మంచి తెలుగు సినిమా పాటలంటే నాకు ఎక్కువగా గుర్తొచ్చేవి ఇళయరాజా సంగీతం సమకూర్చినవే. అందులోనూ 80ల్లో ఆయన స్వరపరిచినవి చాలా మధురంగా అనిపిస్తాయి.
సాధారణంగా ఇళయరాజా పాటలంటే కేవలం ట్యూన్ మాత్రమే విని ఊరుకునేలా ఉండవు. నేపథ్య సంగీతంలోని సూక్ష్మమైన మెరుపులు ఒకోసారి పల్లవీ, చరణాల అందాలను మించిపోతుంటాయి. కోరస్ ను పాటల్లో అంత అద్భుతంగా ఉపయోగించిన సంగీత దర్శకులు (తెలుగులో) మరెవరూ లేరు!
భారతీరాజా మూడు దశాబ్దాల క్రితం తీసిన ‘కొత్త జీవితాలు’ నేనింతవరకూ చూళ్ళేదు. కానీ ఆ సినిమాలోని పాటలంటే ఇష్టం.
సుశీలా, జానకీ కలిసి పాడిన ‘తం తననం’పాట దీనిలోదే.
(అన్నట్టు- ఈ ఇద్దరు గాయనులూ కలిసి పాడిన తెలుగు పాటలు ఎన్నో, అవేమిటో ఎవరైనా చెప్పుకోండి చూద్దాం!)
కొత్త జీవితాలు సినిమాలో నాకు బాగా ఇష్టం-‘పొంగిపొరలే ..అందాలన్నీ పొంగిపొరలే’ పాట. నేను ఇష్టపడే వందల పాటల జాబితా రాస్తే... ఇది తప్పనిసరిగా ఉంటుంది!
వందలసార్లు విన్నా ప్రతిసారీ తాజాగానే అనిపిస్తుంటుంది. సినారె రాసిన ఈ గీతాన్ని బాలూ, జానకీ ఎంతో శ్రావ్యంగా పాడారు. మీరు ఈ పాట ఎన్నోసార్లు వినివుంటారు. అయినా ఇక్కడ చూడండి... ఆస్వాదించండి... ఇళయరాజా స్వర ఇంద్రజాలాన్ని!
‘కన్నె మదిలో ..అందాలన్నీ పొంగిపొరలే
కన్నె మదిలో ..అందాలన్నీ పొంగిపొరలే
కోనల్లోనా.. లోయల్లోనా నేలపైనా నింగి కదలే.. వన్నెకాడు నన్ను కలిసే!’ అంటూ జానకి తన గళంలో ముగ్ధ సౌందర్యం ఒలికిస్తారు, పలికిస్తారు.
మొదటి చరణం బాలూ గొంతులో ఇలా మొదలవుతుంది.
‘పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా..
పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా..
పవనాలే జిల్లనగా .. హృదయాలే ఝల్లనగా ... ’ ...
మళ్ళీ పల్లవిలోకి దారితీస్తుంది. ఆ తర్వాత..
‘కుకుకుక్కూ...’ అంటూ స్థాయీ భేదాలతో జానకి స్వర విన్యాసం, బహుళ గళాల ప్రతిధ్వని తోడై పరశింపజేస్తుంది.
వేణువూ, వీణా అద్భుత గానామృతంలో సమ్మిళితమవుతాయి. కోయిల కూతలూ, కోవెల గంటలూ తీయని నేపథ్య సంగీతంలో భాగమై పాటలో ఒదిగిపోతాయి.
చరణం ముగింపులో మొదలై పల్లవిలోకి అందమైన ప్రయాణం చేసే గాయనీ గాయకుల ఆలాపనలు ఈ పాట ప్రత్యేకత.
రెండో చరణంలో..
‘కన్నుల్లో మౌనం.. కన్నుల్లో మౌనం.. నవ్వుల్లో గానం... అది నా కోసం’ అనే వ్యక్తీకరణ చాలా బావుంటుంది.
ఇళయరాజా ప్రతిభా విశేషాలు బహుముఖ వికాసం పొందుతున్న తరుణంలో రూపొందిన పాట ఇది!