రకరకాల గోళాలన్నీ కదలి వస్తూ, ఎగిరిపోతూ ఒక విస్ఫోటనం జరుగుతున్నట్టుంది కదూ...!
అంతే కాదు, తలను పక్కకు వంచి కళ్ళు మూసుకుని, దీర్ఘాలోచనలో ఒక స్త్రీ మొహం కూడా కనపడుతోంది, చూశారా?
‘గాలాటీ ఆఫ్ ద స్ఫియర్స్ ’ అనే ఈ ఆయిల్ పెయింటింగ్ ని స్పానిష్ అధివాస్తవిక చిత్రకారుడు సాల్వడార్ డాలీ 1952లో వేశాడు.
ఈ బొమ్మను తమిళ సినిమా ‘అన్బే శివం’ లోగోలో వాడుకున్నారు.
కానీ స్త్రీ బదులు కమల్ హాసన్ రూపం కనపడేలా మార్చారు.
తెలుగులో ఈ సినిమా ‘సత్యమే శివం’ (2003) అనే పేరుతో అనువాద చిత్రంగా విడుదలయింది.
సత్యమే శివం లోగోలో మాత్రం ఎలాంటి బొమ్మా ఉండదు.
నాకిష్టమైన సినిమాల్లో ఇదొకటి.
కథ ఇతివృత్తం, సున్నితమైన- చురుకైన హాస్యం, కమల్, మాధవన్ ల నటన, సంగీతం... ఇవన్నీ ఎంతో బాగుంటాయి.
డాలీ బొమ్మలో స్త్రీ రూపం చూడగానే తెలిసిపోతుంది. కానీ పరిశీలించి చూస్తే గానీ దాగివున్న అంశాలు కనపడని పెయింటింగ్ ‘సత్యమే శివం’లో ఉంది.
ఈ సినిమాలో కమల్ హాసన్ ఫ్యాక్టరీ కార్మికుడు, వీధి నాటక కళాకారుడు, ఆధునిక చిత్రకారుడు; ముఖ్యంగా ‘కామ్రేడ్’.
కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా నెలకు 910 రూపాయిల జీతమిచ్చి పనిచేయించుకునే పెట్టుబడిదారుడు నాజర్.
అతడి కోసం శివుడి పెయింటింగ్ వేసే పని ఒప్పుకుని ఆ పని పూర్తి చేస్తాడు కమల్.
ఆ పెయింటింగ్ మామూలుగా చూస్తే తపస్సు చేస్తున్న శివుడి రూపంలాగే ఉంటుంది.
దానిలో నెలవంకను కమ్యూనిస్టు చిహ్నమైన కొడవలిగా, దానిలోపల సుత్తిని కూడా తెలివిగా ఇముడుస్తాడు.
కుడిపక్కన ఏకంగా కార్ల్ మార్క్స్ బొమ్మ! ఇది పరిశీలిస్తే గానీ కనపడని రీతిలో ఉంటుంది.
( కార్మికులను పీడించి వారి శ్రమ ఫలితం దోచుకునే పెట్టుబడిదారుడి ఇంట్లో కార్ల్ మార్క్స్ బొమ్మ... భలే ఉంది కదూ!)
అన్నిటికంటే మించి... నాజర్ కార్మికులకు ఇచ్చే నెల జీతం 910 అంకెలను శివుడి జటాజూటం నుంచి కిందకు జారే గంగాజలం పాయలుగా చిత్రీకరిస్తాడు.
శివుడి రూపం తన రూపాన్ని పోలివుండేలా వేయటం మరో విశేషం.
శివుడి తలచుట్టూ గోళాలు సాల్వడార్ డాలీ బొమ్మను స్ఫురింపజేస్తాయి.
(డాలీ బొమ్మ అయినా , శివుడి బొమ్మ అయినా కళ్ళు మూసుకునే ఉండటం ఓ విశేషం)
ఈ పెయింటింగ్ లోని మర్మం గురించి ‘సత్యమే శివం’లో నాజర్ కి మొత్తానికి తెలిసిపోతుందనుకోండీ. తర్వాత కథ మలుపులు తిరుగుతుంది. ఆ విషయాలు ఇక్కడ అవసరం లేదు. సి. సుందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మాత్రం చూసి తీరాల్సినది!
ఈ పెయింటింగ్ లోని మర్మం గురించి ‘సత్యమే శివం’లో నాజర్ కి మొత్తానికి తెలిసిపోతుందనుకోండీ. తర్వాత కథ మలుపులు తిరుగుతుంది. ఆ విషయాలు ఇక్కడ అవసరం లేదు. సి. సుందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మాత్రం చూసి తీరాల్సినది!
