మంచి తెలుగు సినిమా పాటలంటే నాకు ఎక్కువగా గుర్తొచ్చేవి ఇళయరాజా సంగీతం సమకూర్చినవే. అందులోనూ 80ల్లో ఆయన స్వరపరిచినవి చాలా మధురంగా అనిపిస్తాయి.
సాధారణంగా ఇళయరాజా పాటలంటే కేవలం ట్యూన్ మాత్రమే విని ఊరుకునేలా ఉండవు. నేపథ్య సంగీతంలోని సూక్ష్మమైన మెరుపులు ఒకోసారి పల్లవీ, చరణాల అందాలను మించిపోతుంటాయి. కోరస్ ను పాటల్లో అంత అద్భుతంగా ఉపయోగించిన సంగీత దర్శకులు (తెలుగులో) మరెవరూ లేరు!
భారతీరాజా మూడు దశాబ్దాల క్రితం తీసిన ‘కొత్త జీవితాలు’ నేనింతవరకూ చూళ్ళేదు. కానీ ఆ సినిమాలోని పాటలంటే ఇష్టం.
సుశీలా, జానకీ కలిసి పాడిన ‘తం తననం’పాట దీనిలోదే.
(అన్నట్టు- ఈ ఇద్దరు గాయనులూ కలిసి పాడిన తెలుగు పాటలు ఎన్నో, అవేమిటో ఎవరైనా చెప్పుకోండి చూద్దాం!)
కొత్త జీవితాలు సినిమాలో నాకు బాగా ఇష్టం-‘పొంగిపొరలే ..అందాలన్నీ పొంగిపొరలే’ పాట. నేను ఇష్టపడే వందల పాటల జాబితా రాస్తే... ఇది తప్పనిసరిగా ఉంటుంది!
వందలసార్లు విన్నా ప్రతిసారీ తాజాగానే అనిపిస్తుంటుంది. సినారె రాసిన ఈ గీతాన్ని బాలూ, జానకీ ఎంతో శ్రావ్యంగా పాడారు. మీరు ఈ పాట ఎన్నోసార్లు వినివుంటారు. అయినా ఇక్కడ చూడండి... ఆస్వాదించండి... ఇళయరాజా స్వర ఇంద్రజాలాన్ని!
‘కన్నె మదిలో ..అందాలన్నీ పొంగిపొరలే
కన్నె మదిలో ..అందాలన్నీ పొంగిపొరలే
కోనల్లోనా.. లోయల్లోనా నేలపైనా నింగి కదలే.. వన్నెకాడు నన్ను కలిసే!’ అంటూ జానకి తన గళంలో ముగ్ధ సౌందర్యం ఒలికిస్తారు, పలికిస్తారు.
మొదటి చరణం బాలూ గొంతులో ఇలా మొదలవుతుంది.
‘పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా..
పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా..
పవనాలే జిల్లనగా .. హృదయాలే ఝల్లనగా ... ’ ...
మళ్ళీ పల్లవిలోకి దారితీస్తుంది. ఆ తర్వాత..
‘కుకుకుక్కూ...’ అంటూ స్థాయీ భేదాలతో జానకి స్వర విన్యాసం, బహుళ గళాల ప్రతిధ్వని తోడై పరశింపజేస్తుంది.
వేణువూ, వీణా అద్భుత గానామృతంలో సమ్మిళితమవుతాయి. కోయిల కూతలూ, కోవెల గంటలూ తీయని నేపథ్య సంగీతంలో భాగమై పాటలో ఒదిగిపోతాయి.
చరణం ముగింపులో మొదలై పల్లవిలోకి అందమైన ప్రయాణం చేసే గాయనీ గాయకుల ఆలాపనలు ఈ పాట ప్రత్యేకత.
రెండో చరణంలో..
‘కన్నుల్లో మౌనం.. కన్నుల్లో మౌనం.. నవ్వుల్లో గానం... అది నా కోసం’ అనే వ్యక్తీకరణ చాలా బావుంటుంది.
ఇళయరాజా ప్రతిభా విశేషాలు బహుముఖ వికాసం పొందుతున్న తరుణంలో రూపొందిన పాట ఇది!

10 కామెంట్లు:
excellent. thanks వేణు గారు. vintage Ilayaraja at his best. పాట చిత్రీకరణ కూడా typical భారతి రాజా శైలిలో ఎంత బాగుంది. vibrant colours. ఇంకా ఇటువంటి పాత బంగారాలను బ్లాగులో కొత్త తరం వారికి వినిపించమని మనవి.
