరు కోట్ చేసిన వాక్యం నేను ఇదే బ్లాగులో రాసిన రివ్యూలోది. దానికి మూలం రంగనాయకమ్మ గారి ‘పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం’ పుస్తకమే.

వేణు చెప్పారు...

Vescart గారూ!

నేను ఇక్కడ చేసేది వితండ వాదమో, మీకు సూటిగా అర్ధం కావటం లేదో తేల్చుకోలేకపోతున్నాన్నారు. దీనికి నేను చెప్పేదేముంటుంది? స్పష్టంగానే నా వాదనను చెప్పానని అనుకుంటున్నాను మరి.

మీ మరో ప్రశ్న- తెలుగులో 'కృష్ణవేణి (వాణి శ్రీ) సినిమా ఆధారం ఇదేనా? అని. కాదు. ఈ నవల ఇంకా సినిమాగా రాలేదు. (ఈ టపాయే'కృష్ణవేణి’ నవల గురించి. చివరకు దీని ప్రస్తావన ఇన్ని వ్యాఖ్యల తర్వాత వచ్చిందన్నమాట.:)

సుజాత వేల్పూరి చెప్పారు...

వేణు గారూ,

ఈ చర్చతో మీ సమయాన్ని ఘోరంగా వృధా చేసుకుంటున్నారని మీకు తోచనందుకు ఆశ్చర్యపడుతున్నాను.

Praveen Mandangi చెప్పారు...

అవతలివారిని నిరక్షరాస్యులు అనుకునే వారికి సమాధానం చెప్పడం నిజంగా టైమ్ వేస్టే. వాళ్ల పొంతనలేని అనాలజీస్ చూస్తే తెలిసిపోతుంది, వాళ్లు ఇతరులని నిరక్షరాస్యులు అనుకుంటున్నారని.

Unknown చెప్పారు...

@ వేణు గారు

మీరు పొరబడుతున్నారు. నేను వ్యాఖ్య పెట్టే సమయానికి మలక్ గారి వ్యాఖ్య (గాయని గురించి, ఇంకా పుస్తకాలు చదవక్కర్లేదని ఉదాహరణలు ఇచ్చానని ) వున్నది. దానిని ఉద్దేసించి అలా రాశాను. ఆ వాదనలు వితండ వాదనలుగా తోచాయి. మీవి కావు. మీలాగే నేను వారి విమర్శలను అర్దం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. కాని ఎందుకో గొటితో తేలే సంస్యను గోరంత చేస్తున్నారనిపించింది. రంగనాయకమ్మ గారు తన రచనలలో కానీ చర్చా వేదికలమీద కాని ఏవైనా చెప్పి వుంటే దాని సొదాహరించినా అర్ధవంతంగా వుంతుండి. కాని అసలు అదే అక్కర్లేదు అంటున్నారు. ఇది ఎక్కడి వాదనో!

Unknown చెప్పారు...

@తార గారు

>> ఇదే బ్లాగ్ నుంచి తెచ్చినవి, అన్నీ తప్పే (బంగారం గురించి సులభంగా అర్దమవటం కోసం అనుకున్నా).

'పిల్లల కోసం ఆర్దిక శాస్త్రం' పుస్తకం ఆధారంగా చెప్తున్నారా? ఈ విషయం మీరు ముందుగానే ప్రస్తావించి వుంటే నూరు కామెంట్ల భారం తగ్గేది :-)

వేణు చెప్పారు...

ఈ టపాపై చర్చ ఆసక్తికరంగా మొదలైనప్పటికీ, పోనుపోనూ నాకు అసంతృప్తినీ చివరకు నిరాశనూ మిగిల్చింది!

టపా ‘కృష్ణవేణి’ నవల గురించి. అయితే.. వ్యాఖ్యల్లో దీనికి సంబంధించిన ప్రస్తావన చాలా స్వల్పంగా జరిగింది. ఇతరేతర అంశాలు (వీటిలో కొన్ని చాలా అనవసరమైనవి) దురాక్రమణ చేశాయి.

