అంతేనా? ఆ ఇద్దరికీ తెలుగు కథలంటే బాగా ఇష్టం.
అందుకే ‘ఒక్క కథ! ఒక్కటంటే ఒక్కటి అచ్చయితే బాగుణ్ణు’ అని తపించేవారు!
ఇదంతా 35 ఏళ్ళ కిందటి ముచ్చట. కాలం గిర్రున తిరిగింది. కథకులవ్వాలని అంతగా కోరుకున్న ఆ మిత్రుల ఆశలు ఫలించాయా?
ఆ ఇద్దరిలో ఒకరు వంశీ!
వెండితెర దర్శకుడిగా వెలిగినా సాహిత్యం లోనే ఉంది ఆయన ఆత్మ. అనుభవాలనూ జ్ఞాపకాలనూ అతి సూక్ష్మ వివరాలు కూడా వదిలిపెట్టకుండా అందమైన కథలుగా చెక్కటంలో ఆరితేరారు. యాభై కథలకు పైగా రాశారు.
మరొకరు ఎ.ఎన్. జగన్నాథశర్మ. పాత్రికేయునిగా, సినీ టీవీ రచయితగా ప్రసిద్ధులయ్యారు. ఐదు వందల కథలు రాశారు.
ఈ మధ్యనే ఆయన తొలి కథా సంకలనం ‘పేగు కాలిన వాసన’ విడుదలైంది. పేదరికం, దిగువ మధ్యతరగతి ప్రజల వ్యథలను ఇతివృత్తాలుగా తీసుకుని, చక్కటి కథలుగా మలిచారు. వాటిలో చాలా కథలు నాకు నచ్చాయి.
నిప్పుబొమ్మ, గాజుపెంకులు, ఎర్రనీళ్ళ వాన, చేతులు తెగిన హృదయం, తెగిపడిన పావురం రెక్క- ఇలా.. శీర్షికలూ విలక్షణమే!
‘గోదావరి మీద ఎండ తీక్షణంగా ఉంది. గాజుకెరటాలతో ఎండ మెరుస్తోంది’.. ఇలాంటి వర్ణనలు సంకలనం నిండా బోలెడు. కథలను పఠనీయం చేయటంలో వాటి పాత్ర కూడా ఉంది!
కథా సంకలనానికి ఏ పేరు పెట్టాలనేది రచయిత ఇష్టానికి సంబంధించింది. ‘పేగు కాలిన వాసన’ అనేది కథకు శీర్షికగా సముచితమే. కానీ పుస్తకానికి ఈ పేరు కాకుండా మరే కథ పేరైనా పేరు పెట్టివుంటే బావుండేదనిపించింది. (అసలు కథా సంకలనాలకు పుస్తకంలో ఉన్న ఏదో ఒక కథ పేరు పెట్టెయ్యటం మాత్రం ఏం సమంజసం?)
ఈ పుస్తకం గురించి ‘ఈనాడు ఆదివారం’ మ్యాగజీన్ లో రాసిన క్లుప్త సమీక్షను ఇక్కడ ఇస్తున్నాను.
8 కామెంట్‌లు:
మంచి రచయితల్ని పరిచయం చేసారు. పేగు కస్లిన వాసన పేరు వింటేనే గుండె భారమయిపోతోంది
కథా సంకలనాలను ఆ పుస్తకంలో ఉన్న ఏదో కథ పేరుతో విడుదల చేసేయడం నేను కూడా చాలాసార్లు గమనించాను. ఇలా కాకుండా పుస్తకంలోని కథల్లో ఏయే అంశాల్ని స్పృశించారో వాటిని సూచించేలాగా ఒక సృజనాత్మకమైన పేరు జోడిస్తే బాగుండు కదా అని నాకు చాలా సార్లు అనిపిస్తుంది.
మంచి పరిచయం
నవ్య వారపత్రికలో వంశీ ఇంటర్వ్యూ ఉంది -
www.navyaweekly.com
Sowmya : థాంక్యూ.
కొ్త్తపాళీ గారూ, ధన్యవాదాలు.
రవిచంద్రా, కథా సంకలనాలకు పెట్టే పేర్ల విషయంలో నాకో తోడు దొరికిందన్నమాట!:)
సుజాతా, వారిద్దరూ బాల్యమిత్రులని నాకూ కొద్ది రోజుల క్రితమే తెలిసింది! జగన్నాథశర్మ గారి కథలపై మీ విశ్లేషణ చాలా బావుంది. థాంక్యూ.
Srinivas గారూ, నవ్య వారపత్రికలో వంశీ ఇంటర్వ్యూ చదివానండీ. ఆ ఇంటర్వ్యూ కోసం ఆర్టిస్టు ‘పినిశెట్టి’ చిత్రించిన వంశీ వర్ణచిత్రాన్నే నా టపాలో ఉపయోగించాను!
చాలా ఆలస్యంగా స్పందిస్తున్నా..మన్నించాలి.
జగన్నాథశర్మగారితో పాటు పార్వతీపురం రైల్వేస్టేషన్ లో సిమెంట్ బెంచ్ మీద కూర్చొని భవిష్యత్ ని టెక్నికలర్ కలలు కంటున్న మిత్రుల్లో పంతుల జోగారావుగారు(ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత) కూడా ఉన్నారు. ఇప్పటికీ శర్మగారికి ప్రాణమిత్రులే. జగన్నాథశర్మగారి గురించి పంతుల జోగారావుగారు తన కథామంజరి బ్లాగులో రాసిన విశేషాలు చదవండి.
http://kathamanjari.blogspot.com/2011/01/blog-post.html
కామెంట్‌ను పోస్ట్ చేయండి