వేణూ గారూ,విశ్లేషనాత్మకంగా చాలా చక్కగా రాశారు. ఈపాట ఈ మధ్య అసలు వినలేదు .మంచిపాటను గుర్తు చేసారు .ఇళయరాజాగారికి నేను పెద్ద ఫాను, ఏ.సీ అన్నీ .
వీలయితే మౌనగీతం పాటలు present చేయగలరు[సుహాసిని..మోహన్..ప్రతాప్ పోతన్..]director గుర్తు లేరు
తెలుగు అభిమాని గారూ, ఈ పాట చిత్రీకరణలో భారతీరాజా శైలి చూస్తుంటే ‘దాన్ని అనుకరించకుండా ఉండటానికి చాలా కష్టపడ్డాన’ని చెప్పిన వంశీ టేకింగ్ గుర్తొస్తుంది.
రాధిక (నాని) గారూ, థాంక్యూ. 30 ఏళ్ళ కిందటిదా అనిపిస్తుంది ఈ పాటను తల్చుకుంటుంటే!
Kvsv గారూ, మౌనగీతం లోని ‘పరువమా చిలిపి పరుగుతీయకు’ పాట గురించి ఇంతకుముందు ఓ టపాలో రాశాను. (అయితే అప్పుడు వీడియో పెట్టలేదు). ఈ సినిమా దర్శకుడు మహేంద్రన్ అనుకుంటా.
సుజాతా, ఇళయరాజా సంగీతంలో ప్రత్యేకత గురించి బాగా చెప్పారు. థాంక్యూ! రెండు చరణాలూ ఒకేలా కాకుండా భిన్నంగా ఉండటం ఈ పాట మరో విశేషం.
బలే మంచి పాటలను గుర్తు చేసేరండి. తం తననం పాటలో కూడా సుశీల, జానకి గార్ల గొంతులు వింటుంటే అదేదో మేఘాల మీద అలవోక తేలి వెళి పోతున్నట్లు వుంటుంది ప్రాణం. చాలా ఇష్టమైన పాటలు చూడటమంటే నాకు ఇష్టం వుండదు, అందుకే ఈ సినిమా నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇళయ రాజా గారి థీమ్ మ్యూజిక్ లు నభుతో నభవిష్యత్ కదా.. నా దగ్గర కొన్ని వున్నాయి టైం చూసి అప్ లోడ్ చెయ్లి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు వేణు గారు.
భావన గారూ, థాంక్యూ. ఇళయ రాజా థీమ్ మ్యూజిక్ ను మరి వీలైనంత త్వరగా అప్ లోడ్ చేయండి.
వేణు గారు,
ఈ కామెంట్ ఇక్కడ రాయొచ్చొ లేదొ తెలియదు, మీ పాత పొస్ట్ ల లొ సాగర సంగమం సినిమా గురించి మొన్ననే చదివాను, చాల బాగా రాసరండి! నాకు చాలా నఛ్ఛిన సినిమాల లిస్ట్ లొ ఆ సినిమా ముందు వరసలొ ఉంటుంది,మీరు రాసిన విషయాలు కూడా నేను అనుకున్నవే. మానవ సంబధాల లొని సున్నితత్వాన్ని స్పృరుషించడంలొ విశ్వనాథ్ గారి తర్వాతే ఎవరైనా. సాగర సంగమం లొ ఇంకో ఇన్సిడెంట్ లొ జయప్రద ఇంట్లొ కమల్ హసన్, జయప్రద ఫొటొ తీసుకునేప్పుడు కెమెరా సెట్ చేసి కమల్ హసన్ "నాకు మీ పక్కన కొంచం చొటివ్వండీ" అనే డైలాగు మమూలుగా అన్న ఎక్కడొ మనసు లొతుల్లొ టచ్ చేస్తుంది.
ఇక పొతే మీరు కామెంట్స్ లొ సాగర సంగమం అంటే అర్దం ఎంటో ఎవరికైన తెలిస్తే చెప్పమన్నారు కదా?,
సాగరం లేక సముద్రం ఎన్నొ నదుల సంగమం, నదులు వేరు వేరు ప్రదేశాలనించి వచ్ఛి సాగరం లొ కలుస్తాయి,అలాగే ఈ సినిమాలోని వ్యక్తులందిరికి ఒక్కొకరికీ ఒక్కొ కళలొ ప్రవేశం ఉంటుంది, అలాంటి వ్యక్తులందరీ కలయికే సాగర సంగమం", అని నా అభిప్రాయం
అపర్ణ
hello... hapi blogging... have a nice day! just visiting here....
కామెంట్‌ను పోస్ట్ చేయండి