* * *
సాల్వడార్ డాలీ పెయింటింగ్ వేసిన కొద్ది నెలల్లోనే (1953 మార్చిలో) ఇక్కడ మన కొడవటిగంటి కుటుంబరావు గారు చందమామ మాసపత్రికలో ఓ ఆసక్తికరమైన కథ రాశారు.
( నిజానికి ఈ రెంటికీ నేరుగా ఏమీ సంబంధం లేదు. కానీ ఆలోచిస్తే... ఒక సారూప్యత ఉందనేది నా ఉద్దేశం)
ఇద్దరిలో రూపురేఖలు ఒకేలా ఉంటే ‘అచ్చు గుద్దినట్టు’ ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి లాగా ఉన్నాడని అంటారు.
ఇద్దరిలో రూపురేఖలు ఒకేలా ఉంటే ‘అచ్చు గుద్దినట్టు’ ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి లాగా ఉన్నాడని అంటారు.
కానీ గమనింపుతో చూసి... పట్టించుకోనంతవరకూ కొన్నిసార్లు ఆ పోలికలు కనపడవు.
కొ.కు. రాసిన కథ పేరు ‘రాతిలోని ముఖం’. చివరి వరకూ విషయం తెలియకుండా కొంత ఉత్కంఠను పెంచుతూ ఈ కథ రాశారాయన.
ఓ కొండమీద రాతిలో ప్రకృతి సిద్ధంగా ఓ ముఖాకృతి ఏర్పడి ఉంటుంది. ఆ రాతిలోని మనిషి పోలిక ఉన్నవాడి వల్ల చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు ఉపకారాలు జరుగుతాయని ఓ ముని చెప్తాడు.
ఆ మాటలు గాఢంగా నమ్మిన వసువు అనే కుర్రవాడు అలాంటి పోలికలున్న వ్యక్తి వచ్చి ఊరికి మేలు చేస్తాడని ఎదురుతెన్నులు చూస్తుంటాడు.
మరి అతడి నిరీక్షణ ఫలించిందా? లేదా?
శంకర్ బొమ్మలతో ఉన్న ఆ చిన్న కథ ఇక్కడ ఇస్తున్నా, చదివి ఆనందించండి.
ఈ కథలో రాతిలోని ముఖం పోలికలున్న మనిషి దొరుకుతాడో లేదో, దొరికాడో లేడో చివరికి గానీ మనకు తెలియదు. అసలు నిజం తెలిశాక భలే అనిపిస్తుంది.
మరి సాల్వడార్ డాలీ వేసిన బొమ్మ?
మరి అతడి నిరీక్షణ ఫలించిందా? లేదా?
శంకర్ బొమ్మలతో ఉన్న ఆ చిన్న కథ ఇక్కడ ఇస్తున్నా, చదివి ఆనందించండి.
ఈ కథలో రాతిలోని ముఖం పోలికలున్న మనిషి దొరుకుతాడో లేదో, దొరికాడో లేడో చివరికి గానీ మనకు తెలియదు. అసలు నిజం తెలిశాక భలే అనిపిస్తుంది.
మరి సాల్వడార్ డాలీ వేసిన బొమ్మ?
చూడగానే వింతగా అనిపిస్తుంది. వేగంగా పరిభ్రమించే గోళాలు మాత్రమే అక్కడున్నాయి. కానీ వాటి వల్ల స్త్రీ రూపం నేరుగా ఏర్పడింది కాదు. అది పరోక్ష ఫలితమే.
ఈ రూపం ఆయన భార్య గాలా ది. ఈ బొమ్మ అణుసిద్ధాంతాన్ని సూచిస్తుందనీ, దీనిలో అణువులోని పార్టికల్స్ ను సూచించాడనీ అంటారు. ఈ పెయింటింగ్ అంతరార్థం గురించి ఎన్నో విశ్లేషణలు వచ్చాయి.
దీన్ని త్రీడీలో చూస్తే ...
ఇలా ఉంటుంది. (నిమిషన్నర కూడా నిడివి లేని చిన్న వీడియో...)
ఈ రూపం ఆయన భార్య గాలా ది. ఈ బొమ్మ అణుసిద్ధాంతాన్ని సూచిస్తుందనీ, దీనిలో అణువులోని పార్టికల్స్ ను సూచించాడనీ అంటారు. ఈ పెయింటింగ్ అంతరార్థం గురించి ఎన్నో విశ్లేషణలు వచ్చాయి.
దీన్ని త్రీడీలో చూస్తే ...
ఇలా ఉంటుంది. (నిమిషన్నర కూడా నిడివి లేని చిన్న వీడియో...)