వ్యాఖ్యాతల్లో కొందరు తమ భావ ప్రకటనలో, భాషా ప్రయోగంలో బొత్తిగా సంయమనం పాటించలేదు. నిందాపూర్వక వ్యాఖ్యల పరంపర సాగి, వాదన కోసం వాదన అన్నట్టు తయారైంది పరిస్థితి. పునరుక్తులూ, పునరుద్ఘాటనలూ చాలా విసుగు తెప్పించాయి.

ఈ పరిస్థితిలో.. నా ‘ప్రజాస్వామిక వైఖరి’ నాకే అసంతృప్తిని కలిగించింది. అందుకే నిన్నటివరకూ ఓ నాలుగు వ్యాఖ్యలను ప్రచురించకుండా తీసేశాను.

ఈ టపాపై వ్యాఖ్యలకు ఇక ముగింపు పలకటం సముచితమనిపించింది. అందుకే ఈ రోజు ఉదయం తర్వాత వచ్చిన ఏ వ్యాఖ్యనూ ప్రచురించలేదు! స్పందించిన అందరికీ ధన్యవాదాలు!

Malakpet Rowdy చెప్పారు...

Loool when people like Ravi attack the others personally then you would happily publish them but when the others respond then you ll suddenly remember that it's personal. May be I should use my blog to put those points across. But do remember one thing -freedom of expression is not one sided.

శరత్ కాలమ్ చెప్పారు...

హ హ. ఇప్పటికి మీకు జ్ఞానోదయం అయ్యిందన్నమాట :) కొందరికి రంగనాయకమ్మ అన్నా, ఆధునిక భావాలు అన్నా పడక కెలికి కెలికి పడేస్తుంటారు. ఆ విషయం నాకు అర్ధం అయినా మీకు ఎప్పుడు అర్ధం అవుతుందా, మీ ఓపిక ఎప్పుడు క్షీణిస్తుందా అని గమనిస్తూవస్తున్నాను.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Praveen Mandangi చెప్పారు...

ఎవరి ఏకపక్షంగా చర్చించారు? ఒక వ్యక్తికి రంగనాయకమ్మ గారి రచనలు చదవడం ఇష్టం లేకపోతే అతన్ని ఎవరూ బలవంతం చెయ్యరు. చదవని పుస్తకాలలో తెలిసితెలియని విషయాలు గురించి మాట్లాడడమే విచిత్రంగా ఉంది.

Kathi Mahesh Kumar చెప్పారు...

అసలు వ్యాసంకన్నా చర్చ చాలా ఆసక్తికరంగా సాగింది. ప్రవీణ్ ప్లెజర్ ట్రిప్ ని పక్కనబెడితే తార-మలక్ వ్యాఖ్యల్లో కేవలం ప్రెజుడిస్ తప్ప మరేమీ కనిపించలేదు.

రంగనాయకమ్మ వ్యక్తిగా ప్రస్తుత పరిస్థితుల్లో irrelevant అయిపోయిందని ఈ మధ్యకాలంలో వారి వ్యాసాలు చదివితే అనిపించింది. ఒక రచయితగా వారి స్థానం ఎప్పటికీ కాదనలేనిది.ఈ రెండుకోణాల్నీ కలిపి ఒకే జడ్జిమెంటు చెయ్యడం తగదనుకుంటాను!

@సుజాత: తప్పదండీ...ఇవి తప్పవు. గౌరవప్రదంగా విబేధించడం మన తెలుగు సంస్కృతి కాదు.

krishna చెప్పారు...

@ వేణు గారు ,
అనవసరపు చర్చ ఎప్పుడు ఆగుతుందా అని నేను కూడా ఎదురు చూసాను :(
రంగనాయకమ్మ గారి ఫుట్ నోట్లు బాగున్నాయా? నాకు కూడా బలిపీఠం పైన ఆవిడ రాసిన స్వవిమర్శ ' చివరి మాట ' బాగా నచ్చింది. తన రచనని తనే విమర్శించుకోవడం, తన ఆలోచనలు కరెక్టా కాదా అని తరచి చూసుకోవడం, ఆలోచనలో మార్పు రావడం ఆరోగ్యకరమైన విషయం. మీ వాఖ్యానం చదివాక ఎప్పుడు ఎప్పుడు ఆ పుస్తకం చదువుతానా అని తొందరగా వుంది.