ఇప్పుడో చిన్న క్విజ్...
ఇక్కడున్న ఈ బొమ్మలో ఎన్ని జంతువులున్నాయి?
ఇక్కడున్న ఈ బొమ్మలో ఎన్ని జంతువులున్నాయి?
3 అని ఎవరూ చెప్పరనుకుంటాను.
4 అని గానీ,
5 అని గానీ - చెపుతారు ఎక్కువమంది.
కాస్త తేరిపార చూస్తే కనపడే జంతువులు మాత్రం 6!
పరిశీలనగా చూస్తేనే అంతరార్థం బోధపడే కళలో (ముఖ్యంగా చిత్ర, శిల్ప కళల్లో ) ప్రత్యేకత ఉంటుంది. ఎంతో ఆకర్షణ కూడా!
14 కామెంట్లు:
తెలుగుబ్లాగులు నడపడం, చదవడం శుద్ధ దండగ అని అందరూ అనుకుంటారు గానీ మీలాంటి బ్లాగర్ల బ్లాగులు చదువుతుంటే వాళ్ళ మాటలు పట్టించుకోనవసరం లేదనిపిస్తుంది. తెలియని విషయాలు తెలియపరుస్తున్నందుకు ధన్యవాదాలు !
బొమ్మల్లో బొమ్మలు. బాగున్నాయి వేణుగారు. interesting. రాతి లోని ముఖం లేక రాయి లోని ముఖం అనటం సరైనదా?. సత్యమే శివం మంచి చిత్రం.
@ నీహారిక : థాంక్యూ.
@ తెలుగు అభిమాని: రాయికి సంబంధించిన అనే అర్థంలో రాతి. రాతిలోని ముఖం అనటమే సరైనది. (నుయ్యికి సంబంధించిన అనే అర్థంలో నూతి అంటాం కదా? అలా).
వేణూ గారు, "రాయికి సంబంధించిన అనే అర్థంలో రాతి. రాతిలోని ముఖం అనటమే సరైనది. " అన్నారు.
నాకు అలా అనిపించలేదు.
నాకున్న రవ్వంత వ్యాకరణ జ్ఞానంతో, నాకు అనిపించింది రాస్తాను. మీ అభిప్రాయం చెప్పండి.
రాయి - నామ వాచకము. (noun).
రాతి - నామ వాచకము కాదు. విశేషణం. (Adjective)
"రాయి యొక్క విషయం" అని చెప్పడానికి, "రాతి విషయం" అని అంటాము. అంటే, ఆ "యొక్క" అనే విభక్తి ప్రత్యయం కలిసి, "రాయి", "రాతి"గా మారింది. "రాయి లాంటి మనిషి" అంటాము గానీ, "రాతి లాంటి మనిషి" అని అనము, కదా? "రాతి మనిషి" అంటాము. అలాగే, "రాయి రాచ్చిప్పలో పులుసు" కన్నా, "రాతి రాచ్చిప్పలో పులుసు" అన్నదే ఎక్కువ కరెక్టుగా అనిపిస్తుంది. అలాగే, "నుయ్యి", "నూతి" కూడా.
రిఫరెన్సు కోసం ఇక్కడ ఇస్తున్నాను:
రాతిpermalink
రాతి : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903 Report an error about this Word-Meaning
rāti
[infl.
1. Tel of రాయి.] adj.
2. Made of stone. రాతితోచేసిన.
రాతి : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953 Report an error about this Word-Meaning
inflection of రాయి.
a.
1. made of stone, resembling a stone or rock, stony, rocky, flint-like, flinty, hard;
2. obdurate.
ప్రసాద్
ప్రసాద్ గారూ,
‘రాతి’ అనేది విశేషణంలాగా కనిపించే ఔప విభక్తికం. (ఉప విభక్తిలోంచి ఈ పదం వచ్చింది)
అంటే it is a noun but used in an irregular form.
కాలు, గోరు, నీరు, కన్ను, నేయి, గోయి, నూయి, రాయి...
ఈ నామవాచకాలే ఔప విభక్తికాలుగా మారితే వచ్చే రూపాలు-
కాలి, గోటి, నీటి, కంటి, నేతి, గోతి, నూతి, రాతి.
(వ్యాకరణ పరిభాషలో ఈ పదాలు ఇ, టి, తి వర్ణాలుగా మారాయన్నమాట, )
వీటితో తయారయ్యే పద బంధాలు...
కాలి నడక
గోటి ముద్ర
నీటి కడవ
కంటి చూపు
నేతి చుక్క
గోతి కాడ నక్క
నూతి చప్టా
రాతి రథం
ఔప విభక్తికాల స్థానంలో నామవాచక రూపాలు పెడితే ఈ పద బంధాలు సహజంగా కాకుండా కృత్రిమంగా తయారవుతాయి.