మీకు నచ్చిన పుస్తకాల లిస్టు చెప్పనే లేదు :(

ఇక ఒక అనవసర ప్రసక్తి!
ఒక రచన పై విమర్శకి అ రచనపై వచ్చిన వాఖ్యానాలు ( అంటే రచయత కాకుండా ఇతరుల అభిప్రాయాలు , అవి అనువాదాలు అయినా , అభిప్రాయాలు అయినా అసలు రచనకి విరుద్ధంగా లేనంత వరకు ) చదివి ఒక అభిప్రాయం కి రావడం తప్పు కాదు.
కానీ ఒక రచయతని తెలుసుకోవడానికి ఆ రచయత అభిప్రాయాలని కూలంకషంగా తెలుసుకుంటేనే.. విమర్శించడానికి వీలు అవుతుంది.

వేణు చెప్పారు...

కృష్ణ గారూ,

‘కృష్ణవేణి’ నవల గురించి మీరు ప్రస్తావించి అడగటం సంతోషంగా ఉంది. ఇతరేతర వ్యాఖ్యల పరంపర వెనక నేను రాసిన అసలు టపా మసకబారిపోయి కనిపించకుండాపోయినట్టుంది కదూ! అందుకే ఈ సంతోషం :)

‘కృష్ణవేణి’లో రంగనాయకమ్మ గారి స్వీయ విమర్శతో కూడిన ఫుట్ నోట్లు నాకు చాలా బాగా నచ్చాయి. కథకు సమాంతరంగా వాటిని చదవటం భలే అనిపించింది.

ఇక- నాకు నచ్చిన పుస్తకాలంటారా? చాలా ఉన్నాయి. వాటి జాబితా ఇంకా తయారుచేయలేదు. చేశాక మీకు తప్పకుండా మెయిల్ చేస్తాను. సరేనా?

అజ్ఞాత చెప్పారు...

అయ్యా, నేను వాల్మీకిని వ్రాస్తున్నాను.రామాయణం వ్రాసిన తరువాత వచ్చిన తృప్తితో ఇన్ని వందల ఏళ్ళుగా ఆత్మానందం పొందుతున్నాను. అసలు, విదేశీయుల మత్తులోపడి బారతీయతను మర్చిపోయిన వీళ్ళ గోడవెందుకులే అనుకున్నాను. ఒకడు అమెరికా అంటాడు, మరోకడు వీళ్ళను తిట్టడానికి ఎర్ర దేశాలంటాడు. మధ్యలో మన దేశం గురుంచి మర్చిపోవటమే కాకుండా చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు. బాబూ, మీకొక సంగతి తెలుసా? మన భారతీయతను గురుంచి తెలిసిన ఇతర దేశాలవారు మన దేశానికి ఎలారావాలనే ధ్యాసతోనే ప్రపంచాన్ని కనిపెట్టారు. ఆ తరవాత ఇక్కడికి వచ్చి మన నాగరికత, వైభవం చూసి సహజమైన ఏడుపుతో వారి తెలివితేటలను ఉపయోగించి మనని మనమే తిట్టుకునేట్లుగా చేసి వెళ్ళారు. అందుకనే, అనేక వందల సంవత్సరాలుగా కోట్లాదిమంది ప్రజాదరణ పొందిన నా గ్రంధంలో మీకు ఎక్కడా మంచి కనపడలేదు.

ఏమిటి రాముడు నచ్చలేదా? అయితే రాముడిని ఎందుకు ఆడిపోసుకోవటం. ఆ గ్రంధ రచయతను నేను కదా; ఏమిటేమిటి, దళితుడునైన నేను వ్రాసిన గ్రంధం అనువదించిన కవి బూర్జువా కవా? నేను వ్రాసిన గ్రంధన్ని విషమన్న ఆవిడ అభ్యుదయ కవియిత్రా? మీలో ప్రతి ఒక్క రచయిత[త్రి] వెనక్కు తిరిగి ఓకసారి చూసుకోండి; మీరు వ్రాసిన పుస్తకాలలోని "క్యారెక్టరు" ద్వారా గుర్తించబడిన వారెందరు? ఎవరైనా వున్నారా? 100 రోజులు, 100 నెలలు, 100 సంవత్సరాలూ పైన వున్నారా? అసలు "క్యారెక్టరే" లేని మీరు నన్ను విమర్శించేవారా?