వేణూ గారూ,
నేను చదువుకునే రోజుల్లో, తెలుగు 70 మార్కులకూ, సంస్కృతం 30 మార్కులకూ వుండేవి. 'ఏ' సెక్షన్లో వేస్తారని 7వ తరగతిలో సంస్కృతం తీసుకున్నాను. అప్పటికే, భగవద్గీత తెగ కంఠస్తం పట్టేవాడిని, కాబట్టి సంస్కృతం చాలా సులభం అనుకున్నాను. ఆ విధంగా, నాకు తెలుగూ రాలేదు, సంస్కృతమూ రాలేదు సరిగా. ఇక కాలేజీలో హిందీ మిడికాను. అది బొత్తిగా రాదు. చదివిన చదువు అంతా కంఠస్త పట్టడమేగా, ఒకటో క్లాసు నించీ, పోస్టు గ్రాడ్యుయేషన్ వరకూ.
ఈ "ఔప విభక్తికం" అన్న మాట ఇప్పటి వరకూ వినలేదు ఎప్పుడూ. దీనర్థం ఇది తప్పని కాదు. నేను వినలేదు అంతే. దీనర్థం మిగిలిన వన్నీ వినేశానని కూడా కాదు. ఇది మాత్రం వినలేదని మాత్రమే, దీనర్థం.
చాలా బాగుంది మీ వివరణ. ఈ పదం, దీనర్థం ఇక ఎప్పుడూ మర్చిపోను. ఈ పదాలని "ఔప విభక్తికం" అంటారని ఒక కొత్త విషయం నేర్చుకున్నాను.
ఒక విషయంతో మాత్రం ఇంకా విభేదమే నాకు.
మీరు, "‘రాతి’ అనేది విశేషణంలాగా కనిపించే ఔప విభక్తికం." అని రాశారు. "విశేషణం లాగా కనిపించే" అని అంటే, అది "విశేషణం" కాదని స్పష్టంగా అర్థం వస్తుంది. అది సరి కాదని నా అభిప్రాయం.
కర్త అనేది, నామ వాచకం కావొచ్చు, సర్వ నామం కావొచ్చు.
అలాగే, "ఔప విభక్తికం" పదాన్ని విశేషణంగా వాడొచ్చు. ఒక పదం వాడిన విధానాన్ని పట్టి, అది విశేషణమా, కాదా అనేది తెలుస్తుంది. నామ వాచకాన్ని గాన్నీ, సర్వ నామాన్ని గానీ వివరించేది విశేషణమే. "రాతి మనిషి" అన్న మాటల్లో, "రాతి" అనే పదం, "మనిషి" అనే నామ వాచకాన్ని వివరిస్తుంది. కాబట్టి "రాతి" అనే పదం తప్పకుండా విశేషణమే. అయితే, మీరు చెప్పిన ప్రకారం "రాతి" అనే పదం, "రాయి" అనే పదం ఒక విభక్తి ప్రయోగంతో మారిన పదం కాబట్టి, అది "ఔప విభక్తికం" కూడా అవుతుంది. "ఔప విభక్తికం" పదం విశేషణంగా వాడకూడదని ఎక్కడా లేదు కదా? ఇంగ్లీషులో అయితే, చాలా సార్లు నామ వాచకాన్ని కూడా విశేషణంగా వాడతారు. ఇంతకు ముందర పోస్టులో, నేను, ఒక ఆన్లైన్ నిఘంటువు నించీ కాపీ చేసి ఇచ్చాను వివరాలు - అక్కడ కూడా ఆ పదం విశేషణం అని వుంది.
ఒక వాక్యంలో, ఏ పదం అన్నా నామ వాచకాన్ని గానీ, సర్వ నామాన్ని గానీ వివరిస్తే, ఆ పదాన్ని విశేషణమే అంటారు. "రాతి" అనే పదం, విశేషణమూ, ఔప విభక్తికం - రెండూ అన్న మాట.
నా వివరణలో ఏదన్నా తప్పుగా తోస్తే, వివరించండి.
మీరు, "ఔప విభక్తికాల స్థానంలో నామవాచక రూపాలు పెడితే ఈ పద బంధాలు సహజంగా కాకుండా కృత్రిమంగా తయారవుతాయి. " అని కూడా రాశారు. చాలా బాగుంది. "రాయి మనిషి" అనేది కృత్రిమంగా వుంటుందనీ, "రాతి మనిషి" అనేది సహజమనీ దీనర్థం కదా? బాగుంది. అయితే, ఇది అన్ని వేళలా కాదనుకుంటాను. కొన్ని పదాలకి "ఔప విభక్తిక" రూపం వుండక పోవచ్చు.