కొన్ని వందల\వేలు సంవత్సారాలుగా ఆదరించ పడుతున్న, గుర్తించ బడిన క్యారెక్టరును సృష్టించిన నన్ను...... మీరు, అదే కనీసం 10 పుస్తకాలు కూడా జన బాహుళ్యంలోకి తీసుకేళ్ళలేని మీరు, వాటిని కనీసం 10 మందితో అయినా చదివించలేని మీరు, కనీసం 100 సంవత్సరాలు అయినా నిలబడని వీదేశీ ఇజాన్ని పట్టుకు వేలాడుతున్న మీరు, ఈ బ్లాగులోకంలో తప్ప బయటెక్కడా కాణీకి ఠికానా లేని మీరు, దళితుల అభ్యున్నతి అంటూ ఎలిగెత్తి అరిచే దొంగ ఇజాన్ని మోస్తునట్లు కనపడే అహంకారులైన మీరు నన్ను విమర్శిస్తారా? ఈ విధంగా నా ధ్యానానికి భంగం కలిగిస్తే నేను వ్రాయటం ప్రక్కన పెట్టి నా కుల వృత్తిని మళ్ళి చేపట్టి శ్రీకాకుళం దగ్గర నుండి హైదరాబాదు దాకా వేటాడుతా జాగ్రత్త!!!

Saahitya Abhimaani చెప్పారు...

అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు, మీరు వ్రాసిన వ్యాసం కంటే వ్యాఖ్యలు ఎక్కువయ్యినట్టున్నాయి !!

వేణు చెప్పారు...

రాధాకృష్ణ గారూ!

వాల్మీకి తరపున మీరే రాసేశారుగా? అయితే ఈ కవి మాత్రం అమెరికా, ఎర్రదేశాలూ, ఆఖరికి బ్లాగులూ కూడా తెలిసిన ఆధునిక వాల్మీకి! అంతే కాదు; విషవృక్షమూ, దాన్ని రాసిన రచయిత్రీ కూడా ఆయనకు తెలుసన్నమాట! :)

‘రామాయణ విషవృక్షం’ అన్నపేరు చూసి భగ్గున మండిపోతూ దాన్ని చదవకుండానే దానిపై వ్యతిరేకత పెంచుకున్నవారిని చాలామంది నాకు తెలుసు. అది విశ్వనాథ రామాయణ కల్పవృక్ష (పద్య) కావ్యానికి విమర్శ అని పొరబడినవారూ ఉన్నారు.

శివ గారూ!

నిజమే.. ఈ వ్యాసం పరిధిని ఉల్లంఘించిన వ్యాఖ్యలు ఎక్కువగానే ఉన్నాయి!

అజ్ఞాత చెప్పారు...

నా వ్యాఖ్య వేసుకొన్నందుకు ధన్యవాదాలు. నేను వ్యాఖ్య వ్రాసిన ఉద్దేస్యం, ఎవరి గురించో మనని మనం[భారతీయతని] తిట్టుకోవటం చూసి. అంతే, ఏ ఇజాలకి వ్యతిరేకం కాదు. మన దేశంలోని అభ్యుదయ వాదులందరూ ఒకే ఒక్క విషయం మీద పైకొచ్చిన వారే... అదే మన సంస్కృతిని మనం తిట్టు కోవటం ద్వారా. అలా చేస్తేనే బయట దేశం వాళ్ళు మనని ఆకాశానికి ఎత్తేస్తారు. ఉదాహరణకి చూడండి మనకి ఎన్నో మంచి సినిమాలు వుండగా కేవలం "స్లం డాగ్" కే అవార్డు వచ్చింది. అదీ సంగతి.