"అన్నం" అనే పదం తీసుకోండి. అది నామ వాచకం. "అన్నం గరిటె" అని అన్నప్పుడు, ఇక్కడ, "అన్నం" అనే పదం విశేషణం అవుతుంది. అలాగే, "కూర గిన్నె" కూడా. ఎటొచ్చీ, "నేతి చుక్క" అన్నప్పుడు, "నేతి" అనే పదం "విశేషణం", "ఔప విభక్తికం" - రెండూ అన్న మాట.
అంటే, ఒక పదానికి, "ఔప విభక్తిక" రూప పదం వుంటే, విశేషణంగా అదే వాడాలి, నామ వాచకాన్ని వాడకూడదు. "ఔప విభక్తిక" రూప పదం లేక పోతే, నామ వాచకాన్నే విశేషణంగా కూడా వాడతారు. ఇంగ్లీషులో కూడా ఇంతే. అన్ని నామ వాచకాలకీ విశేషణ పదాలు లేవు. అప్పుడు, నామ వాచకాన్నే విశేషణంగా కూడా వాడతారు.
ఇది సార్, నాకు అర్థం అయింది. తప్పులు వుంటే వివరించండి, నేర్చుకుంటాను.
ప్రసాద్
వేణు గారూ ...
కొడవటిగంటి వారి 'రాతి లోని ముఖం' కథ కీ ...
కొడవటి కంటి తో.. శివుడి బొమ్మ చిత్రించిన 'అన్బే శివం ' కీ ....
లంకె పెడుతూ సాగిన మీ కథనం బాగుంది .. కొత్త సంగతులు పలికింది .. తెలిపింది !!!
రామ్ ప్రసాద్
ప్రసాద్ గారూ!
మీ వివరణ సరిగా ఉంది. ఔపవిభక్తికం చాలాసార్లు విశేషణంగా కూడా ఉంటోంది.
కొన్నిచోట్ల మాత్రం అలా ఉండదు. ముఖ్యంగా ‘లో’, ‘మీద’ అనేవి కలిసినపుడు.
గోతిలో పడ్డాడు- అనేది చూడండి. ఇక్కడ ‘గోతి’ అనేది విశేషణంగా లేదు. ఇది ఔపవిభక్తికం మాత్రమే.
కంటి చూపు- లో కంటి అనేది విశేషణమైతే; కంటిలో నలక-లో అది విశేషణం కాదు.
రాతి మీద కూర్చున్నాను- అనే వాక్యం చూడండి. ఇక్కడ కూడా ‘రాతి’ అనేది కేవలం ఔపవిభక్తికం.
రామ్ గారూ,
వ్యాఖ్యలో మీ ముద్ర ఎప్పటిలాగే స్ఫుటంగా కనిపిస్తోంది.. కొడవటిగంటి- కొడవటి కంటి అనటంలో చమక్కు బాగుంది!
వేణు!ఈబ్లాగు నాకు చాలా ఆనందాన్ని కలిగించింది! ఇది ఒక కాలక్షేపం అనే అపోహ ఎవరికైనా వుంటే . . దాన్ని సమూలంగా తుడిచి పెట్టేట్టు వుంది నీకున్న భాషా ఙ్ఞానం విషయం పై అవగాహన చాలామంది అధ్యాపకుల్లోకూడా ఉండదని చెప్పడానికి సాహసిస్తున్నాను! సత్యమే శివం నాక్కూడా చాలా యిష్టమైన సినిమా!కమల్అభిమానిఐన మా సుజాత మేడంతో కలిసి ఆ సినిమా చూశాను!నాకర్థం కాని విషయం ఏంటంటే ఎక్కడెక్కడి విషయాలనో వెతుకొచ్చి ఏకసూత్రంలో ఇంతందంగా ముడెయ్యడం నీకెలా చేతయింది?ఎక్కడి చందమామ!మరెక్కడి డాలిబొమ్మ!ఇంకెక్కడి సినిమా!చదివాక మనసంతా తృప్తితో నిండిపోయింది!అభినందనలు
Thank you a lot Syamala, for your reaction and encouraging opinion!
మీ బ్లాగ్ చాలా interesting & informative గా వుంది. మిగిలినవి కూడా వీలు చేసుకుని చదవాలి అనుకుంటున్నాను. మీకు బోల్డన్ని చప్పట్లు!!!
Thank you very much!
కామెంట్‌ను పోస్ట్ చేయండి